Begin typing your search above and press return to search.

ఒరిజినల్ రెడ్ల పార్టీ...వైసీపీకి విజయసాయి షాక్ !

అలా చూస్తే మాది ఒరిజినల్ రెడ్ల పార్టీ అని విజయసాయిరెడ్డి ఢంకా భజాయించి చెబుతున్నారు అంటే ఫేక్ రెడ్ల పార్టీ మరోటి ఉందా అని అంతా చర్చిస్తున్నారు.

By:  Satya P   |   19 Sept 2026 8:00 AM IST
ఒరిజినల్ రెడ్ల పార్టీ...వైసీపీకి విజయసాయి షాక్  !
X

మాది అసలు సిసలు రెడ్ల పార్టీ అంటున్నారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. అంతే కాదు ఒరిజినల్ రెడ్లు అన్న మాట కూడా ఆయన వాడారు. దానికి మరిన్ని విశేషణాలు జోడించారు. రాయలసీమ రెడ్ల పౌరుషం అన్నారు, ఆత్మ గౌరవం అన్నారు. ఇలా పవర్ ఫుల్ డైలాగులతో ఆయన తన తాజా ప్రెస్ మీట్ లో సంచలనం రేపారు. పైగా తాను అనంతపురం గడ్డ మీద నుంచి మాట్లాడుతున్నాను అని కూడా చెప్పారు. మా పార్టీ రెడ్లని కాపాడుతుందని స్పష్టం చేశారు. రండి పని చేద్దాం, అంతా కలసి రాష్ట్ర అభివృద్ధి చేదామని విజయసాయిరెడ్డి కోరుతున్నారు. దీంతో ఆయన ఆలోచనలు కొత్త పార్టీ మీద వ్యూహాలు ఏమిటో అన్న చర్చ అయితే సాగుతోంది. రాయలసీమ గడ్డ రెడ్ల పౌరుషం అన్న బలమైన పదాలు విజయసాయిరెడ్డి వాడడం మీద కూడా అంతా ఆలోచిస్తున్నారు.

ఫేక్ రెడ్ల పార్టీ ఉందా :

రాజు గారి పెద్ద రాణి మంచిది అంటే చిన్న రాణి కాదు అని అర్ధమేగా అన్నది ఒక సామెత. అలా చూస్తే మాది ఒరిజినల్ రెడ్ల పార్టీ అని విజయసాయిరెడ్డి ఢంకా భజాయించి చెబుతున్నారు అంటే ఫేక్ రెడ్ల పార్టీ మరోటి ఉందా అని అంతా చర్చిస్తున్నారు. ఈ డౌట్లు పెట్టడానికేనా ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేసింది అని అంటున్నారు. పదే పదే మాది ఒరిజినల్ రెడ్ల పార్టీ అని ఆయన నొక్కి మరీ చెబుతున్నారు అంటే వైసీపీ మీద పరోక్ష కామెంట్స్ ఘాటుగానే చేస్తున్నారా అన్న అనుమానాలు వస్తున్నాయి.

వైసీపీనే టార్గెట్ :

అంతే కాదు విజయసాయిరెడ్డి లేటెస్ట్ గానే కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒక సభలో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ని వీడియో బైట్ పెట్టి ఫ్లాష్ బ్యాక్ ని ముందు పెట్టారు. అలా వైసీపీ అంటే ఒక వర్గానికి పక్షపాతంగా ఉంటుందని మరో వర్గం పట్ల వివక్ష చూపిస్తుందని అర్ధం వచ్చేలా బాహాటంగానే ఆయన ఈ వీడియో బైట్ తో నిశిత విమర్శలు చేయకనే చేశారు అని అంటున్నారు. ఇపుడు చూస్తే కుల ప్రస్తావన కావాలనే తెచ్చారా అన్న డౌట్లు వస్తున్నాయి.

హార్డ్ కోర్ రీజియన్ :

ఇక వైసీపీకి రాయలసీమ హార్డ్ కోర్ రీజియన్ అన్నది తెలిసిందే. వైసీపీకి ఎంత కాదనుకున్నా అక్కడే బలం ఉంది. దాంతో అక్కడ నుంచే వైసీపీ గట్టిగా పుంజుకోవాల్సి ఉంది. అలాంటి చోట విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ ఒరిజినల్ రెడ్లు అంటూ పౌరుషాలు ఆత్మ గౌరవాల ప్రస్తావన తీసుకుని రావడం వెనక వ్యూహం ఏమిటి అని కూడా ఆలోచిస్తున్నారు. ఏది ఏమైనా విజయసాయిరెడ్డి కొత్త పార్టీ అయితే పెట్టలేదు, జెండా అజెండా ఏమిటో అన్నది కూడా ఎవరికీ తెలియదు, కానీ టార్గెట్ మాత్రం వైసీపీ అన్నది కచ్చితంగా అర్థం అవుతోంది అని అంటున్నారు.

తలనొప్పి తప్పదా :

వైసీపీకి 2024 ఎన్నికల్లో వైఎస్ షర్మిల రూపంలో కాంగ్రెస్ పార్టీ ద్వారా పెద్ద ఇబ్బంది వచ్చి పడింది. వైసీపీ ఎంతో లైట్ గా తీసుకుంది కానీ రిజల్ట్ మాత్రం దారుణంగా వచ్చింది. రాయలసీమలో అయితే వైసీపీకి ఏడు అసెంబ్లీ సీట్లు మాత్రమే వచ్చాయి. దాంతో షర్మిల దెబ్బ ఏంటో అర్థం అయింది. ఈసారి అంటే 2029 ఎన్నికల నాటికి విజయసాయిరెడ్డి రూపంలో మరోసారి తలనొప్పి తప్పదా అని అంటున్నారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉంది. మూడు పార్టీలతో కూటమి బలంగా ఉంది. ఒక్కో ఓటూ వైసీపీ పెంచుకోవాల్సిన చోట నిన్నటిదాకా పక్కన ఉన్న వారే ఎదురు నిలిచి బాణాలు ఎక్కుపెడితే జరిగే నష్టం ఏంటో ఇప్పటికే ఆ పార్టీ చవి చూసింది. 2029 ఎన్నికల మీద కోటి ఆశలు పెట్టుకున్న వైసీపీకి ఇపుడు కొత్త పార్టీ పేరుతో విజయసాయిరెడ్డి సవాల్ చేస్తున్నారు అని అంటున్నారు.