Begin typing your search above and press return to search.

పొత్తు 'బేరాలు'.. విజ‌య్‌కు పెద్ద చిక్కే!

త‌మిళ‌నాడులో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలకు సంబంధించి తుది లెక్క‌లు వ‌చ్చేశాయి.

By:  Garuda Media   |   5 May 2026 11:46 AM IST
పొత్తు బేరాలు.. విజ‌య్‌కు పెద్ద చిక్కే!
X

త‌మిళ‌నాడులో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలకు సంబంధించి తుది లెక్క‌లు వ‌చ్చేశాయి. దీని ప్ర‌కారం.. యువ న‌టుడు, ద‌ళ‌ప‌తి విజ‌య్ నేతృత్వంలోని పార్టీకి 108 స్థానాలు ద‌క్కాయి. ఆయ‌న అధికారం చేప‌ట్టేందుకు రెడీ అంటూ.. తాజాగా మంగ‌ళ‌వారం గ‌వ‌ర్న‌ర్‌కు లేఖ రాశారు. ``మీరు ఆహ్వానిం చండి.. ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తాం. వారంలోగానే ప్ర‌భుత్వ మ‌ద్ద‌తు నిరూపించుకుంటాం.``అని లేఖ‌లో పేర్కొన్నారు.

ఈ క్ర‌మంలో పొత్తుల కోసం విజ‌య్ ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. ఇక‌, విజ‌య్‌తో చేతులు క‌లిపేందు కు కాంగ్రెస్ పార్టీ స‌హా.. పీఎంకే వంటి పార్టీలు ముందుకు వ‌చ్చాయి. అయితే.. అతి పెద్ద పార్టీగా 108 స్థానాలు ద‌క్కించుకున్న విజ‌య్ ముందు.. ఆయా చిన్న పార్టీలు పెడుతున్న ఆకాంక్ష‌ల జాబితా చూస్తే.. ఆశ్చ‌ర్యం వేస్తుంది. `అవ‌సరం మీది.. అవ‌కాశం మాది`` అన్న‌ట్టుగా కాంగ్రెస్‌, పీఎంకేలు వ్య‌వ‌హ‌రిస్తున్నా యి.

మంత్రివ‌ర్గంలో త‌మ‌కు రెండేసి సీట్లు కావాలంటూ.. కాంగ్రెస్‌, పీఎంకే ప‌ట్టుబ‌ట్ట‌గా.. ఏకంగా ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ‌ను పీఎంకే కోర‌డం గ‌మ‌నార్హం. పోనీ.. వీటికి ఏమ‌న్నా.. రెండంకెల సంఖ్య‌లో సీట్లు వ‌చ్చాయా? అంటే.. అది కూడా లేదు. కాంగ్రెస్ పార్టీకి 5 స్థానాలు ద‌క్కాయి. పైగా ఇది డీఎంకే పొత్తులో ఉంది. అయిన‌ప్ప‌టికీ.. రాష్ట్రంలో అధికారంలోకి వ‌చ్చామ‌ని చెప్పుకొనేందుకు.. ప్ర‌య‌త్నం చేస్తోంది. ఇక‌, పీఎంకేకు 4 సీట్లు మాత్ర‌మే ద‌క్కాయి.

వాస్త‌వానికి 108 స్థానాలు ద‌క్కించుకున్న విజ‌య్ పార్టీలో అనేక మంది సీనియ‌ర్లు ఉన్నారు. ముఖ్యంగా సీఎం స్టాలిన్‌ను ఓడించిన బాబుకు మంత్రి ప‌ద‌వి ఇస్తామ‌ని ఎన్నిక‌ల స‌మ‌యంలోనే ప్ర‌క‌టించారు. ఇక‌, త‌న కారు డ్రైవ‌ర్ కుమారుడిని గెలిపిస్తే.. మంత్రిగా చూస్తారంటూ.. విజ‌య్ చెప్పారు. ఇలా.. త‌న పార్టీలోనే ప‌దుల సంఖ్య‌లో మంత్రులు వేచి చూస్తున్నారు. అయినా.. చిన్న పార్టీలు త‌మ మ‌ద్ద‌తు ఇచ్చేందుకు పెద్ద బేరాలు పెట్ట‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఈ కోరిక‌లు చూస్తే.. విజ‌య్‌కు చిర్రెత్తుకొస్తోంద‌న్ని వాద‌న వినిపిస్తోంది. అలాగ‌ని వ‌దులుకోలేరు.. అదేస‌మ‌యంలో ఇన్ని కోరిక‌లు కూడా తీర్చలేరు. మొత్తం 31 మంది వ‌ర‌కు మంత్రుల‌ను ఏర్పాటు చేసుకునే అవ‌కాశం ఉంది. మ‌రి ఈ పొత్తు బేరాలు ఎప్ప‌టికి తెగుతాయో.. విజ‌య్ ఎప్పుడు దీనిపై క్లారిటీ ఇస్తారో చూడాలి.