Begin typing your search above and press return to search.

విశాఖలో ఈ రెస్టారెంట్ తెలిస్తే.. పెట్ లవ్వర్స్ వావ్ అనేస్తారు

ఈ రెస్టారెంట్ ను విశాఖలోని సాగర్ నగర్ లో ఆర్నెల్ల క్రితం ప్రారంభించారు. ఈ రెస్టారెంట్ కు వచ్చే వారు తమ పెంపుడు జంతువుల్ని ఇక్కడకు తీసుకురావొచచు.

By:  Garuda Media   |   23 Feb 2026 10:36 AM IST
విశాఖలో ఈ రెస్టారెంట్ తెలిస్తే.. పెట్ లవ్వర్స్ వావ్ అనేస్తారు
X

అంతకంతకూ పెట్ లవ్వర్స్ పెరిగిపోతున్నారు. ఇంట్లోని మనుషులతో సమానంగా పెంపుడు జంతువుల్ని పెంచుకోవటం మొదట్నించి ఉన్నా.. ఇటీవల కాలంలో ఆ జోరు మరింత పెరిగింది. చివరకు వాటికి పుట్టినరోజులు సైతం ఘనంగా నిర్వహించటం ఈ మధ్యన ఎక్కువైంది. మారిన కాలంతో పాటు పెరిగిన ఆదాయాలు తమ పెంపుడు జంతువుల కోసం భారీగా ఖర్చు చేయటం అంతకంతకూ పెరుగుతోంది. వీరి అవసరాలకు తగ్గట్లు సరికొత్త వసతులకు తెర తీస్తున్న పరిస్థితి. ఇప్పుడు చెప్పబోయేది ఆ కోవకు చెందిన రెస్టారెంట్. విశాఖలో ప్రారంభించిన పాఫీ రెస్టారెండ్పెట్ ఫ్రెమడ్లీ రెస్ట్రో కేఫ్ జంతుప్రేమికుల్ని విశేషంగా ఆకర్షిస్తోందన్న మాట వినిపిస్తోంది.

ఈ రెస్టారెంట్ ను విశాఖలోని సాగర్ నగర్ లో ఆర్నెల్ల క్రితం ప్రారంభించారు. ఈ రెస్టారెంట్ కు వచ్చే వారు తమ పెంపుడు జంతువుల్ని ఇక్కడకు తీసుకురావొచచు. అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేశారు. పెంపుడు జంతువుల్ని తీసుకొచ్చే అతిధులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా.. శిక్షణ పొందిన సిబ్బందితో వాటికి సేవలు అందించేలా ఏర్పాట్లు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడకు తీసుకొచ్చే పప్పీల కోసం ఈతకొలను.. ప్లే జోన్.. సంగీతం వినిపించే వసతులతో పాటు.. స్విమ్మింగ్ కోసం పూల్ ఏర్పాటు చేశారు. ఈ పూల్ ను వినియోగిస్తే మాత్రం కొంత ఛార్జ్ చేస్తారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. పెట్స్ కు ప్రత్యేకమైన మెనూను ఏర్పాటు చేశారు. అది కూడా అందుబాటు ధరల్లో ఉంచటంతో అందరిని ఆకర్షిస్తోంది. చికెన్.. మటన్ మొదలు రౌస్ బౌల్.. చిరుతిండ్లతో పాటు.. బిస్కెట్స్.. కొన్ని ప్రత్యేకమైన వెజటబుల్స్ లాంటివి..జ్యూస్ లను కూడా ఉంటాయి. దీంతో.. యజమానులతో పాటు దర్జాగా తమకు నచ్చిన ఫుడ్ ను ఒకేసారి కలిసి తినే సౌకర్యం వీటికి ఉంటుంది.

వీటితో పాటు పెంపుడు జంతువుల గ్రూమింగ్ కోసం ఏర్పాట్లు చేశారు. దీంతో హెయిర్ కట్.. మొదలు వాష్ వరకు అన్ని వసతులు ఉంటాయి. ఇక్కడ పెంపుడు జంతువుల కోసం పుట్టినరోజు వేడుకల్ని నిర్వహిస్తారు. ప్రత్యేకంగా డిజైన్ చేసిన కేక్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. గడిచిన ఆర్నెల్లలో ఇరవైకు పైగా పప్పీ బర్త్ డే పార్టీలను నిర్వహించినట్లు చెప్పారు. పెట్స్ తో కలిసి ఫ్యామిలీ మెంబర్లు అంతా హ్యాపీగా ఎంజాయ్ చేసేలా తమ రెస్టారెంట్ ను ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు.