నవంబర్ లో ఉంది అసలైన జాతర...విశాఖ సూపరేహే!
విశాఖకు నవంబర్ నెల చాలా కీలం కాబోతోంది అని ఐటీ మంత్రి నారా లోకేష్ చెప్పారు. టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్ వంటి సంస్థలు విశాఖకు రాబోతున్నాయని ఆయన చెప్పడం శుభ పరిణామంగా ఉంది.
By: Satya P | 15 Oct 2025 6:15 PM ISTవిశాఖ దశ తిరిగింది. ఏ ఎన్నిక వచ్చినా ఎన్ని పార్టీలు వచ్చినా కూడా ఏ ప్రభంజనం ఏపీలో వీచినా విశాఖ మాత్రం టీడీపీనే నమ్ముకుంది. ఆ పార్టీనే గెలిపిస్తూ వస్తోంది. 2019 ఎన్నికల్లో వైసీపీ సునామీ వచ్చినా కూడా విశాఖ మాత్రం సైకిల్ దిగలేదు. తాము టీడీపీ వైపే అని గట్టిగా చాటి చెప్పింది. అంతే కాదు వైసీపీ ప్రభుత్వం విశాఖను రాజధానిగా చేస్తామని చెప్పినా కూడా విశాఖ వాసులు మాత్రం ఆ వైపుగా మొగ్గు చూపించలేదు, టీడీపీకే తమ విశ్వసనీయతను చాటుకున్నారు. ఒక విధంగా చెప్పాలంటే విశాఖలో లక్షలాది జనమంతా టీడీపీకే దశాబ్దాలుగా కట్టుబడి పోయారు అని చెప్పాలి.
దానికి ఫలితం :
విశాఖ వాసులు చాలా మంచి వారు అని చంద్రబాబు అనేక సార్లు చెబుతూ వచ్చారు. వారు అభివృద్ధి కాములనని కూడా ఆయన అంటూంటారు. అంతే కాదు విశాఖ వాసులు ఎపుడూ ప్రశాంతతను కోరుకుంటారని వారి కోసం ఎంతైనా చేస్తామని కూడా బాబు స్టేట్మెంట్స్ ఇచ్చారు. తీరా ఇపుడు చూస్తే చంద్రబాబు తన ప్రభుత్వం అధికారంలోకి రాగానే విశాఖ వాసుల మీద తన ప్రేమను బలంగా చాటుకుంటున్నారు. అంతే కాదు విశాఖను తన విజన్ తో విశ్వనగరంగా రూపొందిస్తున్నారు.
వైజాగ్ లో గూగుల్ :
వైజాగ్ లో జీ ఉంది. ఆ లాస్ట్ లెటెర్ స్టాండ్ ఫర్ గూగుల్. ఇదొక్కటి చాలు విశాఖ ఎంతటి ఘన కీర్తిని ఆర్జించిందో చెప్పడానికి. విశాఖను ఐటీ హబ్ గా తీర్చిదిద్దుతామని చంద్రబాబు తరచూ చెప్పేవారు. ఇపుడు ఏఐ హబ్ గా మరో లెవెల్ కి తీసుకెళ్తున్నారు. అంతే కాకుండా విశాఖలో మరిన్ని ఐటీ దిగ్గజ పరిశ్రమలు ఏర్పాటు కాబోతున్నాయి. రానున్న కాలంలో ముంబై, చెన్నై, బెంగళూర్, హైదరాబాద్ లతో సరిసాటిగా మారబోతోంది.
గుడ్ న్యూస్ చెప్పిన లోకేష్ :
విశాఖకు నవంబర్ నెల చాలా కీలం కాబోతోంది అని ఐటీ మంత్రి నారా లోకేష్ చెప్పారు. టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్ వంటి సంస్థలు విశాఖకు రాబోతున్నాయని ఆయన చెప్పడం శుభ పరిణామంగా ఉంది. అంతే కాదు నవంబర్ 14, 15 తేదీలలో విశాఖలొ గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ ఉంది. ఆ మీట్ ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు విశాఖ రాబోతున్నాయని తెలుస్తోంది. అదే విధంగా బెంగళూరు నుంచి మరిన్ని పరిశ్రమలు తరలి వస్తాయని అంటున్నారు. దాంతో విశాఖ దశ తిరిగినట్లే అని అంటున్నారు.
నాలుగవ వంతు విశాఖలోనే :
విశాఖలో ఐటీ రంగంలో నంబర్ వన్ గా చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది అని అంటున్నారు. కేవలం ఈ ఒక్క ఫీల్డ్ లోనే అయిదు లక్షల దాకా ఉద్యోగావకాశాలు వస్తాయని అంటున్నారు. దాంతో విశాఖ రానున్న రోజులలో కేవలం ఏపీకి మాత్రమే కాదు దేశం మొత్తం ఉపాధి అవకాశాలను తీర్చే అతి పెద్ద జాబ్ సెంటర్ గా మారుతుందని అంటున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నది పాత నినాదం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నది కొత్త స్లోగన్. కూటమి ప్రభుత్వం ప్రస్తుతం ఈ స్లోగన్ తో ముందుకు సాగుతోంది. దీని ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకట్టుకుంటోంది అని అంటున్నారు. కేవలం ఎంవోయూలపై సంతకాలతో సరిపుచ్చకుండా ఆ ప్రాజెక్టులు అన్నీ గ్రౌండింగ్ అయ్యేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది అని నారా లోకేష్ చెబుతున్నారు. తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏపీకి ఇరవై లక్షల ఉద్యోగాలు కచ్చితంగా తీసుకుని వస్తామని ఆయన అంటున్నారు. అయితే ఇరవై లక్షల ఉద్య్హోగాలలో నాలుగవ వంతు విశాఖలోనే ఉంటాయన్నది తెలుస్తున్న నిజం. సో విశాఖ ఇపుడు దూసుకుపోతోంది అని అంతా అంటున్నారు.
