విశాఖ సాగర తీరంలో ఆ ముగ్గురూ..!
విశాఖ ఇపుడు రాజకీయ రాజధానిగా మారిపోయింది. ఏపీ విభజన తరువాత సహజంగానే విశాఖకు రాజసం పూర్తిగా వచ్చేసింది.
By: Satya P | 28 Aug 2025 9:37 PM ISTవిశాఖ ఇపుడు రాజకీయ రాజధానిగా మారిపోయింది. ఏపీ విభజన తరువాత సహజంగానే విశాఖకు రాజసం పూర్తిగా వచ్చేసింది. విశాఖ మెగా సిటీగా ఉండడంతో దాని ప్రాధాన్యత ఎప్పుడూ ఉంటూనే ఉంది. అంతే కాదు ఎటు వంటి అధికార అనధికార కార్యక్రమాలు నిర్వహించుకోవాలన్నా ది బెస్ట్ ప్లేస్ గా సిటీ ఆఫ్ డెస్టినీగా విశాఖ నిలుస్తోంది. ఈ క్రమంలో విశాఖ చుట్టూ ఇపుడు ఏపీ రాజకీయం అంతా తిరుగుతోంది. విశాఖలో ఏపీ కూటమి ప్రభుత్వ సారధులు అంతా కొలువు తీరడం అసలైన విశేషంగా చెబుతున్నారు.
తీరంలో రాజకీయ సందడి :
విశాఖలో మూడు రోజుల పాటు జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశాలను అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్నారు పార్టీ గెలిచిన తరువాత ఇంత పెద్ద ఎత్తున సాగే పార్టీ సమావేశాలు కాబట్టి పూర్తిగా హైప్ క్రియేట్ అయింది. ఏపీకి చెందిన జనసేన నాయకులు అంతా పెద్ద ఎత్తున విశాఖకు చేరుకున్నారు. దాంతో సాగర తీరంలో రాజకీయ సందడి మొదలైంది. పవన్ కళ్యాణ్ మూడు రోజులు విశాఖలో మకాం వేయడం కూడా మరింత హుషార్ ని ఇస్తోంది. దాంతో పవన్ అభిమానులు సాదర జనంలోనూ అంతా ఆ వైపే చూసే పరిస్థితి నెలకొని ఉంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడే :
ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అధికార పర్యటన కోసం విశాఖ వస్తున్నారు. ఆయన ఈ నెల 29న విశాఖ చేరుకుంటారు. దాదాపుగా అయిదారు గంటల పాటు ఆయన విశాఖలోనే బిజీగా గడపనున్నారు. ఈ సందర్భంగా ఆయన అనేక ప్రభుత్వ కార్యక్రమాలను అడ్రస్ చేయనున్నారు. బాబు పర్యటన పూర్తిగా అధికార స్థాయికి పరిమితం అవుతున్నా కూడా విశాఖలో ముఖ్యమంత్రి ఒక రోజు గడపడం అదే సమయంలో ఉప ముఖ్యమంత్రి కూడా ఉండడంతో కూటమి ప్రభుత్వమే విశాఖకు వచ్చినట్లు అవుతుందని అంటున్నారు.
నారా లోకేష్ సైతం :
ఇక కూటమి ప్రభుతంలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్న మంత్రి నారా లోకేష్ సైతం మూడు రోజుల విశాఖ పర్యటన పెట్టుకున్నారు ఆయన విశాఖలో అనేక అధికార అనధికార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అంతే కాదు రాత్రికి ఆయన విశాఖ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో బస చేస్తారు. ఈ సందర్భంగా పార్టీ నేతలతో కూడా ఆయన ముచ్చటిస్తారు అని అంటున్నారు. విశాఖలో పార్టీ పనితీరు అలాగే ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరుని ఆయన సమీక్షిస్తారు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే కూటమిలో త్రిమూర్తులు అనదగిన చంద్రబాబు పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ముగ్గురూ ఒకే సమయంలో విశాఖలో ఉండడం మాత్రం రాజకీయంగా అత్యంత విశేష పరిణామంగానే అంతా చూస్తున్నారు.
