ఇక్కడ గుంతలు లేవు...వాటే థాట్ బ్రో !
రోడ్లు అన్నవి ప్రధాన సమస్యగా మారిపోతున్నాయి. ఎందుకంటే రోడ్ల కోసం ఎంత వెచ్చించి అభివృద్ధి చేసినా వాటి నాణ్యత ఎంత బాగా ఉన్న హెవీ ట్రాఫిక్ తో పాటు భారీ వర్షాలు కురిసి రోడ్లను సర్వ నాశనం చేస్తున్నాయి.
By: Satya P | 5 Nov 2025 12:27 PM ISTరోడ్లు అన్నవి ప్రధాన సమస్యగా మారిపోతున్నాయి. ఎందుకంటే రోడ్ల కోసం ఎంత వెచ్చించి అభివృద్ధి చేసినా వాటి నాణ్యత ఎంత బాగా ఉన్న హెవీ ట్రాఫిక్ తో పాటు భారీ వర్షాలు కురిసి రోడ్లను సర్వ నాశనం చేస్తున్నాయి. రోడ్ల మీద గుంతలు పెద్ద ఎత్తున ఏర్పడుతున్నాయి. ఒకపుడు రోడ్లు వేస్తే కనీసం అయిదేళ్ళ పాటు ఉండేవి, ఇటీవల కాలంలో గట్టిగా రెండేళ్ళు ఉంటే గొప్పే అన్నట్లుగా వాతావరణం మారింది.
ప్రమాదాలకు రీజన్ :
రోడ్ల మీద భారీ స్థాయిలో ఏర్పడిన గుంతలు ప్రమాదాలకు సైతం కారణం అవుతున్నాయి. చేవేళ్లలో తాజాగా జరిగిన ఆర్టీసీ బస్సు కంకర టిప్పర్ ప్రమాదంలో భారీ గుంతల వల్లనే జరిగింది అన్నది అందరికీ తెలిసిందే. దాంతో వాహనదారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ప్రమాదాలు అలా జరిగిపోతూనే ఉన్నాయి. దీనికి ఏమిటి పరిష్కారం అని పాలకులు ఆలోచించేలోగానే ఈ యాక్సిడెంట్ల సంఖ్య అయితే భారీగా పెరిగిపోతోంది.
విజయవాడలో చూస్తే :
ఇక ఏపీకి రాజకీయ రాజధానిగా బిజీ సెంటర్ గా విజయవాడకు ఎంతో పేరు ఉంది. విజయవాడ రోడ్లు నిత్యం రద్దీగా ఉంటాయి. దాంతో పాటు ఇపుడు అభివృద్ధి అంతా అక్కడే ఉండడంతో ఫ్లోటింగ్ పాపులేషన్ కూడా బాగా పెరిగింది. దాంతో విజయవాడలో చాలా రోడ్లు భారీ ట్రాఫిక్ వల్ల తరచూ గుంతలు పడుతున్నాయి. దాంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో అదే బిగ్ ప్రాబ్లం గా మారుతోంది. ఇక వానలు పెద్ద ఎత్తున కురిస్తే కనుక గుంతలలో నీరు నిండి ప్రమాదాల స్థాయిని మరింత పెంచుతున్నాయి. అక్కడ గుంత ఉంది అన్నది కూడా తెలియక స్పీడ్ గా వాహనం పోనిస్తే టూ వీలర్స్ పూర్తిగా అందులో పడి యాక్సిడెంట్లు అవుతున్నాయి.
స్మార్ట్ ఐడియా :
విజయవాడ జాతీయ రహదారి ప్రసాదంపాడు, రామవరప్పాడు వద్ద భారీ వర్షాలకు రోడ్లు మునుగుతున్నాయి. దాంతో గుంతలు ఏమిటి మ్యాన్ హోల్స్ ఏమిటి అన్నది ఎవరికీ సరిగా కనిపించడం లేదు, దాంతో ఈ పరిస్థితిని గమనించిన విజయవాడ ట్రాఫిక్ పోలిఈసులు ఒక స్మార్ట్ ఐడియాను ప్లాన్ చేశారు. దానికి అమలు చేసి మరి మంచి మార్కులు కొట్టేసారు. ఇంతకీ ఆ సూపర్ ఐడియా ఏమిటి అంటే ఇక్కడ రోడ్లకు గుంతలు లేవు అని ప్ల కార్డులు పట్టుకుని నిలబడడం, మీరు హాయిగా హ్యాపీగా మీ జర్నీ కొనసాగించవచ్చు అని రాసి పెట్టిన ప్ల కార్డులను వారు ప్రదర్శిస్తూండదంతో వాహనదారులు నిశ్చింతగా తమ వెహికిల్స్ జోరు పెంచి ముందుకు సాగుతున్నారు.
థాంక్స్ టూ పోలీస్ :
నిజానికి ఈ రహదారికి వచ్చేసరికి వాహనదారులు చాలా స్లోగా నడుపుతున్నారు. ఎందుకంటే ఏ గుంతలో ఏ మ్యాన్ హోల్స్ లో తమ వాహనం దిగబడుతుందో అనన్ భయంతో. అయితే ట్రాఫిక్ పోలీసులే వారిని అప్రమత్తం చేస్తూ గుంతలు లేవు అన్న ప్ల కార్డులు ప్రదర్శించడంతో ఏ భయం లేకుండా గేర్ మార్చి స్పీడ్ పెంచుతున్నారు. ట్రఫిక్ పోలీసులు ఈ సూపర్ థాట్ తో తీసుకున్న చర్యల పట్ల వాహనదారులు అంతా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవడమే కాదు థాంక్స్ టూ ట్రాఫిక్ పోలీస్ అని కూడా కితాబు ఇస్తున్నారు. ఇక దీని వల్ల ట్రాఫిక్ కూడా చాలా వేగంగా క్లియర్ అవుతోందని ట్రాఫిక్ పోలీసులు అంటున్నారు. రెండిందాలుగా లభంగా ఉంది ఈ వ్యవహారం. ఏది ఏమైనా విధి నిర్వహణలో ఉన్న వారు కూడా సమాయనికి తగిన విధంగా కొత్త ఆలోచనలు చేస్తే రోడ్ల మీద ప్రయాణం సాఫీగా సాగుతుంది ప్రమాదాలకు కూడా ఆస్కారం ఉండదని విజయవాడ ట్రాఫిక్ పోలీసులు నిరూపించారు అన్న మాట.
