Begin typing your search above and press return to search.

విశాఖకు బడ్జెట్ చెప్పిన గుడ్ న్యూస్

ఇక విశాఖలో గూగుల్ డేటా సెంటర్ రాకతో మరిన్ని డేటా సెంటర్లు కూడా వరసగా క్యూ కడుతునాయి.

By:  Satya P   |   3 Feb 2026 8:15 AM IST
విశాఖకు బడ్జెట్ చెప్పిన గుడ్ న్యూస్
X

కేంద్ర బడ్జెట్ మీద విభిన్నమైన తీరులో స్పందన వస్తున్నా విశాఖ వరకూ చూస్తే గుడ్ న్యూస్ ఉందని అంటున్నారు. కేంద్రం తీసుకున్న కీలక నిర్ణయం ఫలితంగా విశాఖ దశ మారిపోతుందని అంటున్నారు. విశాఖ అంటేనే ఏపీలో మోస్ట్ ఫేవరేట్ సిటీగా ఉంది. అంతే కాదు విశాఖ అతి పెద్ద సిటీ అని వేరేగా చెప్పాల్సిన పని లేదు. ఈ రోజుకి రెడీ మేడ్ క్యాపిటల్ అంటే విశాఖ పేరే చెబుతారు. విశాఖ ఐటీ సిటీగా రూపాంతరం చెబుతోంది.

గూగుల్ వచ్చిన శుభవేళ :

విశాఖకు అతి పెద్ద డేటా సెంటర్ గా గూగుల్ రాబోతోంది. ఈ నెలాఖరులో దీనిని సంబంధించి శంకుస్థాపన జరుగుతుంది. ఈ నేపధ్యంలో కేంద్ర బడ్జెట్ లో మంచి వార్త వినిపించారు. దేశంలో ఏర్పాటు చేయబోయే విదేశీ సంస్థల డేటా సెంటర్లకు రెండు దశాబ్దాల పాటు టాక్స్ ఫ్రీ అని కూడా రాయితీని ప్రకటించారు. దాంతో ఆ విధంగా ఏపీ నుంచి అందుకోబోతున్న తొలి డేటా సెంటర్ గా గూగుల్ ఉంది. 2047 వరకూ ఈ ఫ్రీ టాక్స్ రిలాక్సేషన్ వర్తిస్తోంది అని అంటున్నారు.

క్యూ కడున్నాయి :

ఇక విశాఖలో గూగుల్ డేటా సెంటర్ రాకతో మరిన్ని డేటా సెంటర్లు కూడా వరసగా క్యూ కడుతునాయి. రిలయెన్స్ కూడా డేటా సెంటర్ ని విశాఖలో ఏర్పాటు చేయడానికి సిద్ధపడుతోంది అంటున్నారు. ఈ రెండే కాకుండా జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో అనేక డేటా సెంటర్లు విశాఖకు రానున్నాయని అంటున్నారు. వీటి ద్వారా విశాఖ డేటా హబ్ గా మారనుంది అని అంటున్నారు.

ఉపాధి అవకాశాలతో :

విశాఖలో డేటా సెంటర్ల రాకతో భారీ పెట్టుబడులు ఇక్కడ డంప్ అవుతాయి. అంతే కాదు అనుబంధ విభాగాలు ఎన్నో వస్తాయి, వాటి వల్ల ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున రానున్నాయని అంటున్నారు. అలాగే క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్, ఈ కామర్స్ వంటి రంగాలలో విశాఖ రానున్న రోజులో కీలక స్థానంలోకి వస్తుందని అంటున్నారు. మరో వైపు చూస్తే కనుక విశాఖలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్శిటీని ఏర్పాటు చేస్తామని కేంద్ర బడ్జెట్ లో ప్రకటించడంతో విశాఖకు రానున్నవి అన్నీ మంచి రోజులే అని అంటున్నారు.

విశాఖదే ఫ్యూచర్ :

ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ తో సమానంగా విశాఖ ఐటీ ఫీల్డ్ లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుంది అని అంటున్నారు. అంతే కాదు సాఫ్ట్ వేర్ కి డెస్టినీగా మారుతుందని కూడా అంచనా వేస్తున్నారు. ఇప్పటిదాకా విశాఖ అంటే టూరిజం హబ్ గానే చూసేవారు అంతా ఇక మీదట డేటా హబ్ గా పిలిచే అవకాశాలు ఫ్యూచర్ లో ఉంటాయని అంటున్నారు.