Begin typing your search above and press return to search.

బెజవాడలో దారుణం: తాగేందుకు రూ.10 తగ్గిందని చంపేశాడు

విజయవాడలో దారుణ ఉదంతం చోటు చేసుకుంది. మద్యం తాగేందుకు రూ.10 తగ్గితే.. ఆ డబ్బుల్ని అడిగితే.. ఇవ్వని వ్యక్తిని కత్తితో పొడిచి చంపేసిన ఉదతం వెలుగు చూసింది.

By:  Garuda Media   |   20 Dec 2025 11:10 AM IST
బెజవాడలో దారుణం: తాగేందుకు రూ.10 తగ్గిందని చంపేశాడు
X

విజయవాడలో దారుణ ఉదంతం చోటు చేసుకుంది. మద్యం తాగేందుకు రూ.10 తగ్గితే.. ఆ డబ్బుల్ని అడిగితే.. ఇవ్వని వ్యక్తిని కత్తితో పొడిచి చంపేసిన ఉదతం వెలుగు చూసింది. నిందితుడ్ని అతడి తల్లి పోలీసులకు పట్టించింది. విన్నంతనే షాక్ కు గురి చేసే ఈ ఉదంతంలోకి వెళితే.. విజయవాడలోని చిట్టి నగర్ ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల దుర్గాప్రసాద్ ఎలక్ట్రికల్ పనులు చేస్తుంటాడు.

తాజాగా అతను సిగిరెట్ తాగుతున్న విషయాన్ని చూసిన అతడి అన్న దుర్గా ప్రసాద్ ను మందలించాడు. దీంతో.. కోపానికి పోయిన దుర్గాప్రసాద్ మద్యం తాగాడు. మరోసారి తాగేందుకు అతడి వద్ద ఉన్న డబ్బులకు రూ.10 తగ్గింది. దీంతో ఆ డబ్బుల కోసం ఆ ప్రాంతంలో ఉండే 44 ఏళ్ల తాతాజీని రూ.10 ఇవ్వాలని అడిగాడు. అందుకు అతను ససేమిరా అన్నాడు. దీంతో వీరి మధ్య మాటా మాటా పెరిగింది.

ఈ క్రమంలో దుర్గాప్రసాద్ తీరుకు విసిగిన తాతాజీ.. అతడి చెంప మీద కొట్టాడు. దీంతో తాతాజీ మీద కసిని పెంచుకున్న దుర్గా ప్రసాద్.. ఇంటికి వెళ్లి కత్తి తీసుకొని.. నిద్రపోతున్న తాతాజీ ఛాతిలో పొడిచి చంపేశాడు. ఇక.. తాతాజీ విషయానికి వస్తే.. అతను మద్యానికి బానిస కావటంతో కుటుంబ సభ్యులు అతడికి దూరంగా ఉంటున్నారు. దీంతో తాపీ పనులు చేసుకుంటూ బతికేస్తున్నాడు. హత్యకు గురైన తాతాజీని ఎవరు హత్య చేశారన్న విషయాన్ని తేల్చేందుకు సీసీ ఫుటేజ్ ద్వారా దుర్గాప్రసాద్ ను గుర్తించారు. హత్య చేసిన కొడుకును తాజాగా పోలీసులకు సమాచారం ఇచ్చిన అతడి తల్లి.. పోలీసులకు అప్పజెప్పింది. బాధ్యత మరిచిన కొడుకును వెనకేసుకొని రాకుండా.. చట్టవిరుద్ధ చేష్టలకు తగినట్లుగా చట్టప్రకారం శిక్షించేందుకు వీలుగా పోలీసులకు అప్పజెప్పినట్లుగా చెబుతున్నారు.