Begin typing your search above and press return to search.

బోల్డ్ ఫొటోకు కోహ్లీ లైక్..ఆ హాట్ మోడల్ ఓపెన్ అయిపోయింది..

జర్మనీకి చెందిన ప్రముఖ మోడల్, ఇన్‌ఫ్లుయెన్సర్ లిజ్‌లాజ్ షేర్ చేసిన ఒక బోల్డ్ ఫోటోకు కోహ్లీ లైక్ చేయడం, ఆ వెంటనే దానిని అన్‌లైక్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

By:  A.N.Kumar   |   18 April 2026 3:07 PM IST
బోల్డ్ ఫొటోకు కోహ్లీ లైక్..ఆ హాట్ మోడల్ ఓపెన్ అయిపోయింది..
X

భారత క్రికెట్ దిగ్గజం.. గ్లోబల్ ఐకాన్ విరాట్ కోహ్లీ మైదానంలో పరుగుల వరద పారించినా.. మైదానం బయట చిన్న పని చేసినా అది క్షణాల్లో ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతుంది. తాజాగా సోషల్ మీడియాలో కోహ్లీకి సంబంధించిన ఒక చిన్న 'లైక్' వ్యవహారం నెట్టింట పెద్ద దుమారాన్నే రేపింది. జర్మనీకి చెందిన ప్రముఖ మోడల్, ఇన్‌ఫ్లుయెన్సర్ లిజ్‌లాజ్ షేర్ చేసిన ఒక బోల్డ్ ఫోటోకు కోహ్లీ లైక్ చేయడం, ఆ వెంటనే దానిని అన్‌లైక్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

అసలు ఏం జరిగిందంటే?

సాధారణంగా సెలబ్రిటీలు సోషల్ మీడియాలో వివిధ రకాల పోస్ట్‌లను చూస్తుంటారు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో లిజ్‌లాజ్ పోస్ట్ చేసిన ఒక ఫోటోను లైక్ చేశారు. అయితే కోహ్లీ వంటి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న వ్యక్తి ఒక మోడల్ ఫోటోను లైక్ చేయడం నెటిజన్ల కంటపడింది. క్షణాల్లో ఆ లైక్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విచిత్రమేమిటంటే కొద్దిసేపటికే ఆ ఫోటోపై కోహ్లీ లైక్ మాయమైపోయింది. ఆయన వెంటనే దానిని 'అన్‌లైక్' చేసినట్లు స్పష్టమైంది. దీంతో నెటిజన్లు రకరకాల చర్చలకు తెరలేపారు. ఇది పొరపాటున జరిగిందా? లేక కావాలనే చేశారా? అనే కోణంలో మీమ్స్, పోస్ట్‌లు వెల్లువెత్తాయి.

స్పందించిన జర్మన్ మోడల్ లిజ్‌లాజ్

ఈ వివాదం ముదురుతున్న తరుణంలో సదరు మోడల్ లిజ్‌లాజ్ స్వయంగా రంగంలోకి దిగి వివరణ ఇచ్చారు. ఈ ఘటనపై ఆమె సానుకూలంగా స్పందిస్తూ కోహ్లీకి మద్దతుగా నిలిచారు."విరాట్ కోహ్లీ నా ఫోటోను లైక్ చేసినప్పుడు నేను నిజంగా ఆశ్చర్యపోయాను, చాలా ఆనందంగా అనిపించింది. కానీ అది ఇంత పెద్ద వివాదానికి దారితీస్తుందని.. వైరల్ అవుతుందని నేను అస్సలు ఊహించలేదు. ఆయన మనసులో ఎలాంటి దురుద్దేశం లేదని నేను నమ్ముతున్నాను. నెటిజన్లు ఒక చిన్న విషయాన్ని ఇంతగా భూతద్దంలో పెట్టి చూడటం బాధాకరం " అని ఆమె పేర్కొన్నారు.

అంతేకాకుండా కోహ్లీపై వస్తున్న విమర్శల పట్ల ఆమె విచారం వ్యక్తం చేశారు. సెలబ్రిటీలు కూడా మనుషులేనని, పొరపాటున ఏదైనా క్లిక్ చేయడం లేదా సాధారణంగా ఒక ఫోటో నచ్చి లైక్ చేయడం నేరం కాదని ఆమె అభిప్రాయపడ్డారు.

సోషల్ మీడియా సెన్సార్‌షిప్.. సెలబ్రిటీల పరిస్థితి

ఈ ఘటన సోషల్ మీడియా యుగంలో సెలబ్రిటీలు ఎదుర్కొంటున్న సవాళ్లను మరోసారి ఎత్తిచూపింది. ఒక సాధారణ వ్యక్తికి ఉండే స్వేచ్ఛ స్టార్ క్రికెటర్లకు ఉండదనేది ఈ ఘటనతో అర్థమవుతోంది. ప్రముఖులు చేసే ప్రతి చిన్న కదలికపై వేల కళ్లు నిఘా ఉంచుతాయి. కొన్నిసార్లు యాప్‌లలో వచ్చే సాంకేతిక లోపాల వల్ల కూడా ఇలాంటివి జరుగుతుంటాయి. కోహ్లీ వంటి వ్యక్తులు ఒక ఫోటోను లైక్ చేస్తే అది సదరు ఇన్‌ఫ్లుయెన్సర్‌కు విపరీతమైన పాపులారిటీని తెచ్చిపెడుతుంది. అదే సమయంలో వివాదాలకు కేంద్రబిందువు అవుతుంది.

విరాట్ కోహ్లీ తన క్రమశిక్షణకు, హుందాతనానికి పెట్టింది పేరు. సోషల్ మీడియాలో కోట్లాది మంది ఫాలోవర్లను కలిగి ఉన్న ఆయన, ఎప్పుడూ తన వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను అభిమానులతో పంచుకుంటూనే ఉంటారు. అయితే ఈ తాజా 'లైక్ - అన్‌లైక్' వ్యవహారం ఆయనకు ఒక చిన్న పాఠం లాంటిదని విశ్లేషకులు భావిస్తున్నారు.

డిజిటల్ ప్రపంచంలో ప్రతి క్లిక్ వెనుక ఒక కథను వెతికే ప్రస్తుత ట్రెండ్‌లో సెలబ్రిటీలు తమ స్మార్ట్‌ఫోన్‌లను వాడేటప్పుడు కూడా ఎంతో అప్రమత్తంగా ఉండాలని ఈ సంఘటన నిరూపించింది. ఏది ఏమైనా లిజ్‌లాజ్ ఇచ్చిన వివరణతో ఈ వివాదానికి ప్రస్తుతానికి తెరపడినట్లే కనిపిస్తోంది.