త్రిష వల్ల విజయ్ కు ఎసరు.. బెంగాల్ లో రాష్ట్రపతి పాలన.. వేణు స్వామి మరో బాంబు
ఈ వ్యాఖ్యలు బయటకు రావడంతో విజయ్ అభిమానులు వేణు స్వామిపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
By: A.N.Kumar | 9 May 2026 12:20 PM ISTతమిళ రాజకీయాల్లో కొత్త సంచలనానికి నాంది పలికిన స్టార్ హీరో, టీవీకే అధినేత విజయ్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిపోయారు. సినీ ఇండస్ట్రీలో అపారమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న విజయ్, రెండు సంవత్సరాల క్రితం రాజకీయాల్లోకి అడుగుపెట్టి ‘టీవీకే’ పార్టీని స్థాపించారు. మొదటి ఎన్నికలకే తమిళనాడు రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేసి 108 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించడం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి గట్టి సవాల్ విసిరిన విజయ్, ఇప్పుడు సీఎం పదవిని చేపట్టబోతుండటంతో ఆయన అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది.
ఇలాంటి సమయంలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. విజయ్ జాతకాన్ని విశ్లేషించిన వేణు స్వామి.. ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ మరో ఆరు నెలల్లో తమిళనాడులో మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే అవకాశముందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు హీరోయిన్ త్రిష క్రిష్ణన్ విజయ్‌కు దగ్గరగా ఉండటం వల్లే ఆయన జాతకంలో కొన్ని సమస్యలు కనిపిస్తున్నాయని.. ఆమె దూరంగా ఉంటే మరింత మెరుగైన ఫలితాలు సాధించే అవకాశముందని వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలు బయటకు రావడంతో విజయ్ అభిమానులు వేణు స్వామిపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయనను ట్రోల్ చేస్తూ “సెలబ్రిటీలకు మంచి జరిగితే వేణు స్వామి ఓర్చుకోలేడు” అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల పెళ్లి చేసుకున్న హీరో హీరోయిన్ల గురించి కూడా విడాకులు వస్తాయని చెప్పి వివాదాలకు కేంద్రబిందువుగా మారారని విమర్శిస్తున్నారు. మంచి జరగాలని కోరాల్సిన వ్యక్తి ఎప్పుడూ చెడు జరిగే విషయాలనే మాట్లాడుతున్నాడంటూ కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు.
అయితే మరోవైపు వేణు స్వామికి మద్దతుగా నిలిచే వారు కూడా ఉన్నారు. ఆయన నిర్వహించే ప్రత్యేక పూజలు, హోమాలు చాలా మంది సెలబ్రిటీలకు ఉపయోగపడ్డాయని.. వారి కెరీర్‌లో ఎదుగుదలకు కారణమయ్యాయని ఆయన అభిమానులు చెబుతున్నారు. ఈ మధ్యకాలంలో పలువురు సినీ ప్రముఖులు కూడా వేణు స్వామిని సంప్రదించి ప్రత్యేక పూజలు చేయించుకోవడం వార్తల్లో నిలిచింది. దీంతో ఆయన చెప్పే జ్యోతిష్య విశ్లేషణలపై కొందరికి నమ్మకం పెరుగుతుండగా.. మరికొందరు మాత్రం వాటిని పూర్తిగా కొట్టిపారేస్తున్నారు.
గతంలో ప్రభాస్ గురించి కూడా వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారానికే దారి తీశాయి. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్‌కు అంతటి స్థాయి విజయాలు రావని ఆయన చెప్పగా.. తర్వాత వచ్చిన సలార్, కల్కి 2898 ఏడీ సినిమాలు భారీ విజయాలు సాధించాయి. దీంతో ప్రభాస్ అభిమానులు వేణు స్వామిని తీవ్రంగా ట్రోల్ చేశారు.
ఇప్పుడు విజయ్ విషయంలో చేసిన వ్యాఖ్యలు కూడా ఎంతవరకు నిజమవుతాయో అనే ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది. విజయ్ ప్రభుత్వం పూర్తి కాలం కొనసాగుతుందా? లేక వేణు స్వామి చెప్పినట్లే ఆరు నెలల్లో మళ్లీ ఎన్నికల వాతావరణం ఏర్పడుతుందా? అన్నది ఇప్పుడు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు విజయ్ అభిమానులు మాత్రం తమ నాయకుడు తమిళనాడుకు కొత్త దిశ చూపిస్తాడని నమ్మకంగా చెబుతున్నారు.
