పాక్ లో ప్రియురాలు.. ఆంధ్ర యువకుడి షాకింగ్ ప్రయత్నాలు!
వివరాళ్లోకి వెళ్తే... విశాఖకు చెందిన ప్రశాంత్ అనే యువకుడు పాకిస్థాన్ లోని ప్రియురాలు ఉందని, ఆమెను కలవాలని ఫిక్సై.. నేరుగా రాజస్థాన్ లోని బికనీర్ సరిహద్దు ప్రాంతానికి చేరుకున్నాడు.
By: Raja Ch | 10 Dec 2025 2:00 AM ISTప్రేమించిన వ్యక్తి కోసం పాకిస్థాన్ నుంచి పిల్లలను వెంటపెట్టుకుని భారత్ కు వచ్చిన ఓ మహిళ కథ ఇటీవల తెలిసిన సంగతి తెలిసిందే. ఈ విషయం నాడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో.. పాకిస్థాన్ లో ఉన్న ప్రియురాలి కోసం సరిహద్దుల్లో పట్టువదలని విక్రమార్క ప్రయత్నాలు చేస్తోన్న ఓ తెలుగు యువకుడి వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అవును... పాకిస్థాన్ లో ప్రియురాలు ఉందని చెబుతున్న విశాఖకు చెందిన ప్రశాంత్ వేదంగా చెబుతోన్న ఓ యువకుడు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగా తాజాగా విశాఖ నుంచి రాజస్థాన్ లోని బికనీర్ వద్దకు చేరుకున్నాడు. ఈ సమయంలో ఆర్మీ ఇంటిలిజెన్స్ సమాచారం మేరకు భద్రతా బలగాలు అతడిని అదుపులోకి తీసుకున్నాయి. ఈ సందర్భంగా అతడు చెప్పిన లవ్ స్టోరీ షాకింగ్ గా మారింది!
వివరాళ్లోకి వెళ్తే... విశాఖకు చెందిన ప్రశాంత్ అనే యువకుడు పాకిస్థాన్ లోని ప్రియురాలు ఉందని, ఆమెను కలవాలని ఫిక్సై.. నేరుగా రాజస్థాన్ లోని బికనీర్ సరిహద్దు ప్రాంతానికి చేరుకున్నాడు. ఈ సమయంలో పాక్ లోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నిస్తుండగ్గా భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. ఈ సందర్భంగా.. అతడిని విచారించి, స్పందించిన ఎస్.హెచ్.ఓ. పలు కీలక విషయాలు వెల్లడించారు.
ఇందులో భాగంగా... విచారణలో అతడు.. తనకు పాక్ లో ప్రియురాలు ఉందని చెప్పాడని.. ఆమెను కలుసుకోవడం కోసం ఆ దేశం వెళ్లాలని ప్రయత్నించినట్లు చెప్పాడు. అయితే ఆ దేశంలో ఆమె ఎక్కడుంటుంది అనే విషయాలపై అతడికే స్పష్టం లేదని తెలుస్తోందని అంటున్నారు. ఇక్కడ మరో షాకింగ్ విషయం ఏమిటంటే... ఇలా అక్రమంగా పాకిస్థాన్ లోకి వెళ్లాలని ప్రయత్నించడం అతడికి ఇదే ఫస్ట్ టైమ్ కాదంట.
ఈ క్రమంలో గతంలో 2017వ సంవత్సరంలో ఒకసారి ఇదే బికనీర్ ప్రాంతం నుంచి పాకిస్థాన్ లో ప్రవేశించాలని ప్రయత్నించాడట. అయితే అప్పుడు పాక్ సైన్యం అతడిని అదుపులోకి తీసుకుని తమ కస్టడీలో ఉంచుకుందని.. తిరిగి 2021లో అట్టారీ సరిహద్దు గుండా భారత్ లోకి పంపిందని చెబుతున్నారు. దీంతో... ఇతడి వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు... ప్రశాంత్ మానసిక పరిస్థితి లేదని అతడి కుటుంబ సభ్యులు చెబుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విశాఖ నుంచి వారు బికనీర్ కు బయలుదేరారు! ఈ సందర్భంగా స్పందించిన ప్రశాంత్ సోదరుడు.. అతడిని కొన్ని మానసిక సమస్యలు ఉన్నాయని రాజస్థాన్ పోలీసులకు చెప్పినట్లు సమాచారం!
