Begin typing your search above and press return to search.

మరో భారీ డేటా సెంటర్...సమ్మిట్ గిఫ్ట్

అతి పెద్ద సంస్థ అయిన రిలయెన్స్ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయించుకుంది. సమ్మిట్ వేదికగా ఏపీ సీఎం చంద్రబాబుతో రిలయెన్స్ సంస్థకు చెందిన ప్రతినిధులు సమావేశం అయి ఈ మేరకు చర్చించారు.

By:  Satya P   |   14 Nov 2025 9:40 PM IST
మరో భారీ డేటా సెంటర్...సమ్మిట్ గిఫ్ట్
X

విశాఖకు ఇప్పటికే గూగుల్ డేటా సెంటర్ తరలివచ్చింది. తొందరలోనే దాని శ్రీకారానికి సంబంధించిన ప్రక్రియ అయితే మొదలవుతుంది. అయితే ఇపుడు గూగుల్ బాటలో మరో డేటా సెంటర్ విశాఖకు రానుంది అని అంటున్నారు. విశాఖలో శుక్రవారం మొదలైంది. రెండు రోజుల పాటు జరుగుతున్న ఈ ప్రపంచ స్థాయి సమ్మిట్ లో అనేక కీలక ఒప్పందాలకు ఆమోదం లభిస్తోంది. ఈ క్రమంలో గూగుల్ డేటా సెంటర్ తో పాటుగా విశాఖలో మరో భారీ డేటా సెంటర్ పెట్టేందుకు రిలయన్స్ సంస్థ ముందుకు రావడం శుభ పరిణామం గా చెబుతున్నారు.

ఏపీ చిరునామాగా :

అతి పెద్ద సంస్థ అయిన రిలయెన్స్ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయించుకుంది. సమ్మిట్ వేదికగా ఏపీ సీఎం చంద్రబాబుతో రిలయెన్స్ సంస్థకు చెందిన ప్రతినిధులు సమావేశం అయి ఈ మేరకు చర్చించారు. ఏపీలో తాము పెట్టుబడులు పెట్టేందుకు వారు సుముఖత వ్యక్తం చేశారు. అంతే కాదు ఏపీలో ఏ ఐ డేటా సెంటర్ తో పాటు గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్క్ సోలార్ పవర్ ప్లాంట్ లను ఏర్పాటు చేయడానికి కూడా రిలయన్స్ సంస్థ సుముఖత వ్యక్తం చేయడం గమనార్హం. ఇందులో ఏఐ డేటా సెంటర్ పెద్ద ఎత్తున విశాఖలో ఏర్పాటు కానుంది అని అంటున్నారు.

విశాఖ ఏఐ సెంటర్ :

విశాఖను ఐటీ హబ్ గా మార్చాలన్నది కూటమి ప్రభుత్వం ఆలోచన. అదిపుడు ఆచరణలో మరింత ముందుకు అడుగులు వేస్తోంది. గూగుల్ డేటా సెంటర్ తోనే విశాఖ దశ తిరగనుంది అని అంటున్నారు. దానికి తోడుగా రిలయెన్స్ ఏఐ డేటా సెంటర్ కనుక వస్తే మరింత జోరు పెరుగుతుంది అని అంటున్నారు. రిలయెన్స్ ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్ ప్రత్యేకత ఏమిటి అంటే ఏకంగా ప్రపంచంలోనే అత్యాధునికంగా జీపీయూలు, అలాగే టీపీయూలు, అంతే కాకుండా ఏఐ ప్రొసెసర్లు వంటివాటితో ఉంటాయని అంటున్నారు. ఇక విశాఖ ఏఐ డేటా సెంటర్ గుజరాత్ లోని రిలయెన్స్ వన్ గిగావాట్ సామర్థ్యం కలిగిన ఏఐ డేటా సెంటర్ కి జత చేస్తూ ఏర్పాటు చేయనున్నారు. గుజరాత్ లో ఉన్న ఏఐ డేటా సెంటర్ తరహాలో ఏపీకి కూడా ఎంతో బలమైన ఆధునిక సామర్థ్యం కలిగిన డేటా సెంటర్ రానుంది అని అంటున్నారు. ఈ రెండు ఏఐ డేటా సెంటర్లతో ఏకంగా ఆసియాలోనే భారత్ చాలా అగ్రశ్రేణిలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

అక్కడ ఫుడ్ పార్క్ :

ఏపీలోని కర్నూల్ లో గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్క్ ని కూడా రిలయెన్స్ ఏర్పాటు చేయనుంది. ఇది 170 ఎకరాలలో ఏర్పాటు చేస్తున్నారు. ఇక విశాఖలో ఏర్పాటు చేస్తున్న ఏఐ దేటా సెంటర్ కి అవసరం అయిన విద్యుత్ కోసం సౌర విద్యుత్ ప్రాజెక్ట్ ని కూడా ఏర్పాటు చేయడంతో అది కూడా అందుబాటులోకి రానుంది. రిలయెన్స్ పెట్టుబడుల వల్ల ఏపీలో డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వస్తాయని అని అంటున్నారు.