సరస్వతి పవర్ పై విజయమ్మ రిప్లై కౌంటర్ లో ఏముంది?
ఈ తీర్పు చట్ట విరుద్ధమని వైఎస్ విజయమ్మ చెన్నై ఎన్ సీఎల్ ఏటీలో అప్పీళ్లు వేశారు. ఈ విచారణలో భాగంగా తన ప్రతివాది జగన్ ఆరోపణలకు విజయమ్మ తాజాగా సమధానం తన లాయర్ ద్వారా ఇచ్చారు.
By: Garuda Media | 18 March 2026 9:34 AM ISTఆస్తులకు సంబంధించి తన తల్లి విజయమ్మ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ.. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతి, క్లాసిక్ రియాల్టీ దాఖలు చేసిన పిటిషన్ పై హైదరాబాద్ ఎన్ సీఎల్ టీ లో పిటిషన్ వేయటం.. ఆ వాటాల బదలాయింపును రద్దు చేస్తూ జారీ చేసిన ఆదేశాల్ని నిలుపుదల చేసేందుకు విజయమ్మ జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్ చెన్నై బెంచ్ ను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఆమె తన వాదనను రిప్లై కౌంటర్ దాఖలు చేశారు. ఇందులో తన వాదనను తన లాయర్ ద్వారా వినిపించారు.
ఈ వివాదానికి సంబంధించిన అంశాల్ని క్లుప్లంగా చూస్తే..
విజయమ్మ.. జనార్దన్ రెడ్డిల పేరుతో వాటాల్ని బదలాయిస్తూ సరస్వతి పవర్ బోర్డు చేసిన తీర్మాన్ని.. దాని ప్రకారం రిజస్టర్ లో సభ్యుల పేర్లను మార్చటాన్ని జగన్, భారతిరెడ్డి, క్లాసిక్ రియాల్టీలు సవాలు చేయటం తెలిసిందే. వీరి పిటిషన్ ను విచారించిన వాటాల బదలాయింపును రద్దు చేస్తూ.. జగన్, భారతి, క్లాసిక్ రియాల్టీల షేర్లను పునరుద్ధరించాలని గత ఏడాది జులై 29న హైదరాబాద్ ఎన్ సీఎల్ టీ తీర్పు ఇచ్చారు.
ఈ తీర్పు చట్ట విరుద్ధమని వైఎస్ విజయమ్మ చెన్నై ఎన్ సీఎల్ ఏటీలో అప్పీళ్లు వేశారు. ఈ విచారణలో భాగంగా తన ప్రతివాది జగన్ ఆరోపణలకు విజయమ్మ తాజాగా సమధానం తన లాయర్ ద్వారా ఇచ్చారు. అందులో పేర్కొన్న అంశాల్ని చూస్తే..
- 2019 ఒప్పందం ప్రకారం సరస్వతి పవర్ కంపెనీ మొత్తం షర్మిలకు చెందాల్సిందే. ప్రత్యామ్నాయంగా మొత్తం వాటాలను నా పేరు మీద బదిలీ చేయాలని నిర్ణయించారు. ఈ వాటాల్ని నా నియంత్రణలో పెట్టుకొని.. నా భర్త ఆశయాల్ని అమలు చేస్తున్నా.
- ఈడీ జఫ్తులో ఉన్న వాటాలను బదిలీ చేయకూడదన్నది జగన్, భారతిరెడ్డిల ప్రధాన వాదన. అదే సమయంలో సండూర్, క్లాసిక్ రియాల్టీలోని వాటాల బదలాయింపును వారు ఎవరూ ప్రశ్నించలేదన్నది గమనార్హం.
- అందువల్ల జఫ్తులోని వాటాలను బదిలీ చేయకూడదన్నది కుటుంబ సభ్యుల మధ్య కుదిరిన అవగాహన.
- అలాంటి అవగాహనతో ముగిసిన ట్రాన్జాక్షన్ ను రద్దు చేయటానికి జగన్, భారతిరెడ్డిలు వేసిన ఎత్తుగడే తప్పించి వాస్తవం ఎంతమాత్రం కాదు.
- సండూర్ పవన్ లోని వాటాలను నాకు బదిలీ చేసిన తర్వాత ఈడీ జప్తు చేసింది. గిఫ్ట్ డీడ్, వాటా కొనుగోలు ఒప్పందాల అమలుతో సరస్వతి కంపెనీ నియంత్రణను డైరెక్టర్ల బోర్డు నాకు అప్పగించింది. జగన్ కు నామినీగా ఉన్న జెల్లా జగన్మోహన్ రెడ్డి కూడా ఈ ఒప్పందం తర్వాత రాజీనామా చేశారు.
- జగన్,భారతిలు వాటా సర్టిఫికేట్లు.. బదిలీ పత్రాలను నాకు అందజేశారు. ఒప్పందాల అమలుతో జగన్, భారతిరెడ్డి, క్లాసిక్ రియాల్టీల పాత్ర పూర్తైంది. వాటాల బదలీకి అధికారిక రిజిస్ట్రేషన్ జరగకున్నా దానిపై ఎలాంటి ప్రభావం లేదు.
- నా వాదనకు బలం చేకూరే మరో అంశాన్ని ఇక్కడ వివరిస్తాను. వివాదానికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడిన తర్వాత క్లాసిక్ రియాల్టీ వాటాల విక్రయానికి నా నుంచి తీసుకున్న మొత్తాన్ని తిరిగి ఇస్తానని చెప్పటమే ఇందుకు నిదర్శనం.
- ట్రైబ్యునల్ ఉత్తర్వులను గిఫ్ట్ డీడ్, వాటాల కొనుగోలు ఒప్పందాలు రద్దు అయినట్లుగా చిత్రీకరించటానికి ప్రయత్నిస్తున్నారు. వాటాల బదిలీకి 2024 జులైలోనే ఆమోదం లభించింది. కంపెనీకి జగన్ అభ్యంతరం రాసిన లేఖలో అతని వద్ద అసలైన వాటా సర్టిఫికెట్లు ఉన్నట్లుగా చెప్పలేదన్నది మర్చిపోకూడదు. అంతేకాదు.. ఈ సందర్భంగా నాపై ఉన్న ప్రేమ, అప్యాయతలను జగన్ కూడా నిరాకరించలేదన్నది మర్చిపోకూడదు.
