నెరిసిన గడ్డంతో గుర్తుపట్టలేనంతగా మారిపోయిన విరాట్ కోహ్లీ!
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి లండన్ లో ఉంటున్న విషయం తెలిసిందే.
By: Madhu Reddy | 8 Aug 2025 1:57 PM ISTటీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి లండన్ లో ఉంటున్న విషయం తెలిసిందే. అక్కడ ఒక అభిమానితో ఆయన దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా పలు అనుమానాలకు దారితీస్తోంది. అందులో కోహ్లీ మునుపేన్నడూ లేని విధంగా నెరిసిన గడ్డం , మీసాలతో పాటు చాలా సన్నగా ఓల్డేజ్ లుక్కులో కనిపించారు. దీంతో కోహ్లీని ఇలా చూడలేకపోతున్నామని అభిమానులు కూడా కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ఇలా ఓల్డేజ్ లుక్ లో కనిపించడమే కాదు ఈయనకు వయసు పైబడింది అని, అందుకే టెస్టులు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించారు అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఈ ఫోటో చూసిన కొంతమంది వన్డే రిటైర్మెంట్ లోడింగ్? అంటూ మీమ్స్ పోస్టులు షేర్ చేస్తూ తమ ఆందోళనలను వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఒక కార్యక్రమంలో కోహ్లీ కూడా తన గడ్డం గురించి సరదాగా కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. ఆ కార్యక్రమంలో విరాట్ కోహ్లీ మాట్లాడుతూ ." రెండు రోజుల క్రితమే నేను నా గడ్డానికి రంగు వేసుకున్నాను. ప్రతి నాలుగు రోజులకు ఒకసారి ఇలా గడ్డానికి రంగు వేయాల్సి వస్తోంది అంటే.. ఇక సమయం దగ్గర పడిందని అర్థం చేసుకోవాలి" అంటూ కూడా వ్యాఖ్యానించారు. అయితే అప్పుడు ఆయన సరదాగా అన్నారేమో కానీ ఇప్పుడు ఆయన అభిమానులు మాత్రం ఈ లుక్ ను సీరియస్ గా తీసుకుంటున్నారు.
విరాట్ కోహ్లీ గడ్డం నెరవడమే కాదు ఆయన రూపం ఇప్పుడు రిటైర్మెంట్ పై చర్చకు దారి తీసింది. ఇకపోతే వన్డే కెరియర్ భవిష్యత్తుపై విరాట్ కోహ్లీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ ఇలాంటి లుక్ లో కనిపించేసరికి అదే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి విరాట్ కోహ్లీ తదుపరి నిర్ణయం కోసం అటు క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
ఇక విరాట్ కోహ్లీ విషయానికి వస్తే.. భారతదేశపు అంతర్జాతీయ క్రికెట్ ఆటగాడిగా పేరు సొంతం చేసుకున్నారు. 50 కి పైగా వన్డే శతకాలు అందుకున్నారు.. ఇది సచిన్ టెండూల్కర్ రికార్డును కూడా అధిగమించిందని చెప్పవచ్చు.. ఇక విరాట్ కోహ్లీ 1988 నవంబర్ 5న ఢిల్లీలో జన్మించారు. ఇక ఈయన వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే గతంలో తమన్నాతో పాటు మరికొంతమంది హీరోయిన్స్ తో ఎఫైర్ నడిపినట్లు వార్తలు వినిపించినా చివరికి.. ప్రముఖ సినీ నటి అనుష్క శర్మను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.2017లో ఇటలీలో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత అటు అనుష్క శర్మ కూడా ఇండస్ట్రీకి దూరమైంది. వైవాహిక బంధానికే పరిమితమైన అనుష్క శర్మ.. 2021 జనవరి 11న కుమార్తెకు జన్మనివ్వగా .. 2024 ఫిబ్రవరి 15న ఒక కొడుకుకు జన్మనిచ్చింది.
