విజయ్ టీవీకేకి జెన్ జెడ్ ప్లస్ మహిళలు ఫుల్ సపోర్ట్
కానీ యాక్సిస్ మై ఇండియా అన్న సంస్థ మాత్రం విజయ్ పార్టీకి 98 నుంచి 120 దాకా అసెంబ్లీ సీట్లు లభిస్తాయిని తేట తెల్లం చేసింది. దాంతో ఇప్పుడు ఈ సర్వే మీద అతి పెద్ద చర్చ సాగుతోంది.
By: Satya P | 30 April 2026 11:29 PM ISTతమిళనాడు ఎన్నికల్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని ఎగ్జిట్ పోల్ సర్వేలు వెల్లడిస్తున్నాయి అయితే ఈ ఎన్నికల్లో కొత్తగా పోటీ చేసిన దళపతి విజయ్ పార్టీ టీవీకే కింగ్ అవుతుందా లేదా కింగ్ మేకర్ అవుతుందా అన్న దాని మీద అతిపెద్ద చర్చ సాగుతూ వస్తోంది. అయితే టీవీకేకు కేవలం 15 నుంచి 30 సీట్లు మాత్రమే లభిస్తాయి అని అనేక రకాల సర్వేలు వెల్లడించాయి. కానీ యాక్సిస్ మై ఇండియా అన్న సంస్థ మాత్రం విజయ్ పార్టీకి 98 నుంచి 120 దాకా అసెంబ్లీ సీట్లు లభిస్తాయిని తేట తెల్లం చేసింది. దాంతో ఇప్పుడు ఈ సర్వే మీద అతి పెద్ద చర్చ సాగుతోంది.
సొంతంగా పోటీతో :
ఇక తమిళనాడులో ఎన్నికల్లో విజయ్ సొంతంగా పోటీ చేశారు అంతే కాదు మొత్తం 234 అసెంబ్లీ సీట్లకు తన అభ్యర్థులను నిలబెట్టారు ప్రతిచోట ఆయన ప్రచారం గట్టిగా చేశారు తాను గెలిచి ముఖ్యమంత్రి అవుతానని అటు పార్టీ కార్యకర్తల్లోనూ ఇటు అభిమానుల్లోనూ మరోవైపు సామాన్య జనంలోనూ ఒక విశ్వాసాన్ని కలిగించారు దాంతో గతంలో ఎన్నడూ లేని విధంగా తమిళనాడు ఎన్నికల్లో బ్రహ్మాండమైన పోలింగ్ జరిగింది . ఏకంగా 85 శాతం పైగా పోలింగ్ నమోదు కావడం తమిళనాడు చరిత్రలో ఎన్నడూ లేని విషయం ఇక ఈ భారీ పోలింగ్ ఎవరికి అవకాశం ఇస్తుంది ఎవరిని అందరం ఎక్కిస్తుంది అన్న చర్చ ఒకవైపు జరుగుతుండగానే వచ్చిన ఎగ్జిట్ పోల్స్ తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ తక్కువ సీట్లతో అయినా గెలుస్తుంది అని చెప్పుకొచ్చాయి అదే సమయంలో అన్నాడీఎంకే కూటమి భారీగా నష్టపోతుందని కూడా స్పష్టం చేశాయి అయితే విజయ్ పార్టీ ఏకంగా డబుల్ డిజిట్ 15 శాతం పైగా ఓట్ షేర్ తో పాటు 30 కి పైగా అసెంబ్లీ సీట్లు సాధిస్తుంది అన్న అంచనాలు అయితే చాలా ఎగ్జిట్ పోల్స్ బట్టి అర్థం అవుతుంది.
తమిళనాట మార్పు :
కానీ తమిళనాడులో గడచిన రెండు మూడు రోజుల్లో జరుగుతున్న ప్రచారం కానీ వాతావరణం కానీ చూస్తే కనుక విజయ్ పార్టీ మంచి ఆధిక్యతతో గెలిచి కొత్త ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారని చెబుతున్నారు ముఖ్యంగా తమిళనాడు రాజకీయం విజయ్ పార్టీకి అనుకూలంగా మారిందని విశ్లేషణలు ఉన్నాయి ఎందువలనంటే గడచిన దశాబ్దాల కాలంలో ద్రవిడ పార్టీలుగా ఉన్న డీఎంకే అన్నాడీఎంకే రెండు కూడా ప్రజా విశ్వాసాన్ని తగ్గించుకుంటూ వస్తున్నాయి. ఇంతకాలం సరైన ప్రత్యామ్యాయం లేకపోవడం వల్లనే ఈ రకమైన పరిస్థితి ఉందని విశ్లేషణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో పెద్ద ఎత్తున మహిళలు మహిళలు మధ్యతరగతి వర్గాలు యువత పోలింగ్ బూతుల కొచ్చి ఓటు చేయడం విశేష పరిణామంగా చెబుతున్నారు. ఇది మార్పునకు సంకేతంగా కూడా అంటున్నారు.
