Begin typing your search above and press return to search.

విడాకుల ప్రస్తావన విజయ్ ను దెబ్బకొట్టడానికేనా?

ఈ పోస్ట్ చూసిన వారికి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో విజయ్ పార్టీకి పెరుగుతున్న ఆదరణను చూసి ప్రత్యర్థులు భయపడుతున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

By:  Madhu Reddy   |   28 Feb 2026 4:00 PM IST
విడాకుల ప్రస్తావన విజయ్ ను దెబ్బకొట్టడానికేనా?
X

తమిళ సూపర్ స్టార్, టీవీకే అధినేత విజయ్ వ్యక్తిగత జీవితం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఆయన భార్య సంగీతతో విభేదాలు, విడాకుల వార్తలు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారమవుతున్నాయి. ముఖ్యంగా తమిళనాడు ఎన్నికల వేళ ఈ అంశం తెరపైకి రావడం వెనుక రాజకీయ కుట్ర ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూడు నెలల క్రితం ఒక రెడిట్ యూజర్ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతూ, విజయ్ రాజకీయ ఎదుగుదలను అడ్డుకునేందుకే ఇదంతా జరుగుతోందా? అనే చర్చకు దారి తీస్తోంది.

విజయ్ రాజకీయ ప్రస్థానం:

రెడిట్ యూజర్ చేసిన పోస్ట్ లో విజయ్ తన కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారని, తనను ఇంతవాడిని చేసిన ప్రజల కోసం ఏదైనా చేయాలనేది ఆయన ఆశయం. అయితే, విజయ్ రాజకీయ నిర్ణయాలను ఆయన భార్య సంగీత వ్యతిరేకిస్తున్నారనే వార్తలు ఇప్పుడు బయటకు వచ్చాయి. ఆయన భార్యకి అధికార పార్టీ కుటుంబాలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, విజయ్ రాజకీయాల్లోకి రావడం ఆమెకు ఏమాత్రం ఇష్టం లేదని ఆ రెడిట్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేయాలనే పట్టుదలతో ఉన్న విజయ్‌ను, రాజకీయాల నుంచి తప్పుకోవాలని ఆమె ఒత్తిడి చేస్తున్నారనే విషయం ఇప్పుడు కోలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

కుట్ర జరుగుతోందా?:

ఈ పోస్ట్ చూసిన వారికి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో విజయ్ పార్టీకి పెరుగుతున్న ఆదరణను చూసి ప్రత్యర్థులు భయపడుతున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విజయ్‌ను రాజకీయంగా నేరుగా ఎదుర్కోలేక, ఆయనను మానసికంగా, వ్యక్తిగతంగా దెబ్బకొట్టేందుకు 'విడాకుల' అంశాన్ని వాడుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇక ఓ రాజకీయ కుటుంబం సంగీతను పావుగా వాడుకుంటూ విజయ్ పొలిటికల్ కెరీర్‌ను ముగించాలని చూస్తోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. విజయ్ తన కో యాక్టర్ ను వివాదాల్లోకి లాగి, ఆయన ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం జరుగుతోందని ఆ రెడిట్ పోస్ట్ సారాంశం.

ప్రజల మద్దతు విజయ్ కు :

విజయ్ హీరోలా కాకుండా ఒక సాధారణ వ్యక్తిగా ఉంటూనే ప్రజల కోసం పోరాడాలని భావిస్తున్నారు. యువత, మహిళలు ఆయన వెంటే ఉన్నారని సర్వేలు చెబుతున్నాయి. అందుకే, ఆయనను ఆపడానికి ప్రత్యర్థులు తమ చివరి అస్త్రంగా ఈ కుటుంబ వివాదాలను వాడుకుంటున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎంతటి వ్యక్తిగత ఒత్తిడి ఎదురైనా, నిజమైన సేవా భావం ఉన్న రాజకీయ నాయకులు ఎప్పటికి వెనకడుగు వేయకూడదని విజయ్ అభిమానులు కోరుకుంటున్నారు. ఈ రాజకీయ చదరంగంలో విజయ్ తన వ్యక్తిగత సమస్యలను అధిగమించి, ప్రజల కోసం ఎలా నిలబడతారో వేచి చూడాలి అంటున్నారు అభిమానులు.