Begin typing your search above and press return to search.

వ్యవసాయిరెడ్డి ....చేరేది ఆ పార్టీలోనా ?

విజయసాయిరెడ్డి కాస్తా వ్యవసాయిరెడ్డి అయిపోయారు. ఆయన 2025 జనవరి 25న తన ఎంపీ పదవికి వైసీపీకి రాజకీయానికి కూడా కలిపి ఒకేసారి వీడ్కోలు పలికేశారు.

By:  Satya P   |   18 March 2026 5:00 PM IST
వ్యవసాయిరెడ్డి ....చేరేది ఆ పార్టీలోనా ?
X

విజయసాయిరెడ్డి కాస్తా వ్యవసాయిరెడ్డి అయిపోయారు. ఆయన 2025 జనవరి 25న తన ఎంపీ పదవికి వైసీపీకి రాజకీయానికి కూడా కలిపి ఒకేసారి వీడ్కోలు పలికేశారు. ఇప్పటికి పదిహేను నెలలు అయింది. ఈ మధ్యలో విజయసాయిరెడ్డి మీడియా ముందు హాట్ కామెంట్స్ చేస్తూ వచ్చారు తప్పించి రాజకీయంగా అయితే యాక్టివ్ గా లేరు. ఏ పార్టీలో కూడా చేరుతున్నట్లుగా హింట్ ఇచ్చినదీ లేదు. లేటెస్త్ గా చూస్తే ఆయన వ్యవసాయం చేస్తూ కనిపించారు ఒక సామాన్య రైతుగా మారి సేంద్రియ వ్యవసాయం చేస్తున్న పిక్స్ బయటకు వచ్చాయి.

డెడ్ లైన్ దగ్గరలో :

ఇక ఈ మధ్యనే విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాను తిరిగి రాజకీయాల్లోకి వస్తున్నట్లుగా చెప్పారు. తాను జూన్ తరువాత రాజకీయంగా యాక్టివ్ అవుతాను అని కూడా ప్రకటించారు. అయితే ఏ పార్టీ అన్నది మాత్రం సస్పెన్స్ లో పెట్టారు. మరి విజయసాయిరెడ్డి ఏ పార్టీ తీర్ధం పుచ్చుకుంటారు అన్నది చర్చగా మారింది. ఆయన ఆ మధ్యన మరో మాట అన్నారు. అవసరం అయితే తానే కొత్తగా ఒక ప్రాంతీయ పార్టీ పెడతాను అని. దాంతో ఆయన జూన్ నాటికి తన రాజకీయ భవిష్యత్తు మీద ఏమైనా తేల్చుకుంటారా అన్నది అంతా ఆసక్తిగా చూస్తున్నారు.

వైసీపీకి దూరంగానే :

ఇక వైసీపీకి విజయసాయిరెడ్డి దూరంగానే ఉండొచ్చు అని అంటున్నారు. ఆయన ఆ మధ్య ప్రెస్ మీట్ లో వైసీపీ మీద కొంత వ్యతిరేకంగా మాట్లాడారు, దాంతో పాటుగా జగన్ మళ్ళీ సీఎం అయ్యేది కష్టమని కూడా జోస్యం చెప్పారు. ఆ దిశగా వైసీపీలో వ్యూహాలు కూడా ఏవీ అమలు చేయడం లేదని అన్నారు. కూటమి పార్టీలు విడిపోక పోతే వైసీపీ తిరిగి అధికారంలోకి రావడం కష్టమని కూడా విజయసాయిరెడ్డి విశ్లేషించి చెప్పారు. దాంతో వైసీపీకి సహజంగానే కోపంగా ఉంటుంది. ఇక విజయసాయిరెడ్డి ఈ పరిణామాలు అన్నీ ఆలోచించిన మీదటనే వైసీపీ మీద ఈ తరహా కామెంట్స్ చేసారు అని అంటున్నారు.

రాజకీయం మారుతుందా :

ఇక చూస్తే జూన్ నాటికి ఏపీలోనూ దేశంలోనూ రాజకీయం మారుతుందా అన్న చర్చ కూడా సాగుతోంది. దేశంలో ప్రస్తుతం నాలుగు రాష్ట్రాలకు ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో బీజేపీకి కచ్చితంగా దక్కేది అస్సాం మాత్రమే కనిపిస్తోంది అని అంటున్నారు. అది కాకుండా బీజేపీ అనుకున్నట్లుగా పశ్చిమ బెంగాల్ లో గెలిచి తమిళనాడులో పాగా వేస్తే దేశ రాజకీయం వేరే విధంగా ఉండొచ్చు లేకపోతే ఇంకో విధంగా ఉంటుంది. ఇక బీజేపీ కూడా భవిష్యత్తు ఆలోచనలు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దాంతో జూన్ తరువాత జాతీయ ముఖ చిత్రం మారుతుందని అంటున్నారు. ఇవన్నీ ఆలోచించే విజయసాయిరెడ్డి జూన్ ని డెడ్ లైన్ గా పెట్టారా అన్న చర్చ సాగుతోంది.

కమలం చెంతనేనా :

విజయసాయిరెడ్డికి బీజేపీ పెద్దలతో మంచి రిలేషన్స్ ఉన్నాయని చెబుతున్నారు. ఇక రేపటి రోజున బీజేపీ వారికి కూడా కీలక నేతల అవసరం పడవచ్చు అని అంటున్నారు. ఇలా అన్నీ ఆలోచించినపుడు విజయసాయిరెడ్డి బీజేపీలోకి వెళ్ళే చాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుతానికి ఆయన వ్యవసాయిరెడ్డి ఆ తరువాత రాజకీయ వ్యవసాయం చేస్తారు అన్న మాట గట్టిగా వినిపిస్తోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.