Begin typing your search above and press return to search.

ఓదార్పు యాత్రకు విజయ్ రెడీ

ఓదార్పు కన్న చల్లనిది ఏదీ లేదు, ఎంతటి వేడిని అయినా ఒక్క ఓదార్పు చల్లబరుస్తుంది. నేను ఉన్నాను అన్న భరోసాను ఇస్తుంది.

By:  Satya P   |   11 Oct 2025 10:03 PM IST
ఓదార్పు యాత్రకు విజయ్ రెడీ
X

ఓదార్పు కన్న చల్లనిది ఏదీ లేదు, ఎంతటి వేడిని అయినా ఒక్క ఓదార్పు చల్లబరుస్తుంది. నేను ఉన్నాను అన్న భరోసాను ఇస్తుంది. ఎన్నో కోల్పోయిన వారికి కూడా ఒక మంచి పలకరింపు ఎంతో అండను ఇచ్చినట్లు అవుతుంది. ఈ విషయం ఏపీ వాసులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికి పుష్కర కాలం క్రితం వైఎస్ జగన్ తన తండ్రి వైఎస్సార్ మరణం తరువాత గుండెలు ఆగి చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించారు. దానికి ఓదార్పు యాత్ర అని పేరు పెట్టారు. అప్పటి దాకా అలాంటి యాత్ర ఒక్కటి ఉంటుందని ఎవరికీ తెలియదు. కానీ అది సూపర్ సక్సెస్ కావడమే కాదు రాజకీయంగా వైసీపీకి ఊపిరి పోసింది.

విజయ్ సైతం సిద్ధం :

కట్ చేస్తే తమిళనాడు సూపర్ స్టార్ టీవీకే పార్టీ అధినేత విజయ్ ఎట్టకేలకు తన ఇంటి గుమ్మం దిగి బయటకు వస్తున్నారు. ఆయన గత నెల 27న కరూర్ లో నిర్వహించిన ఒక భారీ సభ కాస్తా విషాద యోగాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. ఈ సభకు వచ్చిన జనాలలో ఏకంగా 41 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు దేశంలో ఇప్పటిదాకా జరిగిన రాజకీయ సభలలో ఇంత పెద్ద ఎత్తున ప్రజలు తమ ప్రాణాలను బలి ఇచ్చిన సందర్భం అయితే ఎక్కడా లేదు. కానీ కరూర్ మాత్రం రాజకీయ విషాదంలో సరికొత్త అధ్యాయం గా నిలిచింది.

లేట్ గా అయినా :

నాటి నుంచి ఇంటికే పరిమితం అయిన విజయ్ కాస్తా ఆలస్యం గా అయినా కరూర్ ఘటన బాధితులను పరామర్శించడానికి బయల్దేరడం ఒక విధంగా మంచి పరిణామం. ఇక్కడ తప్పు ఎవరిది అన్నది ప్రశ్న కాదు, విషయం పెద్దది, అంతే కాదు ఆ సభకు వచ్చిన వారు విజయ్ కోసమే అన్నది కూడా వాస్తవం, నిర్వహణ లోపాలలో ఎవరిది ఎక్కువ వాటా ప్రభుత్వానిదా లేక టీవీకే వారి అత్యుత్సాహమా అన్నది ఎడ తెగని చర్చ. అందువల్ల ఆ విషయాలను పక్కన పెడితే తన కోసం వచ్చి మృత్యు వాత పడిన వారు తమ ఇంటికి తమ వారికీ కడుపు కోత మిగిల్చి కన్నీటిలో ముంచిన వారిని కనీసంగా అయినా పరామర్శించాలి. అయితే ఇంతదాకా టీవీకే పార్టీ పెద్దలు చెప్పేది ఏంటి అంటే తమ నాయకుడు బయటకు వస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుందని బందోబస్తు సజావుగా చేయకపోతే మాత్రం అది మరో ప్రమాదానికి దారి తీసినా తీయవచ్చు అన్నది.

నాయకుడు అదే చేయాలి :

అయితే ఎంతకాలం ఈ మీమాంసలో ఉండి బాధితులను పరామర్శించారు అన్నది కూడా ఉంది దాంతోనే విజయ్ ఇపుడు ఒక ముహూర్తాన్ని ఎంచుకుని మరీ జనంలోకి వస్తున్నారు. ఆయన ఈ నెల 17న కరూర్ లోనే ఒక కార్యక్రమం నిరహిస్తారు. దాని కోసం పార్టీ ఒక వేదికను తయారు చేస్తుంది. ఆ వేదిక వద్దకు మొత్తం కరూర్ ఘటనలో మరణించిన వారి కుటుంబాలు అలాగే గాయపడిన వారు ఇతరత్రా దెబ్బ తిన్న వారు అందరికీ ఒకే చోటకు చేరుస్తారు. వారిని విజయ్ పరామర్శిస్తారు. అంతే కాదు పార్టీ తరఫున ప్రకటించిన భారీ నష్ట పరిహారాన్ని కూడా ఆయన వారికి అందిస్తారు ఈ మొత్తం కార్యక్రమం అంత పూర్తి స్థాయి భద్రత మధ్యనే నిర్వహిస్తున్నారు కేవలం బాధిత కుటుంబాలకు మాత్రమే ఈ సమావేశంలో ప్రవేశం ఉంటుంది. మొత్తం మీద విజయ్ ఈ సందర్భంగా ఏమి మాట్లాడుతారు అన్నది కూడా ఆసక్తిని రేపుతోంది.