Begin typing your search above and press return to search.

జగన్ కి సాయిరెడ్డికి చిచ్చుపెట్టింది వారే ?

జగన్ కి తెలిసి లిక్కర్ స్కాం జరిగి ఉండదని తాను భావిస్తున్నట్లుగా ఈడీ అధికారులకు చెప్పాను అన్నారు.

By:  Satya P   |   23 Jan 2026 8:26 AM IST
జగన్ కి సాయిరెడ్డికి  చిచ్చుపెట్టింది వారే ?
X

వైసీపీలో ఒక వెలుగు వెలిగిన విజయసాయిరెడ్డి ఆ పార్టీకి దూరం అయిపోయారు. అయితే తానుగా పార్టీని వీడలేదని తనను కావాలని టార్గెట్ చేసి జగన్ కోటరీ సైడ్ లైన్ చేసిందని జగన్ కూడా వారి మాటలను నమ్మి తనను పొమ్మనకుండా పొగపెట్టారని విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తాను వైసీపీకి నమ్మిన బంటుగా 2019 ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వచ్చేంతవరకూ పనిచేశాను అని ఆయన గుర్తు చేశారు. అయితే వైసీపీ పవర్ లోకి వచ్చిన ఏడాది దాకా జగన్ బాగానే చూసుకున్నారని తనకు నిజంగా నంబర్ టూ ప్లేస్ ఇచ్చారని విజయసాయిరెడ్డి చెప్పారు.

అలా జారిపోతూ వచ్చింది :

కానీ 2020 తరువాత మాత్రం నంబర్ టూ పొజిషన్ అలా జారిపోతూ వచ్చిందని విజయసాయిరెడ్డి చెప్పారు, జగన్ మనసు నుంచి తన స్థానం అలా పడిపోయిందని అన్నారు. టీడీపీలో ఎన్టీఆర్ కి చంద్రబాబు వెన్నుపోటు పొడిచిన మాదిరిగానే తాను జగన్ కి వెన్నుపోటు పొడుస్తాను అని కొందరు కోటరీ మనుషులు చెప్పిన మాటలను జగన్ నమ్మారని ఆయన అన్నారు. జగన్ లో తన పట్ల అభద్రతాభావం కలుగచేసే విధంగా దూరం అయ్యేలా చేశారు అని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు.

జగన్ కి తెలిసి జరగదు :

ఇక జగన్ కోటరీ మీద ఆగ్రహం వ్యక్తం చేసిన విజయసాయిరెడ్డి జగన్ మీద మాత్రం సాఫ్ట్ కార్నర్ నే చూపించారు. జగన్ కి తెలిసి లిక్కర్ స్కాం జరిగి ఉండదని తాను భావిస్తున్నట్లుగా ఈడీ అధికారులకు చెప్పాను అన్నారు. ఒకవేళ జగన్ కి తెలిస్తే మాత్రం ఆయన చూస్తూ ఊరుకోరని కూడా చెప్పాను అని అన్నారు. కోటరీ విషయానికి వస్తే తాను పార్టీని వీడేందుకు వారే కారణం అన్నారు. తాను పార్టీని వీడిపోయేందుకు లిక్కర్ స్కాం కారణం కానే కాదని అన్నారు. తాను లిక్కర్ స్కాం జరిగింది అన్నది కూడా నమ్మడం లేదని కూడా ఈడీకి చెప్పినట్లుగా ఆయన పేర్కొన్నారు.

బాబు ఇరికించారు :

టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు కావాలనే తనకు సంబంధం లేని కేసులలో ఇరికించారని విజయసాయిరెడ్డి విమర్శించారు. లిక్కర్ స్కాం తో పాటు కాకినాడ పోర్టు కేసు, అలాగే విశాఖ భూముల విషయంలో తనను అక్రమంగా ఇరికించారని ఆయన అన్నారు. అధికారం శాశ్వతం అని బాబు అనుకుంటున్నారని గతంలో జగన్ అలాగే భావించేవారు అని ఆయన విమర్శించారు. ఎవరికీ అధికారం శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలని విజయసాయిరెడ్డి అన్నారు.

వైసీపీలో అన్నీ జగనే :

వైసీపీలో నంబర్ వన్ నుంచి నంబర్ హండ్రెడ్ దాకా అన్నీ జగన్ మాత్రమే అని విజయసాయిరెడ్డి అన్నారు. ఈడీ అధికారులకు తాను ఇదే చెప్పాను అని స్పష్టం చేశారు. వైసీపీ లాంటి ప్రాంతీయ పార్టీలలో నంబర్ టూ అన్న పోస్టు ఉండదని ఆయన చెప్పారు. అక్కడ ఒక్కరే అంతా చూస్తారని అంటూ ఈడీ అధికారులకు ఇదే పేర్కొన్నాను అని అన్నారు. ఇక తనను మరోసారి ఈడీ పిలిచినా పిలవవచ్చు అని ఆయన చెప్పారు. బహుశా ఎంపీ మిధున్ రెడ్డి విచారణ తరువాత తనను పిలిచే వీలుండవచ్చు అని ఆయన అన్నారు. తమ మీద వ్యతిరేకంగా ఏ రకమైన సాక్ష్యాలు లేకపోవడం వల్లనే అరెస్ట్ చేయలేదని ఆయన అన్నారు. ఇక ఎన్ని సార్లు ఈడీ పిలిచినా తాను వచ్చి తనకు తెలిసిన విషయాలు చెబుతాను అని ఆయన స్పష్టం చేయడం విశేషం.