విజయ్ గెలుపు వెనక సంచలన విషయాలు!
తమిళనాడులో విజయ్ పార్టీ ప్రభంజనం కొనసాగుతోంది. విజయ్ పార్టీ టీవీకే అనూహ్యమైన ఫలితాలను సాధిస్తోంది. ఆ పార్టీకి తమిళ జనాలు పూర్తి మద్దతు ప్రకటించాయి
By: Satya P | 4 May 2026 3:21 PM ISTతమిళనాడులో విజయ్ పార్టీ ప్రభంజనం కొనసాగుతోంది. విజయ్ పార్టీ టీవీకే అనూహ్యమైన ఫలితాలను సాధిస్తోంది. ఆ పార్టీకి తమిళ జనాలు పూర్తి మద్దతు ప్రకటించాయి. త్రిముఖ పోరులో విజయ్ పార్టీ ఏమి సాధిస్తుంది అనుకున్న వారికి సరైన జవాబుగా టీవీకే సాధిస్తున్న ఫలితాలు ఉన్నాయి. అసలు ఎవరు ఊహించని విధంగా విజయ్ టీవీకే తమిళనాడులో రాజకీయ సునామీ సృష్టించింది. నిజానికి ఎగ్జిట్ పోల్స్ సర్వేలు ఏవీ కూడా విజయ్ పార్టీ ఇన్ని సీట్లు సాధిస్తుందని ఎక్కడ అంచనా వేయలేదు. అయితే ఒకే ఒక సర్వే సంస్థ యాక్సిస్ మై ఇండియా మాత్రం విజయ్ పార్టీ టీవీకేకి 98 నుంచి 120 దాకా సీట్లు సాధిస్తుందని అంచనావేసింది. ఈరోజు ఇదే అదే నిజమైంది.
అప్పటి నుంచే కోరిక :
ఇదిలా ఉంటే విజయ్ పార్టీకి కలసి వచ్చిన అంశాలు ఏమిటి అన్న చర్చ ఇపుడు వేడిగా వాడిగా సాగుతోంది. విజయ్ సినిమా రంగం నుంచి రాజకీయ రంగంలోకి అడుగు పెట్టారు. అందరి మాదిరిగానే ఆయన కూడా సినిమాల్లో టాప్ స్టార్ గా ఉంటూ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అయితే సినీ రంగం నుంచి రాజకీయ రంగంలోకి రావాలని కోరిక ఈనాటిది కాదు. ఆయన 2009 లోనే తన అభిమాన సంఘాలన్నీ కలుపుకుంటూ తన అభిమాన సంఘాలను అన్నింటినీ కలిపి అతి పెద్ద కూటమిగా సృష్టించారు ఆయన దాని ద్వారా ఎన్నో సామాజిక కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు విజయ్ నిర్వహిస్తూ వచ్చారు. దాంతో అప్పుడే విజయ్ కి రాజకీయాలు పట్ల ఆసక్తి ఏర్పడింది అని అంతా అనుకున్నారు. ఇక తన ఫ్యాన్ కబ్బులన్నీ ఏకం చేస్తూ విజయ్ మక్కల్ ఇయక్కం వీఎమై ని ఏర్పాటు చేశారు. ఇది మొదట్లో సామాజిక సేవా సంస్థగా ఉన్న 2011 ఎన్నికల్లో అన్న డీఎంకే నేతృత్వంలో కూటమికి తొలిసారి మద్దతు ఇచ్చి తన రాజకీయ ఆకాంక్షను బయట పెట్టుకుంది.
సొంతంగా చేస్తే :
అలా విజయ్ అభిమాన సంఘాల కూటమిని 2020 ప్రాంతాల్లో ఆయన తండ్రి చంద్రశేఖర్ రాజకీయ పార్టీగా రిజిస్టర్ చేయించారు. అయితే దాన్ని విజయ్ తిరస్కరించారు. ఆ విధంగా అభిమాన సంఘాల కూటమి పేరుతో ఏర్పాటైన పార్టీ పక్కకు పోయింది. ఇక ఆయన అభిమాన సంగాలలోని వారిలో కొందరు ఔత్సాహీకులు అంతా కలిసి గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తే మంచి ఫలితాలు వచ్చాయి ఏకంగా 169 స్థానాలకు గాను 115 స్థానాలు వారు గెలిచారు. దాంతో విజయ్ పొలిటికల్ స్టామినా ఏమిటో అందరికీ తెలిసింది. ఈ తర్వాత రాజకీయ ఆకాంక్ష విజయ్ లో మరింతగా పెరిగింది.
అన్నీ కలిస్తేనే :
ఆ తర్వాత 2024 లో ఆయన రాజకీయ పార్టీగా టీవీకేగా స్థాపించారు. అప్పటి నుంచి ఆయన ప్రజల్లో ఉంటూ తన పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కేవలం రెండేళ్ల కాలం విజయ్ పడిన ప్రిశ్రమ, తపన చేసిన ప్రచారం అభిమాన సంఘాల కృషి ప్రజల్లో వచ్చిన మార్పు అన్నీ కలిసి ఈరోజు టీవీకే తమిళనాట ప్రభంజనం సృష్టించేందుకు కారణమయ్యాయి. తమిళనాడులో ఎనాటి నుంచో న్న రెండు ద్రవిడ పార్టీలను పక్కనపెట్టి విజయ్ పార్టీకి ప్రజలు పట్టం కట్టేందుకు ఆస్కారం ఏర్పడింది అంటే దాని వెనకాల విజయ్ చేసిన కృషి ఎంతగానో ఉంది. అలాగే ఆయన చాలా పట్టుదలగా రాజకీయాల్లో విజయం సాధించేందుకు శ్రమించారు.
వెనక్కి వెళ్ళేది లేదంటూ :
తాను రాజకీయాలకు ఒక లక్ష్యం కోసం వచ్చానని వెనక్కి మళ్ళీ వెళ్లే ప్రసక్తి లేదని తొలి ప్రసంగంలోనే ప్రజలకు విజయ్ స్పష్టం చేశారు. తన నిబద్ధత ఏమిటో చాటి చెప్పారు తాను అనుకున్నది చేస్తానని కూడా గట్టిగా చెప్పుకొచ్చారు. ఇక తనకు రాజకీయాలనేది మరొక వృత్తి కాదని ప్రజాసేవ అన్నది తనకు పవిత్రమైనదని ఆయన ప్రజలకు చెప్పి వారి మనసుల్లో స్థానం సంపాదించారు. దాని ఫలితమే ఈరోజు టీవీకే ఘన విజయం ఇక విజయ్ రాజకీయంగా తన ఇన్నింగ్స్ ని అధికారి హోదాలో త్వరలో ప్రారంభించబోతున్నారు అది ఏ తీరుగా ఉంటుందన్నది వేచి చూడాల్సిందే.
