చిరంజీవి...పవన్ బాటలో తమిళ దళపతి విజయ్
తమిళ దళపతిగా సూపర్ స్టార్ గా వెండి తెర మీద పవర్ ఫుల్ గా సౌండ్ చేసే విజయ్ రాజకీయ తెర మీద అదే బిగ్ సౌండ్ చేయాలని చూస్తున్నారు.
By: Satya P | 10 Feb 2026 9:23 AM ISTతమిళ దళపతిగా సూపర్ స్టార్ గా వెండి తెర మీద పవర్ ఫుల్ గా సౌండ్ చేసే విజయ్ రాజకీయ తెర మీద అదే బిగ్ సౌండ్ చేయాలని చూస్తున్నారు. తమిళగ వెట్రి కజగం టీవీకే పేరుతో పార్టీని స్థాపించిన విజయ్ కి క్రేజ్ వేరే లెవెల్ లో ఉంది. తమిళనాడులో మార్పు కోరుకునే వారు అంతా టీవీకేకి జై కొడుతున్నారు. ప్రత్యేకించి యూత్ లో విజయ్ కి ఫుల్ సపోర్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని విజయ్ ధీమాగా ఉన్నారు. అంతే కాదు తాను కింగ్ మేకర్ ని కాదని కింగ్ నే అని కూడా ఆయన స్పష్టంగా చెబుతున్నారు.
రెండు చోట్ల పోటీ :
ఇక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో పార్టీ నేతలతో తరచూ సమావేశాలు నిర్వహిస్తూ వ్యూహ రచన చేస్తున్నారు.. తాను ఎక్కడ నుంచి పోటీ చేయాలన్న దాని మీద విజయ్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు అని అంటున్నారు. ఆయన ఒక్క చోట కాదు రెండు చోట్ల పోటీకి దిగుతారు అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తొలిసారి పోటీ చేస్తున్న విజయ్ తన పట్టుని నిరూపించుకోవడమే కాకుండా రాజకీయంగా సేఫ్ జోన్ లో నిలించేందుకు ఈ ప్లాన్ లో ఉన్నారని అంటున్నారు. అదే విధంగా అధినేత హోదాలో తాను రెండు కీలక ప్రాంతాలలో పోటీ చేస్తే ఆయా చోట్ల టీవీకే అభ్యర్థులకు కూడా ప్లస్ అవుతుందని ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.
డీఎంకేకి బలమైన కోటలు :
ఇక చూస్తే కనుక విజయ్ ఎంచుకుంటున్న రెండు సీట్లు అధికార డీఎంకేకు బలమైన కోటలుగా ఉన్నాయని చెబుతున్నారు. అవి చెన్నైలోని విరుగంబాక్కం, తిరుచ్చి తూర్పు స్థానాలుగా ప్రచార సాగుతోంది. అయితే కొడితే కుంభ స్థలాన్నే కొట్టాలని భావించే విజయ్ ఈ సీట్లను ఎంచుకున్నారు అని అంటున్నారు. దీని వల్ల పట్టణ ప్రాంతాలలో తమ పార్టీ సత్తా చాటాలని ఆయన అనుకుంటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
యూత్ ని టార్గెట్ చేస్తూ :
ఈసారి ఎన్నికల్లో మొదటిసారిగా తమ ఓటు హక్కుని వినియోగించే యూత్ ని టార్గెట్ చేయాలని కూడా విజయ్ భావిస్తున్నారు అని అంటున్నారు. య్హూత్ లో ఆదరణ పార్టీకి బాగా ఉన్నందువల్ల కచ్చితంగా మంచి విజయం నమోదు అవుతుందని అంటున్నారు. ఇక చెన్నైలోని విరుగంబాక్కం అంటే డీఎంకే స్థావరంగా ఉంది. అక్కడ ఆ పార్టీని ఢీ కొట్టడంతో పాటు రెండవ సీటుజిగా తిరుచ్చి తూర్పు సీటుని ఎంచుకోవడం ద్వారా మొత్తం రాష్ట్రంలో తమ పార్టీ బలం ఉందని చెప్పడమే విజయ్ ఉద్దేశ్యం అని అంటున్నారు.
ఉద్ధండులు ఉన్న చోట :
ఇక డీఎంకేకువిరుగంబాక్కం, తిరుచ్చి తూర్పు నియోజకవర్గాలు కంచుకోటలుగా ఉన్నాయి. అక్కడ ఉద్ధండులు అయిన నేతలు ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఏఎంవి ప్రభాకర రాజా, ఇనిగో ఎస్ ఇరుదయరాజ్ ఉన్నారు. వారి మీద విజయ్ పోటీ అంటే రసవత్తరంగా ఉండబోతోంది అని అంటున్నారు. ఇక తొందరలో ఈ రెండు చోట్ల భారీ కార్యాచరణకు టీవీకే సిద్ధం అవుతోంది.
చిరు పవన్ ప్రయోగం :
ఇక ఏపీ రాజకీయాల్లో చూస్తే ప్రజారాజ్యం తరఫున చిరంజీవి 2009లో రెండు చోట్ల పోటీ చేశారు, అందులో ఒకటి గోదావరి జిల్లాలలోని పాలకొల్లు అయితే రెండవది తిరుపతిగా ఉంది. అయితే పాలకొల్లులో ఓటమి సంభవించింది. తిరుపతిలో గెలిచారు. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన తరఫున రెండు సీట్లకు పోటీ చేశారు. అందులో ఒకటి విశాఖ నుంచి గాజువాక అయితే రెండవది భీమవరం. ఈ రెండు చోట్లా పవన్ కళ్యాణ్ ఓటమి పాలు అయ్యారు. ఇక 1983లో ఎన్టీఆర్ టీడీపీని స్థాపిస్తూ రెండు చోట్ల పోటీ చేశారు. గుడివాడ తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గాల నుండి పోటీ చేసి రెండింటిలోనూ గెలిచి తెలుగుదేశం పార్టీని కూడా భారీ విజయం దిశగా నడిపించారు. విజయ్ కూడా సినీ రంగం నుంచి వచ్చిన వారే. ఆయన సైతం రెండు సీట్లకు పోటీ చేయడం విశేషం. ఆయన రాజకీయంగా ఘన విజయంతో ఎన్టీఆర్ అవుతారా అన్న చర్చ కూడా ఉంది.
