Begin typing your search above and press return to search.

ఎదురు నిలిచిన విజయమ్మ ...జగన్ కి భారీ షాక్

ఇంతకాలం చెల్లెలితోనే వైరం అనుకుంటున్న దశలో సాక్ష్తాత్తు తల్లి ఎంట్రీ ఇచ్చారు. అంతే తనయుడికి భారీ షాక్ తగిలింది.

By:  Satya P   |   20 March 2026 11:00 PM IST
ఎదురు నిలిచిన విజయమ్మ ...జగన్ కి భారీ షాక్
X

ఇంతకాలం చెల్లెలితోనే వైరం అనుకుంటున్న దశలో సాక్ష్తాత్తు తల్లి ఎంట్రీ ఇచ్చారు. అంతే తనయుడికి భారీ షాక్ తగిలింది. ఇది ఏపీలో ప్రముఖ రాజకీయ కుటుంబంగా ఉన్న వైఎస్సార్ ఫ్యామిలీలో చోటు చేసుకున్న అనూహ్యమైన సన్నివేశం. మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ కి తల్లి విజయమ్మ ఒక అవిడవిట్ ని తెర ముందుకు తెచ్చి గట్టిగానే ఎటాక్ చేశారు. అంతే కాదు జగన్ తన సొంత చెల్లెలుకు తీరని అన్యాయం చేశారు అని తీవ్ర ఆరోపణలు చేశారు. నిజాలు ఏమిటో నా దేవుడికీ నా కొడుకుకు కూడా తెలుసు అంటూ ఆమె చెప్పడం మరో విశేషం. ఈ మొత్తం ఎపిసోడ్ లో చూస్తే వైఎస్సార్ కుటుంబం నిలువునా చీలినట్లుగా కనిపిస్తోంది. జగన్ ఒక వైపు తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిల మరో వైపు ఉన్నట్లుగా ఈ సన్నివేశం చెబుతోంది.

కుండబద్దలు కొడుతూ :

ఏపీ మాజీ సీఎం అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకుడు అయిన దివంగత వైఎస్సార్ సతీమణిగా వైఎస్ విజయమ్మ తాజాగా సీన్ లోకి ఎంట్రీ ఇవ్వడం ఆసక్తిని గొలిపే విషయంగానే ఉంది. అంతే కాదు ఆమె ఒక అఫిడవిట్ ని వైఎస్సార్ కుటుంబ ఆస్తులకు సబంధించి రిలీజ్ చేస్తూ అనేక అంశాలు అందులోనే పేర్కొన్నారు. వైఎస్సార్ చనిపోయేంతవరకు ఉన్న ఆస్తులు అన్నీ కుటుంబ ఆస్తులే అని అసలు ఆస్తుల పంపకం జరగలేదని విజయమ్మ చెప్పడం విశేషం.

ఆస్తులన్నీ షర్మిలవే :

అంతే కాదు కీలకమైన ఆస్తులు అన్నీ షర్మిలవే అని ఆమె స్పష్టం చేశారు. సరస్వతి సిమెంట్‌తో సహా ఎంవోయూలో ఏని యెలహంక ల్యాండ్‌ కూడా షర్మిలదేనని విజయమ్మ చెప్పడం షాకింగ్ పరిణామంగా మారింది. అంతే కాది తన నలుగురు మనవళ్ళకు ఆస్తులు సమానంగా దక్కాలన్నదే వైఎస్సార్ ఆశ అని ఆమె కొత్త విషయం చెప్పారు. ఈ విషయం వైఎస్సార్ కి దగ్గర వారందరికీ తెలిసిన విషయం అన్నారు. అయితే ఇటీవల కొందరు వైసీపీ నాయకులు వైఎస్సార్ ఆస్తుల విషయంలో చేస్తున్న ప్రకటనల మీద విజయమ్మ మండిపడ్డారు.

జగన్ అన్యాయం అంటూ :

అంతే కాదు జగన్ తన చెల్లెకు షర్మిలకు అన్యాయం చేస్తున్నారు అని విజయమ్మ ఆరోపించడమే తీవ్రమైన విషయంగా ఉంది. ఇక జగన్ డబ్బులు చెల్లెలుకి ఇచ్చారు అని చెబుతున్నది కూడా షర్మిల వాటాకు వచ్చిన డివిడెండ్ మాత్రమే అని ఆమె స్పష్టం చేశారు. జగన్ తన మేనల్లుడికీ మేన కోడలికీ కూడా అన్యాయం చేశాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పటికైనా జగన్ న్యాయం చేస్తాడు అని తల్లిగా ఆశిస్తున్నాను అని విజయమ్మ చెప్పడం విసేషం. షర్మిలకు ఉన్న ఆస్తులు లాంటివి జగన్ కి సైతం ఆయన తండ్రి వైఎస్సార్ ఇచ్చారని ఆమె గుర్తు చేశారు.

మధ్యలో మీరెవరు :

అసలు నిజాలు ఏమిటి అన్నది తనకూ జగన్ కీ తెలుసు అని విజయమ్మ అన్నారు. అయితే గోబెల్ ప్రచారం చేయడానికి మధ్యలో మీరంతా ఎవరు అని ఆమె వైసీపీ నేతలను ప్రశ్నించారు. మీరు అసత్య ప్రచారాలు మానుకొవాలని వైఎస్సార్ భార్యగా చేతులు జోడించి కోరుతున్నాను అని ఆమె చెప్పడం గమనార్హం. అంతే కాదు తమ కుటుంబ ఆస్తుల మీద మరోసారి మీడియాలో ఎవరూ ప్రస్తావించవద్దు అని ఆమె కోరడం సైతం కొసమెరుపుగానే చూడాలి.

జగన్ భక్తుడిని అంటూ :

అయితే తాను జగన్ భక్తుడిని అంటూ ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాదరెడ్డి విజయమ్మను కొన్ని ప్రశ్నలు వేశారు. వైఎస్సార్ కుటుంబ ఆస్తులను పంచకపోతే ఒక్క జగన్ ఆస్తులనే సీబీఐ ఈడీ ఎందుకు జప్తు చేసాయో చెప్పాలని డిమాండ్ చేశారు. తన నాయకుడు జగన్ అని ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ ఉంటే తాము ఊరుకోమని రాచమల్లు చెప్పడం విశేషం. జగన్ ని జైలులో పెట్టిన పార్టీలోకి కుమార్తె వెళ్తున్నపుడు విజయమ్మ ఎందుకు అడ్డుకోలేదని ఆయన ప్రశ్నించారు. అంతే కాదు తన కుమారుడు ఓడిపోవాలని ఏ తల్లి అయినా కోరుతుందా అని ఆయన వ్యాఖ్యానిచారు. జగన్ బెయిల్ రద్దుకు మీరు ప్లాన్ చేస్తే జగన్ తాను రాసిన ఎం ఓ యూలను రద్దు చేసుకున్నారని రాచమల్లు చెప్పడం విశేషం.