జెన్ జెడ్ రంగంలోకి :
మరీ ముఖ్యంగా జెన్ జెడ్ వర్గాలు పోటెత్తి మరి విజయ పార్టీ ఓటు చేసినట్టుగా ఎగ్జిట్ పోల్స్ సర్వేలు బట్టి అర్థమవుతుంది దీంతో విజయ్ పార్టీకి మంచి మెజారిటీ దక్కుతుందని వస్తుందని ఈసారి వినూత్నమైన విలక్షణమైన తీర్పు తమిళనాడు ఓటర్లు అందిస్తారని భావిస్తున్నారు అదే కనుక జరిగితే తమిళనాడు రాజకీయాల్లో సంచలనం నమోదు అవుతుందని అంటున్నారు ముఖ్యంగా యువత ప్లస్ మహిళ కలసి కొత్త పార్టీ వెన్నుదన్నుగా నిలిచారని విశ్లేషణలు ఉన్నాయి ఈ నేపథ్యంలో నాలుగున్నర దశాబ్దాల క్రితం తెలుగు నాట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీ రామారావు సృష్టించిన ప్రభంజనం తమిళనాడులో విజయ్ సృష్టిస్తారని అంతా భావిస్తున్నారు.
కీలక సమావేశం :
ఇదిలా ఉంటే తమిళనాడు ఎన్నికలకు సంబంధించి తన దగ్గర ఉన్న నివేదికలు అదేవిధంగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలను దగ్గర పెట్టుకొని దళపతి విజయ్ టీవీ కె పార్టీకి చెందిన 234 మంది అభ్యర్థులతో అత్యంత కీలకమైన సమావేశాన్ని పార్టీ కార్యాలయంలో నిర్వహించారు ఈ సందర్భంగా కౌంటింగ్ వేళ ఏ విధంగా అభ్యర్థులు కామా పార్టీ నాయకులు పార్టీ నాయకులు అనుసరించాలిసిన విధానంపై చర్చించినట్లుగా తెలుస్తోంది. అదే విధంగా గెలిచిన తరువాత తమ పార్టీ ఎమ్మెల్యేలను ఏ విధంగా కాపాడుకోవాలి అన్న దాని మీద కూడా చర్చ సాగిందని అంటున్నారు.
కొత్త పార్టీ పట్ల మోజు :
ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి ఎన్నికల్లో టీవీకే విజయం సాధిస్తుందని ఆ పార్టీ నాయకులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు తమిళనాడు చరిత్రలో ఒక ఎంజీఆర్ మాదిరిగా ఒక జయలలిత మాదిరిగా సరికొత్త రాజకీయ ప్రభంజనం సృష్టించేందుకు టీవీ కె అధినేత విజయ్ సిద్ధంగా ఉన్నారని అంటున్న ఐదేళ్ల డిఎంకె పరిపాలనలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలకు అదే విధంగా అంతకుముందు ఐదేళ్లపాటు బాధించిన పరిపాలన పరిపాలనలో ఎదుర్కొన్న ఇబ్బందులను చవి చూసిన తమిళనాడు ప్రజానీకం కొత్త పార్టీ పట్ల మోజు పెంచుకొని టీవీకేకి ఓట్ల వర్షం కురిపించాలని విశ్లేషణలు అయితే ఉన్నాయి.
ఎన్డీయేతో కలసి :
కానీ తమిళనాడులో దశాబ్దాలుగా పాతుకుపోయిన డీఎంకే పార్టీలు క్షేత్రస్థాయి వరకు విస్తరించి ఉన్నాయి ఈ రెండు పార్టీలను ఢీ కొట్టి మ్యాజిక్ ఫిగర్ అయిన 118 సీట్లు టీవీకే సొంతంగా గెలుచుకుంటుందా అన్నది ఒక చర్చగా ఉంది ఒకవేళ టీవీకె పూర్తిస్థాయి సీట్లను సాధించకపోతే ఎన్డీఏతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా అన్నది కూడా మరో చర్చిగా ఉంది. అయితే తమిళనాడు రాజకీయాల్లో విజయ్ మాత్రం అత్యంత కీలకమైన భూమిక పోషించబోతున్నారు అన్నది స్పష్టం. ఇక చూస్తే కనుక తమిళనాడులో డిఎంకె రెండు పార్టీల శిబిరాల్లో ఒకే ఎంత కలవరం చెలరేగుతుంది కొత్త పార్టీగా రంగంలోకి దిగిన విజయ్ ఏ పార్టీ అవకాశాలను దెబ్బతీశారు అన్నదానిమీద ఆయా శిబిరాల్లో లోతైన చర్చ సాగుతోంది మరోవైపు చూస్తే విజయ్ పార్టీతో పొత్తుకు అటు ప్రధాన పార్టీలు ఆసక్తిగా ఉన్నాయని తెలుస్తున్న విషయం. విజయ్ పార్టీతో ఓటుకు గతంలోనే బిజెపి కాంగ్రెస్ ప్రయత్నించాయి కానీ ఆయన పొత్తులకు సుముఖత వ్యక్తం చేయడంతో ఆయా పార్టీలు ఒకంత ఒకంత ఇదిలా ఉండగా ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాకపోయిన పక్షంలో విజయ్ కింగ్ మేకర్ అవుతారని మాత్రం సర్వత్రా చర్చ సాగుతోంది.
