Begin typing your search above and press return to search.

అన్నా, ఎంజీఆర్, ఎన్టీఆర్.. 2026లో విజయ్.. తమిళనాడు అసెంబ్లీ దద్దరిల్లిపోయింది..

తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత.. దళపతి విజయ్ రాబోయే 2026 అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని వేస్తున్న రాజకీయ అడుగులు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.

By:  A.N.Kumar   |   7 Sept 2026 2:18 PM IST
అన్నా, ఎంజీఆర్, ఎన్టీఆర్.. 2026లో విజయ్..  తమిళనాడు అసెంబ్లీ దద్దరిల్లిపోయింది..
X

తమిళనాడు రాజకీయ వేదికపై సంచలన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత.. దళపతి విజయ్ రాబోయే 2026 అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని వేస్తున్న రాజకీయ అడుగులు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. దశాబ్దాల రాజకీయ చరిత్రను తిరగరాసిన దిగ్గజ నేతల సరసన తన పేరును చేరుస్తూ విజయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలోనూ.. ప్రధాన రాజకీయ వేదికలపైనా హాట్ టాపిక్‌గా మారాయి. దక్షిణ భారత రాజకీయాల్లో సినీ గ్లామర్ తెచ్చిన మార్పులను.. చారిత్రాత్మక ఘట్టాలను రీకాల్ చేస్తూ ఆయన ప్రస్తావించిన అంశాలు కొత్త చర్చకు తెరలేపాయి.

దక్షిణాది రాజకీయ చరిత్రలో 1967వ సంవత్సరం ఒక కీలకమైన మలుపు. ద్రావిడ భావజాలంతో సి.ఎన్. అన్నాదురై (అన్నా) కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యానికి తెరదించి సరికొత్త శకానికి నాంది పలికారు. ఆ తర్వాత 1977లో సినీ రంగంలో తిరుగులేని కథానాయకుడిగా వెలిగిన ఎం.జి. రామచంద్రన్ (ఎంజీఆర్) అన్నాడీఎంకేను స్థాపించి, తన అపారమైన ప్రజాదరణతో అధికారాన్ని చేపట్టి పదికాలాల పాటు తమిళనాడును పాలించారు. సరిగ్గా ఇదే తరహాలో 1982లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం తొమ్మిది నెలల్లోనే అధికారాన్ని చేజిక్కించుకుని ప్రాంతీయ ఆత్మగౌరవ నినాదంతో సంచలనం సృష్టించారు.

ఈ చారిత్రక ఘట్టాల వరుసలో 2026 నాటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తన 'తమిళగ వెట్రి కళగం' ద్వారా అలాంటి ఒక రాజకీయ ప్రభంజనాన్ని తీసుకు వచ్చినట్టు తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ రంగంలో అగ్ర నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న విజయ్, ప్రత్యక్ష రాజకీయంలోకి అడుగుపెట్టి పార్టీని బలోపేతం చేసే ఏకంగా ప్రజాదరణతో సీఎం అయినట్టుగా తనను తాను దిగ్గజాలతో పోల్చుకున్నారు. అన్నాదురై, ఎంజీఆర్, ఎన్టీఆర్ వంటి యుగపురుషులతో తన రాజకీయ ప్రస్థానాన్ని పోల్చుకోవడం ఆయనలోని అపారమైన ఆత్మవిశ్వాసానికి, స్పష్టమైన వ్యూహానికి నిదర్శనమని అభిమానులు.. పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ప్రస్తుత రాజకీయ సమీకరణాలు నాటి రోజులతో పోలిస్తే పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. బలమైన కేడర్, దశాబ్దాల చరిత్ర ఉన్న డీఎంకే, అన్నాడీఎంకే వంటి ప్రధాన ద్రావిడ పార్టీలతో పాటు జాతీయ పార్టీల ఉనికిని తట్టుకుని.. విజయ్ ఆ స్థాయిలో ప్రజల ఆదరణ పొందడం అనేది రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది. నాటి ఎంజీఆర్, ఎన్టీఆర్ స్థాయి రాజకీయ విప్లవాన్ని విజయ్ పునరావృతం చేయడం విశేషంగా మారింది.

ఏది ఏమైనప్పటికీ విజయ్ చేసిన ఈ ప్రకటనతో తమిళనాడు అసెంబ్లీ దద్దరిల్లిపోయింది. టీవీకే ఎమ్మెల్యేలంతా హర్షధ్వానాలతో సభను హోరెత్తించారు. ఈ వీడియో వైరల్ గా మారింది.