విజయ్ రాజీనామా చేసే చోట ఎవరు?
తాను రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నానని, సీఎం పదవిని కూడా చేపట్టాలని ఉందని గతంలో త్రిష వ్యాఖ్యానించింది.
By: Garuda Media | 5 May 2026 10:35 AM ISTతమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనమే నమోదైంది. ఉద్ధండ పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకేలను వెనక్కి నెట్టి కొత్త పార్టీ అయిన తమిళ వెట్రి కళగం (టీవీకే) అధికారం చేపట్టే దిశగా అడుగులు వేస్తోంది. అంచనాలను మించిపోయి అద్భుత ఫలితాలను రాబట్టిన విజయ్ పార్టీ మ్యాజిక్ ఫిగర్‌కు చేరువగా ఉంది. నన్ను నమ్మండి, ప్రతి నియోజకవర్గంలోనూ నేనే పోటీ చేస్తున్నట్లు భావించండి అంటూ విజయ్ చెప్పిన మాటలను మెజారిటీ జనం విశ్వసించారని అర్థమవుతోంది.
విజయ్ ఇటు పెరుంబూరు, అటు తిరుచ్చిరాపల్లి నియోజకవర్గాల నుంచి పోటీ చేయగా.. రెండు చోట్లా విజయం దిశగా అడుగులు వేస్తున్నారు. పార్టీ అధినేతలు ఇలా రెండు చోట్ల నుంచి పోటీ చేయడం ఎప్పట్నుంచో ఉన్నదే. అలా గెలిచాక ఒక స్థానం నుంచి రాజీనామా చేసి.. ఆరు నెలల్లోపు మరో అభ్యర్థిని నిలబెట్టి గెలిపించుకోవడం మామూలే. మరి విజయ్ ఏ స్థానాన్ని అట్టిపెట్టుకుంటారు.. దేన్ని వదిలేస్తారు.. రాజీనామా చేసే నియోజకవర్గంలో ఎవరిని నిలబెట్టి గెలిపించుకుంటారు అన్నది ఆసక్తికరం.
ఈ విషయంలో ఇప్పటికే ఒక ఆసక్తికర ప్రచారం మొదలైంది. ఆ అవకాశం త్రిషకే విజయ్ ఇస్తాడని అంటున్నారు. తన భార్య సంగీతకు విడాకులు ఇవ్వడానికి సిద్ధమైన విజయ్.. కొన్నేళ్లుగా త్రిషతో మంచి స్నేహం ఉంది అని అంటున్నారు. వీరి బంధం ఎన్నికల ముంగిట బహిర్గతం అయింది కూడా. తాను రాజీనామా చేసే నియోజకవర్గంలో త్రిషనే నిలబెట్టి, గెలిపించుకుని, ఆమెను విజయ్ మంత్రిని చేస్తాడని.. త్రిష డిప్యూటీ సీఎం అయినా ఆశ్చర్యం లేదని ఊహాగానాలు నడుస్తున్నాయి. త్రిషకు రాజకీయాల మీద ఆసక్తి లేకుండా ఏమీ లేదు.
తాను రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నానని, సీఎం పదవిని కూడా చేపట్టాలని ఉందని గతంలో త్రిష వ్యాఖ్యానించింది. నిజానికి ఇటీవల ఎన్నికల్లోనే త్రిష పోటీ చేయొచ్చని ఒక ప్రచారం నడిచింది. కానీ అది నిజం కాలేదు. ఐతే ఇప్పుడు త్రిష రాజకీయ అరంగేట్రానికి అత్యంత అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు ఎంజీఆర్ పక్కనే ఉండి అన్నాడీఎంకేలో కీలక పాత్ర పోషించిన జయలలిత.. ఆయన మరణానంతరం ఏకంగా సీఎంయే అయ్యారు. మరి త్రిష రాజకీయ ప్రయాణం ఎలా ఉంటుందో చూడాలి. ఇంతకీ విజయ్ తాను ఖాళీ చేసే స్థానంలో త్రిషను నిలబెడతాడా లేదా అన్నది ఆసక్తికరం.
