Begin typing your search above and press return to search.

విజయ్ కాన్వాయ్ రద్దు...డీఎంకే అన్నా డీఎంకే జట్టు ?

తమిళనాడులో ఏమి జరుగుతోంది అన్న చర్చ అయితే అంతటా ఉంది. ఎందుకంటే అక్కడ హంగ్ ఏర్పడింది.

By:  Satya P   |   7 May 2026 9:04 AM IST
విజయ్ కాన్వాయ్ రద్దు...డీఎంకే అన్నా డీఎంకే జట్టు ?
X

తమిళనాడులో ఏమి జరుగుతోంది అన్న చర్చ అయితే అంతటా ఉంది. ఎందుకంటే అక్కడ హంగ్ ఏర్పడింది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ప్రజలు ఇవ్వలేదు. ప్రజా స్వామ్యంలో ఇలా జరిగితే ఎవరి రాజకీయ ఆట వారు ప్రారంభినవచ్చు. ఇందులో తప్పు అయితే లేదు. ఇంకా చెప్పాలీ అంటే విజయ్ పార్టీకి కావాల్సిన ఎమ్మెల్యేలు కూటముల నుంచే తీసుకోవాలి. దాంతో డీఎంకే అన్నా డీఎంకే రెండూ శిబిరాలు ఇపుడు జాగ్రత్త పడుతున్నాయి. ఇంకో వైపు ఫలితాలు ఒక వైపు వెలువడుతుండగా విజయ్ కి కల్పీంచిన అధికారిక కాన్వాయ్ అంటే సీఎం హోదాలో ఇస్తున్న ప్రోటోకాల్ ని రద్దు చేసినట్లుగా చెబుతున్నారు. దీనిని బట్టి చూస్తే అసలు తమిళ సీమలో ఏమి జరుగుతోంది అన్న చర్చ అయితే వస్తోంది.

సాధారణ సెక్యూరిటీ :

నిజానికి చూస్తే తమిళనాడులో ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగానే చెన్నైలోని టీవీకే అధినేత విజయ్ నివాసం వద్దకు పోలేసులు భారీ ఎత్తున చేరుకుని భారీ బోందోబస్తు ఏర్పాటు చేశారు ఆ తరువాత చూస్తే కాబోయే సీఎం హోదాలో ఆయనకు అధికారిక కాన్వాయ్ ని ఏర్పాటు చేశారు. గత రెండు రోజులుగా ఆయన దానితోనే పర్యటనలు చేస్తున్నారు. ఒక విధంగా సీఎం గా రాజ ముద్ర పడిపోయింది అని అంతా అనుకుంటున్న నేపధ్యంలో గవర్నర్ ఆయనకు ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి ఇవ్వలేదు. దానికి కారణం మెజారిటీ లేదని చెప్పడం. దాంతో విజయ్ పార్టీ డీలా పడిపోయింది. ఇంకో వైపు చూస్తే ఆయన కాన్వాయ్ ని రద్దు చేస్తున్నట్లుగా కూడా ప్రచారం సాగడం సంచలనం రేకెత్తిస్తోంది. అది తక్షణం అమలులోకి వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. అందుకే నిన్నటి దాకా కనిపించిన విజయ్ కాన్వాయ్ బుధవారం మాత్రం కనిపించలేదు దాంతో విజయ్ తన ఫాం హౌస్ కి సాధారణ వై కేటగిరీ సెక్యూరిటీలోనే విజయ్ వెళ్లడం జరిగింది అని అంటున్నారు. దాంతో విజయ్ కి కాన్వాయ్ ఎందుకు రద్దు చేశారు అన్న చర్చ మొదలైంది. సీఎం గా ఆయన ప్రమాణం ఆగిపోవడం ఇపుడు కాన్వాయ్ వెనక్కి వెళ్ళడంతో విజయ్ విషయంలో ఏమి జరుగుతోంది అన్నది ఒక పెద్ద ప్రశ్నగా ఉంది.

డీఎంకే ఏఐడీఎంకే పిలుపు :

తమిళనాడులో రాజకీయాలు చూస్తే చక చకా మారిపోతున్నాయని అంటున్నారు. అతి పెద్ద పార్టీగా టీవీకే ఉన్నా మెజారిటీ విషయంలో ఇంకా ఎటూ తేలకపోవడంతో రెండు ద్రవిడ పార్టీలకు కొత్త రాజకీయ ఊపిరి వచ్చిందా అని బిగ్ డిస్కషన్ సాగుతోంది. బుధవారం చూస్తే రోజంతా ఒక్కటే చర్చ సాగుతోంది. అదే డీఎంకే అన్నా డీఎంకే కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయని. ఈ రెండు పార్టీలకు ఉన్న బలం కలిపిస్తే సింపుల్ మెజారిటీ గా అంటే 121 గా ఉంటుంది. దాంతో రెండు కలిసిపోతాయా అన్నదే చర్చగా ఉంది. ఈ నేపధ్యంలో ఈ రెండు పార్టీల అధినేతలూ తమ ఎమ్మెల్యేలను నేరుగా చెన్నై చేరుకోవాలని కోరడం విశేషం. రానున్న రెండు మూడు రోజుల పాటు చెన్నై లోనే వారనా ఉండాలని కూడా సూచించడం కూడా చర్చకు తావిస్తోంది. అంటే ఒకవేళ విజయ్ కి అవకాశం గవర్నర్ ఇవ్వకపోతే ఈ రెండు పార్టీల నేతలు కలసి సంకీర్ణం ఏర్పాటు చేస్తామని తమ సంఖ్యా బలాన్ని చూపించి గవర్నర్ నుంచి ఆహ్వానం అందుకుంటారా అన్న ప్రశ్నలు కూడా విన వస్తున్నాయి. మొత్తం మీద చూస్తే తమిళనాడులో ఏదో జరగబోతోంది అన్నది అయితే అంతా ఆలోచిస్తున్నారు. రానున్న రెండు మూడు రోజులు అత్యంత కీలకంగా కూడా భావిస్తున్నారు అని అంటున్నారు. టీవీకే విజయ్ కి వ్యతిరేకంగా స్టాలిన్ పళని స్వామి చేతులు కలిపితే మొత్తం తమిళనాడు రాజకీయ ముఖ చిత్రం మారిపోవచ్చు అని అంటున్నారు. సో టెన్షన్ పెంచేలా అక్కడ రాజకీయం సాగుతోంది.