Begin typing your search above and press return to search.

ఉప రాష్ట్రపతి జీతం...అసలు ఊహించరేమో !

దేశానికి 15వ రాష్ట్రపతిగా సీపీ రాధాక్రిష్ణన్ శుక్రవారం పదవీ ప్రమాణం చేశారు. ఆయన మహారాష్ట్ర గవర్నర్ గా నిన్నటిదాకా రాజ్యంగ విధులలోనే ఉన్నారు.

By:  Satya P   |   12 Sept 2025 9:44 PM IST
ఉప రాష్ట్రపతి జీతం...అసలు ఊహించరేమో !
X

దేశానికి 15వ రాష్ట్రపతిగా సీపీ రాధాక్రిష్ణన్ శుక్రవారం పదవీ ప్రమాణం చేశారు. ఆయన మహారాష్ట్ర గవర్నర్ గా నిన్నటిదాకా రాజ్యంగ విధులలోనే ఉన్నారు. ఇదిలా ఉంటే దేశంలో అత్యున్నత రెండవ రాజ్యాంగబద్ధ పదవిగా ఉప రాష్ట్రపతిని చూడాల్సి ఉంది. ఉప రాష్ట్రపతి రాష్ట్రపతి తరువాత వరసలో ఉంటారు. రాష్ట్రపతి విధుల్లో ఉంటూ మరణిస్తే కనుక ఉప రాష్ట్రపతి రాష్ట్రపతి బాధ్యతలు చూస్తారు. ఇక ఉప రాష్ట్రపతికి రాజ్యాంగబద్ధమైన గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఎంతో ప్రతిష్ట కలిగిన ఈ పదవికి ఇచ్చే జీతం ఎంత అన్న ఆసక్తి అయితే అందరిలో కలుగుతుంది. అయితే చిత్రంగా చాలా విషయాలే తెలుసుకోవాల్సి ఉంది.

అసలు జీతం లేదు :

అవును, ఇది అక్షరాలా నిజం. ఉప రాష్ట్రపతి పదవికి జీతం అయితే లేదు. రాజ్యాంగబద్ధమైన ఈ పదవికి జీతాన్ని మాత్రం నిర్ణయించలేరు. అయితే జీతం లేదు కానీ ఇతర ప్రోత్సాహకాలు లభించే ఏకైక పదవిగా దీనిని రాజ్యాంగం ప్రకారం చూడాల్సి ఉంది. ఉప రాష్ట్రపతికి వేరే రూపంలో ఆదాయం వస్తుంది. ఆ పదవే రాజ్యసభ చైర్మన్. రాజ్యసభ చైర్మన్ గా ఉప రాష్ట్రపతి తన బాధ్యతను నిర్వహిస్తారు. అందుకు గానీ రాజ్యసభ చైర్మన్ పదవికి నెలకు నాలుగు లక్షల రూపాయల వేతనం లభిస్తుంది. 2018 వరకూ చూస్తే ఈ జీతం లక్షా పాతిక వేల రూపాయలు మాత్రమే. ఆ తరువాత దానిని సవరించి ఈ మొత్తాన్ని పెంచారు. ఉప రాష్ట్రపతి జీత భత్యాలను పార్లమెంట్ అధికారుల జీత భత్యాలు 1953 చట్టం మేరకు ఇస్తారు.

ఇతర సదుపాయాలు :

రాజ్యసభ చైర్మంగా ఇచ్చే జీతంతో పాటుగా ఉచితంగా వసతి సదుపాయం ఉంటుంది. అలాగే ఉచిత వైద్యం, రైలు విమానం ప్రయాణం, ల్యాండ్ లైన్ కనెక్షన్, మొబైల్ ఫోన్ కనెక్షన్, వ్యక్తిగత భద్రతతో పాటు సిబ్బందిని కూడా ప్రభుత్వం సమకూరుస్తుంది. అంతే కాదు అయిదేళ్ళ పాటు ఈ పదవి చేపట్టిన అనంతరం పదవీ విరమణ చేశాక మాజీ ఉప రాష్ట్రపతి హోదాలో నెలకు రెండు లక్షల రూపాయల పెన్షన్, వ్యక్తిగత కార్యదర్శి, సహాయకుడు, వ్యక్తిగత భద్రత, డక్టర్ సదుపాయం ఉచిత ప్రయాణం వంటివి ఉంటాయి. ఇక మాజీ ఉప రాష్ట్రపతి మరణిస్తే ఆయన సతీమణికి ప్రభుత్వం కొన్ని ప్రత్యేక సదుపాయాలు ఇస్తుంది.

కీలక పదవిగానే :

రాజ్యసభ చైర్మన్ అంటే కీలకమైన పదవి. పెద్దల సభగా దీనిని పేర్కొంటారు. ఇది శాశ్వత సభ కూడా. ప్రతీ రెండేళ్ళకు మూడవ వంతు ఎంపీలు రిటైర్ అవుతూంటారు. వారి స్థానంలో కొత్త వారు వస్తారు. అలా ఈ సభ అయితే రద్దు కానే కాదు. ఇక వివిధ రంగాల నిపుణులు, మేధావులు ప్రముఖులు ఎంపీలుగా ఉండే ఈ సభకు అధ్యక్షత వహించడం, లోక్ సభలో ఆమోదించిన బిల్లులను మరోమారు సమగ్రంగా చర్చించి ఆమోద ముద్ర వేయడం వంటివి చైర్మన్ హోదాలో ఉప రాష్ట్రపతి చేస్తారు. ఏది ఏమైనా ఈ పదవి ఎంతో ప్రతిష్టాత్మకమైనదిగా చెప్పాలి. ఏపీ నుంచి 13వ ఉప రాష్ట్రపతిగా ముప్పవరపు వెంకయ్యనాయుడు 2017 నుంచి 2022 దాకా అయిదేళ్ళ పాటు ఈ పదవిలో కొనసాగారు.