170గంటల పాటు భరతనాట్యం చేసిన యువతి..216 గంటలు టార్గెట్.. గిన్నిస్ బుక్ లో స్థానం!
ఏదైనా అనుకుంటే దాన్ని సాధించే వరకు పట్టుదలతో శ్రమించాలి. అలా చేసినప్పుడే సమాజంలో గౌరవం, గుర్తింపు దొరుకుతుంది.
By: Madhu Reddy | 31 Aug 2025 4:00 AM ISTఏదైనా అనుకుంటే దాన్ని సాధించే వరకు పట్టుదలతో శ్రమించాలి. అలా చేసినప్పుడే సమాజంలో గౌరవం, గుర్తింపు దొరుకుతుంది. టార్గెట్ పెట్టుకుంటే కచ్చితంగా ఆ టార్గెట్ ని రీచ్ అవ్వాలి. లేకపోతే దాని దగ్గరి వరకు వెళ్లాలి. అలా అయితేనే జీవితంపై ఒక క్లారిటీ వస్తుంది. అయితే తాజాగా ఓ మహిళ చేసిన పనికి ఎంతోమంది శభాష్ అంటూ మెచ్చుకుంటున్నారు. రెమోనా అనే అమ్మాయి 170 గంటలకు పైగా భరతనాట్యం చేస్తూ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.అంతేకాదు ఈమె చేసిన పనికి.. గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు కూడా దక్కింది..అయితే రెమోనా రికార్డును అధిగమించాలి అనేదే ఈమె లక్ష్యం..మరి ఇంతకీ ఆమె ఎవరు అనేది చూస్తే..
ఆమె రికార్డు బ్రేక్ చేయడమే లక్ష్యం..
కర్ణాటకలోని మంగళూరుకు చెందిన విదుషి దీక్ష అనే భరతనాట్య కళాకారిణి.. రెమోనా రికార్డ్ ని అధిగమించడమే లక్ష్యంగా పెట్టుకుంది. అలా కర్ణాటకలోని రత్న సంజీవ కళామండలి ఆధ్వర్యంలో ఈ భరతనాట్యం నిర్వహించారు. ఇందులో విదుషి దీక్ష 216 గంటల పాటు నిరంతరాయంగా భరతనాట్యం చేయాలి అనే టార్గెట్ ని పెట్టుకుంది. అలా ఆగస్టు 21 మధ్యాహ్నం 3:30 గంటల నుండి విదూషి దీక్ష తన భరతనాట్యాన్ని స్టార్ట్ చేసింది. ఇప్పటికే విదుషి దీక్ష రెమోనా సాధించిన రికార్డుని అంటే 170 గంటల భరతనాట్యం రికార్డుని అధిగమించి, 170 గంటలకు పైగా నిరంతరాయంగా భరతనాట్యం చేస్తోంది.
216 గంటల పాటు నిరంతరాయంగా భరతనాట్యం చేస్తున్న యువతి..
ఇక ఆమె టార్గెట్ 216 గంటలు.. కాబట్టి తన టార్గెట్ రీచ్ అవ్వాలని చూస్తోంది. ఈ శనివారం సాయంత్రం కల్లా తన టార్గెట్ పూర్తవుతుందని భరతనాట్య నిర్వహకులు తెలియజేశారు.. అలా 216 గంటల పాటు నిరంతరయంగా భరతనాట్యం చేసి రెమోనా రికార్డుని బద్దలు కొట్టి గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకోబోతుంది. ప్రస్తుతం ఈ విషయం మీడియాలో వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజెన్లు విదుషి దీక్ష పట్టుదలని మెచ్చుకుంటున్నారు..
గిన్నిస్ బుక్ లో స్థానం గ్యారెంటీ..
ఇక ఈ విషయం గురించి గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఆసియా హెడ్ డాక్టర్ మనీష్ విష్ణోయ్ మాట్లాడుతూ.. "216 గంటల పాటు నిరంతరాయంగా భరతనాట్యం చేయడం అనేది మామూలు విషయం కాదు.సాధారణ కుటుంబం నుండి వచ్చిన విదుషి దీక్ష తన అసాధారణ పట్టుదలతో అందరినీ మెప్పించింది. చిన్న గ్రామం నుండి వచ్చిన విదుషి దీక్ష పట్టుదలతో ప్రపంచ రికార్డ్ ని సాధించడం అనేది చాలా గొప్ప విషయం. ఆమె తన టార్గెట్ 216 గంటలు అని, అది రీచ్ అవ్వడం కోసం ఇప్పటికీ నాట్యం చేస్తూనే ఉంది" అంటూ కొనియాడారు.
