ఎన్నికల్లో ప్రభంజనం సరే.. పాలన అంత `విజయ్` కాదు!
తమిళనాడు ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించడం.. పార్టీ ఏర్పాటు చేసిన కేవలం 26 మాసాల్లోనే అధికారంలోకి రావడం.. వంటి పరిణామాలు.. నటుడు, దళపతి విజయ్‌కు మెచ్చుతునకలు కావొచ్చు.
By: Garuda Media | 5 May 2026 7:00 AM ISTతమిళనాడు ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించడం.. పార్టీ ఏర్పాటు చేసిన కేవలం 26 మాసాల్లోనే అధికారంలోకి రావడం.. వంటి పరిణామాలు.. నటుడు, దళపతి విజయ్‌కు మెచ్చుతునకలు కావొచ్చు. ఆయనపై పొగడ్తల వర్షం కురిపించవచ్చు. కానీ.. అధికారంలోకి రావడం.. వచ్చిన తర్వాత.. ఐదేళ్లపాటు అప్రతిహతంగా తిరుగులేని విధంగా ముందుకు సాగడం అనేది అంత ఈజీ అయితే కాదని పరిశీలకులు చెబుతున్నారు. దీనికి కారణం.. ప్రజలు ఇచ్చిన `తీర్పే`!!
తాజా ఎన్నికల్లో విజయ్‌కు 112 సీట్లు మాత్రమే దక్కనున్నాయి. కానీ, అధికారంలోకి వచ్చే పార్టీకి మేజిక్ ఫిగర్ 118 సీట్లు రావాలి. అంటే.. విజయ్ పార్టీ టీవీకేకి.. మరో 6 సీట్లు తగ్తుతున్నాయి. ఈ క్రమంలో ఆయన చిన్నా చితకా పార్టీలతో చేతులు కలపక తప్పదు. ఒకరకంగా చెప్పాలంటే.. టీవీకేకు 112 సీట్లు వచ్చినా.. ఇతర పార్టీలు ద్వారా లభించే ఆ 6 సీట్లే అత్యంత కీలకం. అంటే.. ఒకరకంగా అంత పెద్ద గుమ్మడికాయ కూడా.. చిన్న కత్తికి లోకువ అన్నట్టుగా.. ఆ ఆరు సీట్లు పొందిన పార్టీతో పెట్టుకునే పొత్తు.. కీలకంగా మారనుంది.
ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం.. విజయ్‌తండ్రి కాంగ్రెస్ పార్టీ ముందుకు రావాలని తమతో చేతులు కలపాలని కోరుతున్నా రు. ఇక, ఈ పార్టీతో పాటు.. దివంగత విజయ్‌కాంత్ పార్టీ డీఎండీకే, పీఎంకే, కమ్యూనిస్టులతో కలిసి ముందుకు వెళ్తే బాగుంటుం దన్న సూచనలు వస్తున్నాయి. కానీ, వేటితో పొత్తు పెట్టుకున్నా.. ఆయా పార్టీలపై విజయ్ ఆధారపడి ప్రభుత్వాన్ని ముందుకు నడపాల్సి ఉంటుంది. తాను తీసుకునే నిర్ణయాలను ఆయా పార్టీలతో ఒప్పించాల్సి ఉంటుంది. తమిళనాడులో ఏ రోజూ.. రాజకీ యాలు సుస్థిరంగా ఉండవు. అనేకవివాదాలు.. విమర్శలు.. సంఘర్షణలతోనే ముందుకు సాగుతున్నాయి.
ఈ క్రమంలో విజయ్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా.. ఆయనకు దినదినగండంగానే ఉంటుందన్న చర్చ తెరమీదికి వచ్చింది. ఏ చిన్న తేడా వచ్చినా.. మద్దతు ఉపసంహరిస్తే.. ప్రభుత్వం మెజారిటీ పోయి.. కూలిపోవడం ఖాయం. ఈ నేపథ్యంలో విజయ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. చిన్న చితకా పార్టీలను వద్దుకుంటే.. ఆయన ఏఐఏ డీఎంకే తో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదైతే.. రెండో ప్లేస్‌లో ఉండడంతోపాటు పెద్ద పార్టీ కూడా కావడం గమనార్హం.
పైగా గత ఐదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న అన్నాడీఎంకే.. అధికారంలోకి వచ్చేందుకు ఎన్నో ఆశలు పెట్టుకుంది. అదేసమయంలో అధికారం ఉంటుంది కాబట్టి.. మద్దతు ఉపసంహరించే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో విజయ్ తీసుకునే నిర్ణయమే కీలకం కానుంది.
