Begin typing your search above and press return to search.

సాయిరెడ్డి తన గ్యాప్‌ను ఇలా మ్యానేజ్ చేస్తున్నారా..?

మరోవైపు ప్రజలు కూడా ఈ రెండు రాజకీయ వర్గాలనే చూస్తున్నారు. ఇతర పార్టీలను పెద్దగా పట్టించుకునే పరిస్థితి కూడా కనిపించడం లేదు.

By:  Garuda Media   |   28 April 2026 8:00 AM IST
సాయిరెడ్డి తన గ్యాప్‌ను ఇలా మ్యానేజ్ చేస్తున్నారా..?
X

రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఉందని దీనిని భర్తీ చేయాల్సిన అవసరం కనిపిస్తోందని అన్నారు. మరి ఇది నిజమేనా.. సాయిరెడ్డి చెబుతున్నట్టుగా ఏపీలో రాజకీయ సూన్యత కనిపిస్తోందా అంటే నిజానికి లేదనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే వైసీపీ, టిడిపి, జనసేన, బిజెపి వంటి బలమైన పార్టీలు ప్రజల్లో ఉన్నాయి. ప్రజల తరఫున కూడా పనిచేస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన కూటమి పార్టీలు మూడు కూడా క్షేత్రస్థాయిలో బలంగా వ్యవహరిస్తున్నాయి.

అయినప్పటికీ సాయి రెడ్డి ఎందుకు ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది అంటే క్షేత్రస్థాయిలో వైసిపి కార్యక్రమాలు లేకపోవడంతో పాటు కాంగ్రెస్ను ఎవరూ ఆదరించే పరిస్థితి కనిపించకపోవడం వంటివి సాయిరెడ్డి ఊహాగానాలకు అంచనాలకు అవకాశం కల్పించింది. నిజానికి చెప్పాలంటే రాష్ట్రంలో గత ఎన్నికల్లో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ సహా అనేక చిన్నాచితక పార్టీలు పోటీ చేసినప్పటికీ టిడిపి కూటమి వైసిపి మధ్యనే పోరాటం జరిగింది. అధికారం కూడా కూటమికి దక్కడం వెనుక ఈ రెండు పార్టీల మధ్య ఉన్న బలమైన రాజకీయ వ్యూహం ఫలించేలా చేసింది.

మరోవైపు ప్రజలు కూడా ఈ రెండు రాజకీయ వర్గాలనే చూస్తున్నారు. ఇతర పార్టీలను పెద్దగా పట్టించుకునే పరిస్థితి కూడా కనిపించడం లేదు. అయితే వైసిపి లేకపోతే.. కూటమి అన్నట్టుగానే ప్రజల మధ్య కూడా చర్చ నడుస్తుంది. కాబట్టి సాయి రెడ్డి చెబుతున్నట్టుగా రాష్ట్రంలో రాజకీయ శూన్యత గాని రాజకీయ గ్యాప్ కానీ ఏమీ లేదు. వాస్తవానికి రాజకీయంగా గ్యాప్ ఉంది అంటే అది ఒక సాయి రెడ్డికి మాత్రమే ఉంటుంది. వైసిపి నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆయన ఏ పార్టీలోనూ చేరకపోవడం, ఏ పార్టీ కూడా ఆయనకు ఆహ్వానం పలికినట్టుగా సందేశం.. లేకపోవడం వంటివి గమనార్హం.

సాయి రెడ్డి తన గ్యాప్ ను రాజకీయ గ్యాప్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నారా.. అనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం సాయి రెడ్డి వంటి వారు కొంతమంది ఖాళీగా ఉన్నారు. ఇటు కేసులపరంగా అటు వ్యక్తిగతంగా కూడా వారు ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ఇలాంటివారు చేసే ప్రకటనల వెనక వ్యూహం ఉంటుంది. ఏపీలో అయితే రాజకీయ శూన్య‌త‌ గాని రాజకీయంగా గ్యాప్ కానీ లేవన్నది స్పష్టంగా కనిపిస్తోంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సాయి రెడ్డి చెబుతున్నంత గ్యాప్ అయితే లేదు.

ఒకవేళ ఉన్న దాన్ని భర్తీ చేయడానికి షర్మిల అదేవిధంగా కమ్యూనిస్టులు ఉన్నారు. ఇంకా చిన్నచితకా పార్టీలు చాలానే ఉన్నాయి. కాబట్టి ఇదంతా తాను రాజకీయాల్లోకి రావడం కోసం తన పార్టీని ప్రకటించడం కోసం సాయి రెడ్డి వేసిన ఒక వ్యూహాత్మక ఎత్తుగడగానే దీన్ని పరిశీలకులు చెబుతున్నారు.