Begin typing your search above and press return to search.

విశాఖకు మరో వరం ఇచ్చిన కేంద్రం!

ఇక ఇప్పటిదాకా చూస్తే విశాఖ సహా ఈ ప్రాంతాల వారు విదేశీ ప్రయాణాలు చేయాలీ అంటే హైదరాబాద్ లేదా చెన్నైలకు వెళ్ళి అక్కడ ఇమ్మిగ్రేషన్ ఆఫీసులను సప్రదించాల్సి వచ్చేది.

By:  Satya P   |   20 Jan 2026 8:37 AM IST
విశాఖకు మరో వరం ఇచ్చిన కేంద్రం!
X

విశాఖ అంతకంతకు ఎదుగుతున్న నగరం. ఇప్పటికే మహా నగరంగా ఉంది. విశాఖ మెగా సిటీగా అవతరించింది. ఈ నేపధ్యంలో కేంద్రం ఒక వరాన్ని ఇచ్చింది విశాఖలో కీలకమైన కేంద్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తోంది. కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో నడిచే ఇమ్మిగ్రేషన్ బ్యూరో కార్యాలయం విశాఖలో ఏర్పాటు కానుంది. దాంతో విశాఖ సహా ఉత్తరాంధ్రా ఇది ఎంతో మేలు చేసేదిగా ఉంటుందని చెబుతున్నారు.

విదేశీ ప్రయాణాల కోసం :

మరో అయిదు నెలల వ్యవధిలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు సిద్ధం అవుతోంది. తొలి విమానం అక్కడ నుంచి విదేశాలకు ఎగరనుంది. రానున్న రోజులలో భోగాపురం నుంచే అమెరికా ఆస్ట్రేలియా సహా ఇతర దేశాలకు ప్రయాణాలు చేయవచ్చు. అలాంటపుడు ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ చాలా అవసరం. అందుకే విశాఖలో ఈ ఆఫీసుని ఏర్పాటు చేయడం ద్వారా ఉత్తరాంధ్రా ప్రజలకు ఈ సేవలను అందుబాటులోకి తీసుకుని వస్తున్నారు.

సదూర ప్రాంతాలకు :

ఇక ఇప్పటిదాకా చూస్తే విశాఖ సహా ఈ ప్రాంతాల వారు విదేశీ ప్రయాణాలు చేయాలీ అంటే హైదరాబాద్ లేదా చెన్నైలకు వెళ్ళి అక్కడ ఇమ్మిగ్రేషన్ ఆఫీసులను సప్రదించాల్సి వచ్చేది. ఇపుడు ఆ సదుపాయం నేరుగా విశాఖకే రాబోతోంది. ఇక విశాఖ సహా ఉత్తరాంధ్రా నుంచి విదేశీ ప్రయాణాలు మరింత పెరుగుతాయి. వర్తక వాణిజ్యాల కోసం అలాగే ఉపాధి కోసం, విద్య కోసం ఇతర దేశాలకు వెళ్లే వారి మరింత అధికం అవుతున్నారు. దాంతో ఎవరికీ ఇబ్బంది లేకుండా కేంద్ర హోం శాఖ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. దాంతో విశాఖ అంతర్జాతీయ హోదాను దక్కించుకున్నట్లు అవుతోంది.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన :

విశాఖ సహా ఉత్తరాంధ్రా జిల్లాలలో అంతర్జాతీయ ప్రయాణాలు మరింత పెరగనున్న నేపధ్యంలో విశాఖలో ఇమ్మిగ్రేషన్ బ్యూరో కార్యాలయం ఏర్పాటు చేయాలని ఏపీలోని కూటమి ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. వెంటనే కేంద్ర హోం శాఖ సానుకూలంగా రెస్పాండ్ అయింది. ఇక ఇప్పటిదాకా చూస్తే విశాఖ నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు మాత్రమే విమానాల రాక పోకలు ఉండేవి. ఇపుడు ఇంటర్నేషనల్ ఫ్లైట్లు నడుస్తాయి. దాంతో ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉందని కేంద్రం గురించి విశాఖలో దానిని ఏర్పాటు చేయనుంది.

విదేశీ సేవలు విస్తృతం :

ఇక రానున్న రోజులలో విదేశీ విమానాల రాకపోకలు తో పాటు కార్గో విమాన సేవలు కూడా విస్తరిస్తాయని చెబుతున్నారు. దీంతో ఉత్తరాంధ్రాలో వాణిజ్య కార్యకలాపాలు సైతం పెరుగుతాయని అంటున్నారు. అలాగే ఐటీ టూరిజం రంగాల అభివృద్ధికి కూదా ఇవన్నీ దోహదపడతాయని అంటున్నారు. ఇక భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు అంటే కేవలం ఉత్తరాంధ్రా మాత్రమే కాదు పక్కన ఉన్న ఒడిషా చత్తీస్ ఘడ్ వంటి రాష్ట్రాల నుంచి ప్రజలు ఈ సేవలను ఉపయోగించుకుంటారు అని అంటున్నారు ఇక కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు మరిన్ని విశాఖలో ఏర్పాటు కావడం వల్ల ఉపాధి రంగం కూడా విస్తరిస్తుంది అని అంటున్నారు.