Begin typing your search above and press return to search.

కాబోయే సీఎం : దళపతి విజయ్ షాకింగ్ కామెంట్స్ !

తమిళనాడులో భారీ పోలింగ్ జరిగింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆ పోలింగ్ ఉంది. ఏకంగా 85 శాతం పైగా జరిగింది. పైగా మహిళలు యువత మధ్యతరగతి వర్గాలు పోలింగ్ బూత్ లకు తరలివచ్చి మరీ ఓటెత్తారు.

By:  Satya P   |   25 April 2026 11:41 PM IST
కాబోయే సీఎం : దళపతి విజయ్ షాకింగ్ కామెంట్స్ !
X

తమిళనాడులో భారీ పోలింగ్ జరిగింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆ పోలింగ్ ఉంది. ఏకంగా 85 శాతం పైగా జరిగింది. పైగా మహిళలు యువత మధ్యతరగతి వర్గాలు పోలింగ్ బూత్ లకు తరలివచ్చి మరీ ఓటెత్తారు. మరి ఈ ఓటు ఎవరికి పడుతోంది, ఎవరిని రాజు చేస్తుంది, ఎవరిని తరాజు చేస్తుంది అన్నది మే 4న తేలాల్సి ఉంది. అయితే అధికార పార్టీ గుండెలలో ఇలాంటి భారీ పోలింగ్ గుబులు రేపుతోంది. అదే సమయంలో విపక్షాలు మాత్రం ఆ ఓట్లు అన్నీ మావే అంటున్నారు. యాంటీ ఇంకెంబెన్సీ గట్టిగా పనిచేసింది అని కూడా చెబుతున్నాయి. బీజేపీ అయితే కాబోయే సీఎం పళనిస్వామి అని డిక్లేర్ చేసేసింది. అంటే ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని స్పష్టంగా చెప్పేసింది అన్న మాట.

టీవీకే విశ్లేషణ :

కొత్తగా తమిళనాడులో రాజకీయ రంగ ప్రవేశం చేసిన టీవీకే పార్టీ ఈ అధిక పోలింగ్ మీద తనదైన శైలిలో విశ్లేషించింది. అధినేత అయిన దళపతి విజయ్ అయితే ఈ భారీ పోలింగ్ అంతా తమకు అనుకూలం అన్నట్లుగా వ్యాఖ్యానించారు. అనుభవం ఉన్న వారికే రాజకీయం కాదని కూడా ఆయన అన్నారు. ప్రజలు నిర్ణేతలు అంటూ వారే పెద్ద ఎత్తున తరలి వచ్చి ఓట్లు వేశారు అన్నారు. ముఖ్యంగా మహిళలు యువత పోటెత్తడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలిపారు. ఎంతో దూరం నుంచి బస్సులు రైళ్ళు ఏది వీలుంటే అది పట్టుకుని ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చి పోలింగ్ బూత్ లకు వచ్చి ఓట్లు వేసిన అందరికీ ధన్యవాదాలు అని కూడా ఆయన చెప్పారు.

ఈ వ్యాఖ్యల వెనక :

విజయ్ అనుభవం గురించి మాట్లాడారు, అది ఉంటేనే అధికారం కాదని కూడా అంటున్నారు. ప్రజలు తీర్పు గురించి కూడా చెబుతున్నారు దీనిని బట్టి ఈ భారీ ఓటింగ్ తమకు అనుకూలంగా ఉందని టీవీకే నిర్ణయించుకుందా అన్న చర్చ సాగుతోంది. పైగా మహిళలు యువత అని ఆయా వర్గాలు భారీ వచ్చి ఓట్లు వేయడాన్ని విజయ్ ప్రస్తావించారు. దాంతో ఈ వర్గాల ఓట్లు అన్నీ గంపగుత్తగా తమ ఖాతాలో పడ్డాయని విజయ్ భావిస్తున్నారా అన్న చర్చ సాగుతోంది.

ధీమా పెరిగిందా :

తమిళనాడులో జరిగిన పోలింగ్ తరువాత రకరకాలైన విశ్లేషణలు వినవస్తున్నాయి. ఎన్నడూ లేని విధంగా పోలింగ్ జరిగింది. అలాగే గతంలో లేని విధంగా కొత్త పార్టీ ఒక చరిష్మాటిక్ లీడర్ విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఈ భారీ పోలింగ్ ఆయన కోసమే అన్నట్లుగా అన్వయించుకోవడానికి ఇదొక కారణంగా ఉంది. ఆ పైన చూస్తే మహిళలు యువత పెద్ద ఎత్తున ఓటు చేశారు అంటున్నారు. వీరి ఓట్లు ఎపుడూ కొత్త దనం వైపు మార్పు వైపు ఉంటాయని అంటారు. మరి ఆ విధంగా చూసినా విజయ్ పార్టీలో ధీమా పెరగడానికి మరో రీజన్ అంటున్నారు.

త్రిముఖ పోటీలో ఓటు షేర్ :

అలాగే మధ్యతరగతి వర్గాలు పెద్దగా పోలింగ్ బూత్ లకు రారు. కానీ ఇక్కడ భిన్నగా వచ్చారు అంటే వారిలో ఏదో ఆశ ఉంది. ఆ ఆశా కిరణమే కొత్త పార్టీ టీవీక అని అంటున్నారు. అలాగే దళితులు అణగారిన వర్గాల ఓటింగ్ కూడా బాగా జరిగిందని అది విజయ్ పార్టీకే టర్న్ అయిందని కూడా విశ్లేషణలు ఉన్నాయి ఇవన్నీ చూసుకునే విజయ్ పార్టీలో గెలుపు ధైర్యం వచ్చేసింది అని అంటున్నారు. ఎన్నికల ముందు సర్వేలు అన్నీ డబుల్ డిజిట్ ఓటు షేర్ ని విజయ్ పార్టీ సాధిస్తుందని చెప్పాయి. ఇపుడు ఆ నంబర్ కనుక త్రిముఖ పోటీలో ఏ ఇరవై శాతానికి పైగానో ఎగబాకినా సీట్ల నంబర్ గణనీయంగా టీవీకేకు దక్కుతుందని ఒక అంచనా వేస్తున్నారు. ఇవన్నీ విశ్లేషించుకున్న మీదటనే విజయ్ తమ పార్టీ గెలుస్తుందని గట్టిగా బల్లగుద్దుతూ ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.