Begin typing your search above and press return to search.

విజయ్ రెండో సీటు...త్రిషకు చాన్స్ ?

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ తన ప్రభుత్వం అయిదేళ్ల పాటు ఉంటుందని చెప్పకనే చెప్పేశారు.

By:  Satya P   |   10 May 2026 9:00 PM IST
విజయ్ రెండో సీటు...త్రిషకు చాన్స్ ?
X

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ తన ప్రభుత్వం అయిదేళ్ల పాటు ఉంటుందని చెప్పకనే చెప్పేశారు. రాజకీయ సుస్థిరత విషయంలో ఎలాంటి ఢోకా ఉండదని కూటా సీఎం గా తొలి స్పీచ్ లోనే ఆయన క్లారిటీ ఇచ్చేశారు. అంతే కాదు వన్ అండ్ ఓన్లీ పవర్ సెంటర్ ఉంటుందని అది తానే అని కూడా క్లియర్ కట్ మేసేజ్ పార్టీ వర్గాలకు ప్రజలకు ప్రతిపక్షాలకూ పంపించారు. ఇక విజయ్ ప్రమాణ స్వీకార ఘట్టంలో సినీ నటి త్రిష ప్రత్యేక ఆకర్షణగా మారిన సంగతి తెలిసిందే. దాని కంటే ముందు మే 4న ఎన్నికల ఫలితాలు వస్తున్న సమయంలో టీవీకేకి అనుకూలంగా మొత్తం ట్రెండ్స్ అన్ని ఉన్న వేళ విజయ్ నివాసానికి త్రిష వచ్చి వెళ్ళడం కూడా మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారానికి నోచుకుంది.

నంబర్ టూ అంటూ :

ఈ నేపథ్యంలో విజయ్ ప్రభుత్వంలో ఆమె చేరి నంబర్ టూ అవుతారు అని వార్తలు కూడా భారీ ఎత్తున వ్యాపించాయి. విజయ్ పోటీ చేసిన రెండు సీట్లలో ఒక దానిని వదులుకోవాల్సి ఉంటుంది. దానికి జరిగే ఉప ఎన్నికల్లో త్రిష పోటీ చేస్తారు ఆమె కీలక మంత్రిత్వ శాఖలను చేపడతారు అని కూడా ప్రచారం సాగుతూ వచ్చింది. అయితే ఈ తరహా ప్రచారాలకు ఆదిలోనే చెక్ పెట్టే ప్రయత్నాన్ని విజయ్ చేశారు అని అంటున్నారు. ఒక్కటే పవర్ సెంటర్ అని ఆయన చెప్పడం ద్వారా తానే అంతా అన్నట్లుగా సంకేతాలు బలంగా పంపించారు. అదే సమయంలో విజయ్ వదిలేసే రెండవ సీటులో పార్టీలో పనిచేసే సామాన్యులకు స్థానికులకే సీటు కేటాయిస్తారు అని అంటున్నారు.

విపక్షాలకు నో చాన్స్ :

రాజకీయాల్లో విమర్శలు సూది మొన అంత ప్లేస్ ఉన్నా దూరిపోయి వాడుకుని మరీ చేస్తారు. ఇక ఎన్నికల వేళ త్రిష విజయ్ ల గురించి కూడా ప్రచారం చేసి ప్రత్యర్ధులు లబ్ది పొందాలని చూశారని అంటారు. ఇపుడు ప్రభుత్వంలో టీవీకే ఉంది. విజయ్ అయితే తాను సీఎం గా కాకుండా కామన్ మ్యాన్ గా పాలన చేస్తాను అని చెబుతున్నారు. తన మార్క్ ని ఆయన చూపించుకునే ప్రయత్నం చేయబోతున్నారు. అంతే కాదు ఇప్పటి నుంచి మరో మూడు దశాబ్దాల పాటు రాజకీయంగా తన స్థానం సుస్థిరం చేసుకుని లాంగ్ టెర్మ్ ఇన్నింగ్స్ ని కొనసాగించాలని ఆయన ఆరాటపడుతున్నారు.

విజయ్ పక్కా క్లారిటీతోనే :

రాజకీయంగా చూస్తే 52 ఏళ్ల విజయ్ యంగ్ లీడర్ కిందలే లెక్క. తమిళనాడులో సరైన ఆల్టర్నేషన్ లేకపోవడం కూడా విజయ్ కి కలిసి వచ్చే అంశంగా ఉంది. అందుకే ఆయన తన పార్టీ వైపు నుంచి కానీ ప్రభుత్వం వైపు నుంచి కానీ ఎలాంటి పొరపాట్లు చేయకూడదని గట్టిగా భావిస్తున్నారు. అందుకే త్రిష విషయంలో ఆమెకు రాజకీయ అవకాశాలు కానీ ప్రభుత్వంలో పదవులు కానీ ఉండవని అంటున్నారు. మొత్తం మీద చూస్తే విజయ్ ఒక పద్ధతి ప్రకారం రాజకీయం చేసుకుంటూ వెళ్తున్నారు అని అర్థం అవుతోంది. సో విజయ్ పక్కా క్లారిటీతోనే ముందుకు సాగుతున్నారని అంటున్నారు. చూడాలి మరి ముందు ముందు ఏమి జరుగుతుందో.