విజయ్ తెలుగు స్పీచ్ కి విజయవాడ ఫిదా !
తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ విజయవాడ పర్యటన సక్సెస్ ఫుల్ గా సాగింది.
By: Satya P | 13 Oct 2026 10:24 PM ISTతమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ విజయవాడ పర్యటన సక్సెస్ ఫుల్ గా సాగింది. ఆయన అధికార పర్యటన అంతా ఆద్యంతం ఆసక్తిని రేపింది. ఉత్సాహభరితంగా కూడా సాగింది. విజయ్ కి అడుగడుగునా టీడీపీ నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే సాదరంగా రిసీవ్ చేసుకున్నారు. ఏపీ తమిళనాడు ముఖ్యమంత్రుల మధ్య పూర్తిగా సానుకూల వాతావరణంలో చర్చలు సాగాయి. తమిళనాడు ఏపీ పరస్పరం సహకరించుంటాయని చంద్రబాబు చెప్పడం కూడా జరిగింది.
అందరికీ నమస్కారం :
విజయ్ అయితే విజయవాడ ఉత్సవ్ లో తెలుగులో మాట్లాడి అందరినీ అలరించారు. అందరికీ నమస్కారం అంటూ విజయ్ తన స్పీచ్ ప్రారంభించడంతో జనాలు అంతా ఉత్సాహంగా ప్రతిస్పందించారు. తాను నవరాత్రి ఉత్సవాలలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని విజయ్ చెప్పారు. అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడ వాసుల ఆతీధ్యానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇక తనను విజయవాడకు ఆహ్వానించిన ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను అని అలాగే ప్రజల అభిమానాన్ని గుండెల్లో పెట్టుకుంటాను అని విజయ్ చెబుతూంటే సభ అంతా హోరెత్తింది. తాను నదుల అనుసంధానం గురించి ఏపీ సీఎం చంద్రబాబుతో చర్చించేందుకు వచ్చాను అని విజయ్ తెలిపారు.
ఫుల్ ఆఫ్ అట్రాక్షన్ :
విజయ్ విజయవాడ ఉత్సవ్ లో ఫుల్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యారు. వేదిక మీద ఆయన ప్రసంగించినది కేవలం ఒక నిముషం ముప్పయి సెకన్లు మాత్రమే. అయితే ఆయన తెలుగులో మాట్లాడి ఆకట్టుకున్నారు. అంతే కాదు ఆయన హుందాగా చేసిన ఈ స్పీచ్ ని కూడా అంతా ఆస్వాదించారు. చంద్రబాబు పట్ల గౌరవంతో కూడిన అభిమానం ఆయన చూపించారు. అలాగే స్థానిక ప్రజల పేమకు కూడా ఆయన ముగ్దులు అయ్యారు. విజయ్ సీఎం అయ్యాక పక్క రాష్ట్రం వెళ్ళి ఒక సభలో పాల్గొనడం అయితే జరిగింది లేదు. కానీ ఏపీలో ఆయనకు దక్కిన ఈ ఘన స్వాగతం మాత్రం ఆయనతో పాటు టీవీక వర్గాలకు కూడా ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంది. అందుకు గానూ చంద్రబాబుని కూడా అభినందించాలి.
పరస్పర సహకారం :
చంద్రబాబు ఎన్డీయే కూటమిలో ఉన్నారు. తమిళనాడు ఎన్నికల్లో ఆయన ఎన్ డీయే తరఫున ప్రచారం చేశారు. అయితే అదంతా రాజకీయం. ఇపుడు అధికారిక హోదాలో విజయ్ ని ఆహ్వానించి రెండు రాష్ట్రాల అభివృద్ధి పట్ల ఒక సీనియర్ సీఎం గా బాబు తీసుకున్న చొరవను కూడా అంతా అభినందిస్తున్నారు. అలాగే చంద్రబాబు అందరి నాయకులతో పార్టీలకు రాజకీయాలకు అతీతంగా కలిసిపోయే తీరు కూడా అందరి మన్ననలు అందుకుంటోంది. ఏది ఏమైనా తమిళనాడు ఏపీ రెండు రాష్ట్రాలు అభివృద్ధి సాధిచాలని అంతా కోరుకుంటున్నారు.
