Begin typing your search above and press return to search.

విశాఖ ఉక్కు-వైసీపీ హ‌క్కా.. అదెలా ..!

తాజాగా ఇచ్చిన నోటిఫికేషన్ పై ఉద్యోగ సంఘాలు, కార్మికులు సదరు మాజీ ఎంపీని కలిసినప్పుడు ఆయన ఈ వ్యాఖ్యలు చేయటం గమనార్హం.

By:  Garuda Media   |   19 Aug 2025 7:00 PM IST
విశాఖ ఉక్కు-వైసీపీ హ‌క్కా.. అదెలా ..!
X

విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానికంగా విశాఖ స్టీల్ యాజమా న్యం తీసుకుంటున్న నిర్ణయాలు కార్మికుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. పెద్ద ఎత్తున ఉద్యమాలకు దారి తీసిన విషయం తెలిసిందే. ఇప్పటికే 2 ఏళ్లకు పైగా ఇక్కడ కార్మికులు ఉద్యోగులు ఆందోళన నిర్వహిస్తు న్నారు. దీనికి గతంలో కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ చీఫ్ షర్మిల నిరాహార దీక్షకు దిగడం, ఆమెను పోలీసులు అడ్డుకోవడం కూడా జరిగాయి. ఇక ఇప్పుడు ఈ ఉద్యమాన్ని తాము ముందుకు తీసుకువెళ్తామంటూ వైసీపీ నాయకులు తరమీద‌కు వచ్చారు.

రెండు రోజుల కిందట విశాఖ ఉక్కు యాజమాన్యం ఏకంగా ఒకేసారి 34 విభాగాలను ప్రైవేటీకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. విశాఖ ఉక్కు కర్మాగారం లోని కీలకమైన విభాగాల్లో మైనింగ్, అదేవిధంగా ఇతర విభాగాలను కూడా ప్రైవేటీకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిపై ఉద్యోగులు మరింత ఆగ్రహం తో రగిలిపోతున్నారు. ఇప్పటికే చాలా వాటిని ప్రైవేటీకరించే దిశగా అడుగులు వేశారని, ఇప్పుడు 34 కీలక విభాగాలను కూడా ప్రైవేటీకరించడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైసిపి దీనిని అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది.

వైసిపి మాజీ ఎంపీ ఒకరు మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు కార్మికులకు తమ అండగా నిలబడతామని ఉద్య మాన్ని తీవ్రతరం చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తాజాగా ఇచ్చిన నోటిఫికేషన్ పై ఉద్యోగ సంఘాలు, కార్మికులు సదరు మాజీ ఎంపీని కలిసినప్పుడు ఆయన ఈ వ్యాఖ్యలు చేయటం గమనార్హం. అయితే ఇది ఆయన వ్యక్తిగతమా లేక పార్టీ పరంగా తీసుకుని నిర్ణయిమా అంటే పార్టీ పరంగానే నిర్ణయం తీసుకుంటామని చెప్పడం మరో విశేషం. నిజానికి వైసిపి హయాంలోనే విశాఖ ఉక్కు కర్మాగారం ప్రవేటీరణకు సంబంధించిన అడుగులు పడ్డాయి.

అప్పట్లో ఉద్యమాలను వ్యతిరేకించిన నాయకులు ఇప్పుడు ఉద్యమాలకు సిద్ధమవుటం రాజకీయంగా ఆసక్తిగా మారింది. అంతేకాదు అప్పట్లో జగన్ కేవలం లేఖలు రాసి ప్రైవేటీకరణ కాకుండా చూడండి అని సుతిమెత్తని మాటలతో సరిపెట్టారు. కానీ, ఇప్పుడు ఏకంగా ఉక్కు ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నామ ని ప్రకటించటం వెనుక రాజకీయ వ్యూహాలు ఉన్నాయన్నది స్థానికంగా జరుగుతున్న చర్చ. వచ్చే ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖ ఉక్కు విషయాన్ని వైసిపి భుజాన వేసుకుంటుందా అనేది ఆసక్తిగా మారింది.

ఒకప్పుడు కాదని, ఇప్పుడు వద్దని చెబుతుండడం వెనక కచ్చితంగా రాజకీయ ప్రయోజనాలు ఉంటాయ న్నది రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగులకు మద్దతు ఇవ్వడం లేదా విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోవడం వరకు తప్పు లేదని, కానీ దీనిని రాజకీయ కోణంలో చూడడం ద్వారా ఎవరికీ ప్రయోజనం ఉండదని వారు చెబుతున్నారు.

ప్రస్తుతం దీనిపై వైసీపీ అధికారి కంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా మాజీ ఎంపీ చేసిన వ్యాఖ్య‌ల‌ను బట్టి, పార్టీలో ఆయనకు ఉన్న స్థాయిని బట్టి చూస్తే ఖచ్చితంగా విశాఖ ఉక్కును రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకునేందు కు వైసిపి సిద్దపడుతోందన్నది కనిపిస్తోంది. మరి భవిష్యత్తులో ఏం జరుగుతుంది? ఇది ఏ మేరకు ఆ పార్టీకి మేలు చేస్తుంది? అదే సమయంలో నిజంగానే విశాఖ ఉక్కుపై వైసీపీ ప్రేమతోనే ఉద్యమాలకు సిద్ధమవుతోందా? అనేది చూడాలి.