Begin typing your search above and press return to search.

బొకేతో పాటు .. భోజనం కూడా ..!

దక్షిణాది జోనల్ కౌన్సిల్ 31వ సమావేశం కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా కోవలంలోని ఒక ప్రముఖ హోటల్ కు విచ్చేశారు.

By:  Garuda Media   |   20 Aug 2026 6:07 PM IST
బొకేతో పాటు .. భోజనం కూడా ..!
X

దక్షిణాది జోనల్ కౌన్సిల్ 31వ సమావేశం కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా కోవలంలోని ఒక ప్రముఖ హోటల్ కు విచ్చేశారు. ఈ నేపథ్యంలో ఈ సమావేశానికి హాజరైన తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోసం బొకేతో పాటు ఇంటి నుండి భోజనం కూడా తీసుకురావడం విశేషం. దీంతో ఈ వీడియో సన్నివేశాలు బాగా వైరల్ అయి అందరినీ ఆకర్షిస్తున్నాయి.

ఈ సంధర్భంగా అమిత్ షా, సీఎం విజయ్ ల మధ్య దాదాపు 40 నిమిషాల పాటు చర్చలు జరిగాయి. పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన, కావేరీ జలాల పంపిణీ, అంతర్ రాష్ట్ర జలవివాదాలు, ముల్ల పెరియార్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు, మౌళిక సదుపాయాల కల్పన తదితర అంశాలను విజయ్ ప్రధానంగా ప్రస్తావించినట్లు తెలుస్తుంది.

దక్షిణాది రాష్ట్రాల నుండి ఈ సమావేశానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కర్ణాటక ముఖ్యమంత్రి డీకె శివకుమార్, కేరళ ముఖ్యమంత్రి వీడి సతీషన్ లు హాజరయ్యారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు.

ముఖ్యంగా ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల సీఎంలు అంతర్ రాష్ట్ర జలవివాదాలు, అంతర్గత భద్రత, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ఎన్ఐఎ దాడులు, విద్య, సివిల్ ఏవిఏషన్, ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టుల ఏర్పాటు వంటి అంశాలపై కేంద్రం త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలుస్తున్నది. మొత్తంగా ఈ సమావేశాలలో విజయ్ అమిత్ షా కోసం ఇంటి భోజనం తీసుకురావడమే ఆకర్షణగా నిలిచిందట.