విజయ్ తెలుగు వాడే!...సీఎంలను అందించిన జిల్లా వాసి !
కానీ టీవీకే అధినేత విజయ్ విషయంలో మాత్రం ఆయన కులం గురించి ఎవరికీ తెలియదు. స్కూల్ లో అతన్ని చేర్చినపుడు తండ్రి కులం కాలం లో తమిళ అని మాత్రమే రాసి వదిలేశారు.
By: Satya P | 8 May 2026 12:28 PM ISTతమిళనాడులో అత్యధిక స్థానాలను సాధించి సీఎం కుర్చీకి అతి సమీపంగా ఉన్న టీవీకే అధినేత విజయ్ ఏ ప్రాంతం వాడు ఏ సామాజిక వర్గం వారు ఆయన పుట్టు పూర్వోత్తరాలు ఏమిటి ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏమిటి ఇవన్నీ గత కొద్ది రోజులుగా గూగుల్ ని తెగ సెర్చ్ చేస్తున్నారు నెటిజన్లు. సాధారణంగా ఎవరైనా ఘన విజయాలు సాధిస్తే మన వాళ్ళు చేసే మొదటి పని కులం ఏమిటి అన్నది వెతకడం, అలాగే ఏ ప్రాంతం వారు ఇతర వివరాలు అన్వేషించడం. అంటే మన మెదళ్ళలో ఉన్న ఈ కుల భావన అన్నది ఈ విధంగా చేయిస్తుంది అని అంతా అంటున్నారు. అయినా సరే ఇది చాలా సర్వ సాధారణం అయిపోయింది, అంతే కాదు ఒక మానసిక దౌర్బల్యంగా మారిపోయింది. సరే రాజకీయ నేతలే తమ కులం మతం ప్రాంతం అన్నీ పదే పదే చెప్పుకుంటూ అందులో నుంచి కూడా రాజకీయ ప్రయోజనాలను ఆశిస్తారు. కానీ టీవీకే అధినేత విజయ్ విషయంలో మాత్రం ఆయన కులం గురించి ఎవరికీ తెలియదు. స్కూల్ లో అతన్ని చేర్చినపుడు తండ్రి కులం కాలం లో తమిళ అని మాత్రమే రాసి వదిలేశారు.
సెర్చ్ చేయగా దొరికింది :
అయితే మన నెటిజన్లు అలాగే రాజకీయ ఉత్సాహవంతులు అంతా కలిసి సెర్చ్ చేయగా విజయ్ సామాజిక వర్గం ఆయన తాతల కాలం నుంచి వివరాలు పూర్తిగా దొరికేశాయి. వాటిని ఒక యూట్యూబ్ చానల్ లో రాజకీయ విశ్లేషకురాలు మాట్లాడుతూ విజయ్ తాతగారిది చిత్తూరు జిల్లా తల్లపల్లి ప్రాంతం అని పేర్కొన్నారు. తరువాత విజయ్ తాత రామేశ్వరం వెళ్ళారని అలా తమిళనాడులో ఆ కుటుంబం స్థిరపడిపోయింది అని చెప్పుకొచ్చారు. దాంతో విజయ్ ది చిత్తూరు జిల్లా అని తెలియడంతో పాటు ఆయన మూలాలు తెలుగువే అని కూడా తేలడంతో ఆ జిల్లా వాసులే కాదు తెలుగు వారు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సీఎంలను అందించిన జిల్లా :
ఇక చిత్తూరు జిల్లా అంటే అందరికీ గుర్తుకు వచ్చేది ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆయన ఈ జిల్లా వాసి. నాలుగు సార్లు ఏపీకి సీఎం కావడమే కాదు జాతీయ స్థాయి నాయకుడిగా ఆయన ఈ రోజున కొనసాగుతున్నారు. అలాగే ఉమ్మడి ఏపీకి చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా చిత్తూరు జిల్లాకు చెందిన వారే. ఆయన మూడేళ్ళ పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ముఖ్యమంత్రులే కాదు మంత్రులు కీలక నేతలు కేంద్ర మంత్రులు ఎందరో ఈ జిల్లా నుంచి వచ్చారు ఇక సీఎం ల జాబితా చూస్తే విజయ్ ఈ జిల్లా నుంచి వచ్చిన మూడో వారుగా అంతా పేర్కొంటున్నారు. పైగా ఆయన తెలుగు వారు అన్నది తెలియడంతో అంతా స్వాగతిస్తున్నారు. ఇక ఆయన తల్లిది కూడా తెలుగు ప్రాంతమే అని చెబుతున్నారు.
వెండి తెర పరిచయం :
ఇక ఇవన్నీ పక్కన పెడితే విజయ్ వెండి తెర హీరోగా తెలుగు వారికి చిర పరిచయం. ఆయన తమిళంలో నటించిన అనేక సినిమాలు తెలుగులో డబ్ అయి మంచి హిట్లుగా నమోదు అయ్యాయి. ఆ విధంగా ఆయన తెలుగు వారికి టాలీవుడ్ హీరోలతో పాటుగానే అభిమాన హీరోగా మారారు. ఇక రాజకీయంగా విజయ్ ఈ రోజు సాధించిన సూపర్ సక్సెస్ ని తెలుగు వారు కూడా ఆస్వాదిస్తున్నారు. మొత్తానికి చూస్తే కనుక టీవీకే అధినేతగా కేవలం రెండేళ్ల వ్యవధిలో పార్టీ పెట్టి సీఎం కుర్చీ దాకా రావడం అంటే అది విజయ్ పొలిటికల్ గా క్రియేట్ చేసిన మిరాకిల్ అని అంటున్నారు.
