Begin typing your search above and press return to search.

విజయసాయి - బొత్స మధ్యలో పాల్ !

2022 మంగళగిరిలో నిర్వహించిన వైసీపీ ప్లీనరీలో సజ్జల నా మీద భౌతికదాడి చేేశాడు. ఈ విషయం వైఎస్ జగన్ కు తెలిసినా ప్రేక్షకపాత్ర పోషించాడు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

By:  Garuda Media   |   31 Aug 2026 12:13 PM IST
విజయసాయి - బొత్స మధ్యలో పాల్ !
X

‘నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నమ్మకస్తుడిగా ఉండడం మూలంగా 15 నెలలు జైలులో ఉన్నాను. సజకజల రామకృష్ణారెడ్డి మాదిరిగా కాంగ్రెస్ పార్టీతో సంధి చేసుకుని చార్జ్ షీట్ల నుండి తప్పించుకోలేదు. సజ్జల ఒక నమ్మకద్రోహి. టీడీపీ కోవర్ట్’ అని మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2022 మంగళగిరిలో నిర్వహించిన వైసీపీ ప్లీనరీలో సజ్జల నా మీద భౌతికదాడి చేేశాడు. ఈ విషయం వైఎస్ జగన్ కు తెలిసినా ప్రేక్షకపాత్ర పోషించాడు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఈ నేపథ్యంలో స్పందించిన మాజీ మంత్రి బోత్స సత్యనారాయణ ‘విజయసాయి వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని, రాజకీయాల్లో ఇలాంటి వారు వస్తుంటారు, పోతుంటారని’ అన్నారు. మరో అడుగు ముందుకు వేసి ఇంతకుముందు మనకు కేఏ పాల్ అని ఒకరు ఉండేవారు. ఆయన ఏదేదో మాట్లాడుతుండేవడు. ఇప్పుడు విజయసాయిరెడ్డి ఆయన మాదిరిగా రెండో వ్యక్తిగా తయారయ్యాడని కేఏ పాల్ తో పోల్చారు. ఆయన మాటలకు స్పందించడం అంటే సమయం వృథా చేసుకోవడమేనని, ఈ విషయం గురించి మళ్లీ మళ్లీ మాట్లాడకుండా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని అన్నారు.

దీని మీద ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఘాటుగా స్పందిచడం విశేషం. ‘విజయసాయిరెడ్డి పార్టీ గురించి ప్రశ్నిస్తే నా గురించి మాట్లాడతావా. ఒళ్లు దగ్గరపెట్టుకో. వెంటనే నాకు క్షమాపణ చెప్పు. నా సమావేశాలకు లక్షల మంది వచ్చినప్పుడు నా దగ్గరకు వచ్చి నన్ను గెలిపించండి అన్న విషయం మర్చిపోయావా ? విజయనగరంలో నన్ను డబ్బులు అడిగిన విషయం మర్చిపోయావా’ అని ప్రశ్నించాడు. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై బొత్స స్పందించే క్రమంలో కేఎ పాల్ పేరు వాడడం మూలంగా ఈ మాటల యుద్దం మొదలయింది.

విజయసాయిరెడ్డి ఆరోపణల నేపథ్యంలో సజ్జల రామక్రిష్ణారెడ్డి స్పందించారు. కాంగ్రెస్ పార్టీతో రాజీపడి తాను చార్జ్ షీట్ల నుండి తప్పించుకున్నానని చేసిన ఆరోపణల నేపథ్యంలో ‘లిక్కర్ కేసుల్లో అందరూ అరెస్టు అయినా విజయసాయిరెడ్డి ఎలా తప్పించుకున్నారని, తన మీద భౌతికదాడి నిజమైతే పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని’ ప్రశ్నించారు. వైసీపీలో జగన్ ఒక్కరే నంబర్ ఒన్ అని, మిగిలిన వారు అందరూ కార్యకర్తలేనని, పార్టీకి కర్త, కర్మ, క్రియ జగన్ అని సమాధానం ఇచ్చారు.

జగన్ వ్యక్తిత్వం మీద దాడి జరుగుతుందని, ఆ విధంగా ప్రజా సమస్యల నుండి ప్రజల చూపును

మరల్చే ప్రయత్నం జరుగుతుందని, అందులో కొత్త పాత్రధారి విజయసాయిరెడ్డి అని సజ్జల అన్నారు. విజయసాయిరెడ్డిని నిజంగా అవమానించాలని అనుకుంటే రెండు సార్లు రాజ్యసభ సీటు ఎందుకు ఇచ్చే వారని, పార్లమెంటరీ పార్టీ లీడర్, పార్టీ జాతీయ కార్యదర్శి పదవులు ఎందుకు కట్టబెట్టేవారని అన్నారు. విజయసాయి ఆరోపణలు అన్నీ రాజకీయ ప్రేరేపితం అని అన్నారు. విజయసాయిరెడ్డి వ్యవహారం సజ్జల మీద నుండి బొత్స ద్వారా కెఎ పాల్ వరకు చేరింది. ఈ వివాదం ఎక్కడ ఆగుతుందో వేచిచూడాలి.