పరాయి దేశంలో మళ్లీ ఇండియా పరువు తీశారు..!
తాజాగా మరోసారి దేశం కాని దేశంలో ఇండియా పరువు తీశాడు. ఈసారి ప్రముఖ ఇండియన్ టూరిస్ట్ తీరుతో దేశం పరువు పోయింది.
By: Ramesh Palla | 4 Aug 2026 1:23 PM ISTప్రపంచ దేశాలు ఇండియా ను గౌరవిస్తూ ఉంటే, మన ఇండియన్స్ మాత్రం పరాయి దేశంలో ఇండియా పరువు తీసే విధంగా ప్రవర్తిస్తున్నారు. చదువు కోసం, సంపాదన కోసం, వ్యాపారం కోసం విదేశాలకు వెళ్లిన ఇండియన్స్ అక్కడ మోసాలకు, దొంగతనాలకు పాల్పడటం ఈ మధ్య కాలంలో ఎక్కువ అయింది. ఆ మధ్య అమెరికాలో ఇండియన్ అమ్మాయిలు ఒక సూపర్ మార్కెట్‌లో చేసిన దొంగతనం తీవ్ర విమర్శల పాలయిన విషయం తెల్సిందే. ఇక లండన్‌లో ఒక ఇండియన్ కపుల్ ఉద్యోగాల పేరిట పెద్ద మోసానికి తెర లేపిన విషయం తెల్సిందే. దేశం కాని దేశంలో ఈజీగా మోసం చేస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు. ఏదో ఒక సమయంలో ఆ దొంగతనం లేదా మోసం బయట పడుతుందనే కనీస విచక్షణ లేకుండా ఇలా ప్రవర్తిస్తున్న వారిని ఇండియాకు రప్పించి కఠిన శిక్ష విధించాలని చాలా మంది సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
ఆన్ లైన్‌లో క్యాబ్ బుకింగ్...
తాజాగా మరోసారి దేశం కాని దేశంలో ఇండియా పరువు తీశాడు. ఈసారి ప్రముఖ ఇండియన్ టూరిస్ట్ తీరుతో దేశం పరువు పోయింది. వియత్నాంలో ప్రస్తుతం ఆ టూరిస్ట్ ఉన్నాడు. అక్కడ పర్యాటక ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉన్నాడు. తన పర్యటనలో భాగంగా వియాత్నంలో అతడు ఒక క్యాబ్‌లో ప్రయాణించాడు. ఆన్ లైన్ లో క్యాబ్‌ను బుక్ చేసుకున్న అతడు దిగే ప్లేస్ వచ్చిన తర్వాత క్యాబ్ డ్రైవర్ డబ్బులు అడుగుతూ ఉండగా తన వద్ద డబ్బులు లేవు అంటూ దిగి వెళ్లి పోయాడు. డబ్బులు లేవు అంటూ ఆ ఇండియన్ టూరిస్ట్ దిగి పోవడంతో ఆ క్యాబ్ డ్రైవర్ అసహనం వ్యక్తం చేశాడు. తనకు డబ్బులు ఇవ్వలేదు అంటూ క్యాబ్ డ్రైవర్ డ్యాష్ బోర్డ్‌లో రికార్డ్ అయిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఒక ఇండియన్ ఇలా చేశాడు అంటూ అతడు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో చర్చనీయాంశం అయింది.
సోషల్ మీడియాలో వైరల్ వీడియో...
క్యాబ్‌లో ప్రయాణించిన తర్వాత ఒక ప్యాసింజర్ డబ్బులు లేవు అంటే డ్రైవర్ అంత ఈజీగా ఎలా వదిలి పెడుతాడు అంటూ చాలా మంది ఈ వీడియోను ప్రశ్నిస్తున్నారు. క్యాబ్ డ్రైవర్ చాలా సింపుల్‌గానే రియాక్ట్ అయ్యాడు. కనీసం గట్టిగా కూడా డబ్బులు ఇవ్వాల్సిందే అని అడగలేదు. కనుక అతడు కేవలం టిప్ ఇవ్వాల్సిందిగా అడిగి ఉంటాడు అనేది కొందరి అభిప్రాయం. టూరిస్ట్ క్యాబ్ ను ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకుని ఉంటాడు. ఆన్ లైన్‌లో క్యాబ్ బుక్ చేసుకుంటే అమౌంట్‌ను ఆన్ లైన్ ద్వారానే కట్టాల్సి ఉంటుంది. అలా ఆన్ లైన్ చెల్లింపు చేసినా కూడా కొందరు కావాలని టిప్ రూపంలో కొంత మొత్తంను అడుగుతూ ఉంటారు. కొందరు ప్యాసింజర్‌లు టిప్ ఇస్తూ, డ్రైవర్‌లను ఎంకరేజ్ చేస్తారు. కానీ కొందరు మాత్రం అవసరం లేదు అన్నట్లుగా డబ్బులు లేవు అని ఇవ్వకుండానే దిగి పోతూ ఉంటారు.
వియాత్నంలో ఇండియా పరువు తీసిన టూరిస్ట్..
ఇక్కడ క్యాబ్ డ్రైవర్ డబ్బులు అడిగిన సమయంలో తన వద్ద డబ్బులు లేవు అన్నాడు. అప్పటికే ఆన్ లైన్ ద్వారా అమౌంట్ చెల్లించి ఉంటాడు కనుక డబ్బులు లేవని డ్రైవర్‌తో ఈజీగా చెప్పేసి దిగి పోయి ఉంటాడు అని ఇండియన్ టూరిస్ట్ వైపు మాట్లాడేవారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై క్లారిటీ రావాలి అంటే ఆ ఇండియన్ టూరిస్ట్ స్పందించాల్సిన అవసరం ఉంది. లేదంటే ఆ క్యాబ్ డ్రైవర్ సోషల్ మీడియాలో మరో పోస్ట్ ను షేర్ చేయాల్సిన అవసరం ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ టూరిస్ట్ క్యాబ్‌లో ప్రయాణించి డబ్బులు చెల్లించనట్లయితే కచ్చితంగా తప్పే అని, పరాయి దేశంలో ఇండియా పరువు తీసే విధంగా ప్రవర్తించినట్లే అని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ విషయం గురించి చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆ టూరిస్ట్ ఆన్ లైన్ ద్వారా స్పందిస్తాడా అనేది చూడాలి.
