Begin typing your search above and press return to search.

"విలేజ్ ఆఫ్ డాక్టర్స్"..

అయితే ఈ పేరు రావడానికి కారణం ఏమిటంటే..ఒక గ్రామంలో అధిక సంఖ్యలో వైద్య నిపుణులు ఉండడాన్ని ఇలా పిలుస్తారు.

By:  Madhu Reddy   |   20 Jan 2026 8:35 AM IST
విలేజ్ ఆఫ్ డాక్టర్స్..
X

ఒక వ్యక్తి విజయం ఎంతోమందికి స్ఫూర్తినిస్తుంది అంటారు. అందుకే ఒక వ్యక్తి తన ప్రతిభతో విజయాన్ని సాధించి ఎంతో మందికి స్ఫూర్తినివ్వడమే కాకుండా ఆయా ప్రాంతాలకు గౌరవాన్ని అందించి వార్తల్లో నిలిచేలా చేస్తున్నారు. సాధారణంగా ఒక గ్రామం లేదా ఒక జిల్లా నుండి ఇద్దరు లేదా నలుగురు అంతకుమించి డాక్టర్స్ రావడం అనేది చాలా అరుదు..కానీ ఆ కాలంలోనే ఒకరు ఇద్దరే ఇప్పుడు వందలాది మందికి స్ఫూర్తిగా నిలిచి తమ ప్రాంతాలను విలేజ్ ఆఫ్ డాక్టర్స్ అని పిలిచేలా చేస్తున్నారు.. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ను మొదలుకొని మహారాష్ట్ర వరకు ప్రత్యేకించి కొన్ని ప్రాంతాలకు ఇలా విలేజ్ ఆఫ్ డాక్టర్స్ అనే పేరు వచ్చింది అంటే వైద్యుల గ్రామం అన్నమాట.

అయితే ఈ పేరు రావడానికి కారణం ఏమిటంటే..ఒక గ్రామంలో అధిక సంఖ్యలో వైద్య నిపుణులు ఉండడాన్ని ఇలా పిలుస్తారు. ఇకపోతే అధిక సంఖ్యలో వైద్యులు ఉన్న ఆ ప్రాంతాల విషయానికి వస్తే.. బీహార్ రాజధాని పాట్నాకు 55 కిలోమీటర్ల దూరంలోని అమ్హార గ్రామం ఉంది. ఇప్పుడు విలేజ్ ఆఫ్ డాక్టర్స్ గా పేరుపొందింది. ఈ ఒక్క చిన్న గ్రామం నుండి ఏకంగా 100 మంది డాక్టర్లు రావడం ఎంతో మందికి పూర్తినిస్తోంది అని చెప్పవచ్చు.. సమాజ సేవ కోసమే ఇక్కడ చాలామంది డాక్టర్ కోర్స్ చదువుతున్నారు.. ఈ గ్రామానికి చెందిన సీనియర్ డాక్టర్లు ఇక్కడ రెగ్యులర్గా హెల్త్ క్యాంపులు నిర్వహిస్తూ అటు విద్యార్థులకు సూచనలు, సలహాలు కూడా ఇస్తున్నారు. ఇక వీరిని ఆదర్శంగా తీసుకొని గ్రామంలో మరింత మంది మెడిసిన్ చదవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

ఇకపోతే ఈ ఒక్క ప్రాంతంలోనే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాలోని కనుగులవలస అనే ప్రాంతంలో తొలిసారి 1970లో మొదటి వైద్యుడు ఆవిర్భవించారు.. అయితే ఇప్పుడు ఆ ప్రాంతం నుండి ఏకంగా 150 మందికిపైగా వైద్యులు తయారయ్యారు. ఇక ఇక్కడ చాలామంది AIIMS, NIMS లలో పట్టభద్రులే కాదు విదేశాలలో కూడా పనిచేస్తున్నారు. అంతేకాదు ఇక్కడ వైద్యుడిని గౌరవిస్తూ.. వైద్యుడి విగ్రహం కూడా ఏర్పాటు చేయడం జరిగింది.

అలాగే మహారాష్ట్ర రాష్ట్రంలోని థానేకు సమీపంలో ఉన్న ఘరివాలి ప్రాంతంలో 2000వ సంవత్సరంలో ఒక వ్యక్తి ఎంబిబిఎస్ కోర్సు ను ప్రారంభించారు. అయితే ఇప్పుడు ఆ గ్రామంలో ప్రతి ఇంటిలో కూడా ఒక వైద్యుడు ఉండడం గమనార్హం. ఇక అందుకే ఈ వూరికి కూడా విలేజ్ ఆఫ్ డాక్టర్స్ అనే బిరుదు లభించింది. మొత్తానికి అయితే ఈ ప్రాంతాలన్నీ కూడా వైద్యులకు పుట్టినిల్లు గా మారిపోయి ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తున్నాయి.