Begin typing your search above and press return to search.

వేణుస్వామిని టెంపుల్ పూజారి గెంటివేసాడా.. వీడియో వైరల్

ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి మరోసారి వార్తల్లో నిలిచాడు. ఒకప్పుడు సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన ఆయన, తాజాగా అస్సాంలోని కామాఖ్య దేవి ఆలయంలో అడ్డంగా చిక్కాడు.

By:  A.N.Kumar   |   20 Aug 2025 9:40 AM IST
వేణుస్వామిని టెంపుల్ పూజారి గెంటివేసాడా.. వీడియో వైరల్
X

ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి మరోసారి వార్తల్లో నిలిచాడు. ఒకప్పుడు సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన ఆయన, తాజాగా అస్సాంలోని కామాఖ్య దేవి ఆలయంలో అడ్డంగా చిక్కాడు. ఆలయంలోని ఒక పూజారి వేణు స్వామిని నిలదీయడంతో ఆయన ఏం చెప్పాలో తెలియక నిశ్శబ్దం పాటించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆ వీడియో మీడియాలో వైరల్ అయ్యింది.

కామాఖ్య దేవి ఆలయ పరిసరాల్లో పూజలు జరిపించడానికి వేణు స్వామి వెళ్లాడు. ఆలయంలోకి 10 మంది భక్తులతో కలిసి దర్శనానికి వెళ్లినట్టు మీడియాలో చెప్పుకొచ్చారు.. అయితే అక్కడి పూజారి ఆయనను చూసి ప్రశ్నల వర్షం కురిపించాడు. హిందీ, ఇంగ్లీష్‌లో వరుస ప్రశ్నలు ఎదురవ్వడంతో వేణు స్వామి తడబడిపోయాడు. సమాధానం చెప్పలేక మూగబోయాడు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ వీడియోను ప్రముఖ చానెల్ సీఈవో తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ “వేణు స్వామి దొరికాడు… వాయించేశాడు” అంటూ వ్యాఖ్యానించారు. దీంతో నెటిజన్లు వేణు స్వామి ఉదంతంపై చర్చించుకుంటున్నారు.

ఒకప్పుడు టాలీవుడ్‌లో ఓ స్టార్ జంట విడాకులు తీసుకుంటారని ముందే చెప్పి వేణు స్వామి పేరు తెచ్చుకున్నాడు. తర్వాత వరుసగా యూట్యూబ్, టీవీ చానల్స్‌లో ఆయనకు ఇంటర్వ్యూల కోసం డిమాండ్ పెరిగింది. ఈ క్రేజ్‌తో కొంతమంది నటీమణులకు పూజలు చేసి, పేర్లు మార్చడం వరకూ వెళ్లాడు. కానీ తర్వాత ఆయనపై పలు విమర్శలు రావడంతో గణనీయంగా వెనకడుగు వేశాడు.

ఇక ఇప్పుడు అస్సాంలో జరిగిన ఈ ఘటనతో వేణు స్వామి మళ్లీ దృష్టిలోకి వచ్చాడు. పూజారి ఎదుట ఆయన సమాధానాలు చెప్పలేక తటపటాయిస్తూ కనిపించడంతో “అసలు వేణు స్వామి అక్కడికి పూజల కోసం ఎందుకెళ్లాడు? ఏంటా కథ? ఇదంతా నిజమేనా?” అని నెటిజన్లు ఆరాతీస్తున్నారు. త్వరలోనే దీనిపై పూర్తి వివరాలు వెలుగులోకి వస్తాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

మొత్తానికి ఒకప్పుడు ఊహాగానాలతో ఫేమస్ అయిన వేణు స్వామి, ఇప్పుడు పూజారి ఎదుట నిస్సహాయంగా కనిపించడం సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది.