Begin typing your search above and press return to search.

ఉలిక్క పడ్డ ఊబర్ డ్రైవర్... ఎదురొచ్చిన వింత జీవి వీడియో వైరల్!

అవును... ఓ ప్రయాణికుడిని తీసుకుని తాను కారులో వెళుతున్న సమయంలో ఎదురుగా ఓ వింత ఆకారం కనిపించిందని ఒక ఊబర్ డ్రైవర్‌ చెప్పుకొచ్చారు.

By:  Raja Ch   |   2 Oct 2025 4:00 PM IST
ఉలిక్క పడ్డ ఊబర్  డ్రైవర్... ఎదురొచ్చిన  వింత జీవి వీడియో వైరల్!
X

ఆన్ లైన్ లో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో ఇటీవల ఎక్కువగా ఏలియన్స్, వింత జీవులు, ఆకాశంలో వింత అకారాలు వంటివి ఉంటుంటాయి. ఆకాశంలో దేవుని రూపం కనిపించిందని, దేవదూతలు ఎగురుతున్నాయని ఒక వీడియో కనిపిస్తే... ఏలియన్స్ అలా ఎగురుతూ కనిపించారని మరో వీడియో హల్ చల్ చేస్తుంటుంది.

ఇక మరికొన్ని వీడియోల్లో... రాత్రి పూట వింత ఆకారం కనిపించిందని.. దెయ్యం తెల్ల దుస్తుల్లో ఒక బిల్డింగ్ పైనుంచి మరో బిల్డింగ్ పైకి నడుచుకుంటూ వెళ్తుందని.. రెండు కాళ్లతో నడుస్తున్న ఓ వింత జంతువు ఆకారం కనిపించిందని ఇలా రకరకాల వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తుంటాయి. అయితే అందులో ఏది నిజం, ఏది నకిలీ అనేది గుర్తించడం ఓ పెద్ద సమస్య.

పైగా ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వచ్చిన తర్వాత ఏది వాస్తవం, ఏది మాయ అనేది గుర్తించడం మహా ప్రహాసనంలా మారిన పరిస్థితి. ఈ నేపథ్యంలో తాను ఒక ప్రయాణికుడి తీసుకుని వెళ్తున్న సమయంలో రోడ్డుపై ఓ వింత ఆకారం కనిపించిందని, దాన్ని తన కారులో ఉన్న వ్యక్తి వీడియో తీశాడని చెబుతూ ఓ ఊబర్ డ్రైవర్ వీడియోను పోస్ట్ చేశారు.

అవును... ఓ ప్రయాణికుడిని తీసుకుని తాను కారులో వెళుతున్న సమయంలో ఎదురుగా ఓ వింత ఆకారం కనిపించిందని ఒక ఊబర్ డ్రైవర్‌ చెప్పుకొచ్చారు. ఆ వింత ఆకారం కనపడగానే ఒక్కసారిగా భయాందోళనకు గురయినట్లు తెలిపాడు. ఈ ఘటన సౌత్ కొరియాలో జరగగా... దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వివరాళ్లోకి వెళ్తే... తెల్లవారుజామున కారులో వెళుతున్న సమయంలో ఓ ఊబర్ డ్రైవర్‌ కు ఊహించని ఘటన ఎదురైందట. ఇందులో భాగంగా ఓ ప్రయాణికుడిని తీసుకుని కారులో ప్రయాణిస్తున్న సమయంలో అకస్మాత్తుగా ఓ వింతజీవి వచ్చి నిలబడిందట. ఆ జీవి వింతగా కనిపిస్తూ, మరింత వింతగా ప్రవర్తించడంతో తాను అవాక్కై అక్కడే ఆగిపోయినట్లు తెలిపారు.

ఆ వింత ఆకారం తొలుత చూడ్డానికి మనిషిలాగే కనిపించినా... దానికి వెనుక తోక కూడా ఉండటం, కాసేపు మనిషిలా నడుస్తూ, మరి కాసేపు కోతిలా ప్రవర్తించడం చూసి తాను ఆశ్చర్యపోయినట్లు అతడు చెప్పుకొచ్చారు. వాస్తవానికి ఈ ఘటన సౌత్ కొరియాలో జరిగినట్లు చెబుతున్నా.. అమెరికాలో జరిగినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారుతోన్న వేళ.. నెటిజన్లు కామెంట్ సెక్షన్ లో రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా... అది ఏఐ వీడియో అయ్యి ఉండొచ్చని ఒకరంటే... డ్రగ్స్ తీసుకున్న వ్యక్తి అలా తయారై రోడ్డుపై హల్ చల్ చేస్తున్నట్లున్నాడని మరొకరు స్పందించారు. మరికొతమంది మాత్రం అది వింత జీవే అనే అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు.