Begin typing your search above and press return to search.

భూతల స్వర్గం వెనిజులా....నరకంగా ఎలా మారింది ?

వెనిజులాలో చూస్తే 2015 లో ఒక్కసారిగా చమురు ధరలు పడిపోయాయని చెబుతారు. అయితే దీనికి పరిష్కారం అన్నట్లుగా పేపర్ కరెన్సీని పెంచడం పాలకులు చేసిన తప్పు.

By:  Satya P   |   7 Jan 2026 8:00 AM IST
భూతల స్వర్గం వెనిజులా....నరకంగా ఎలా మారింది ?
X

వెనిజుల అద్భుతమైన దేశం. అంతే కాదు ఎంతో చరిత్ర ఉన్న దేశం. చక్కని వాతావరణం, అద్భుతమైన ప్రకృతి ఆ దేశం సొంతం. పచ్చని పరిసరాలు అలాగే ఉత్సాహంగా కదలాడే నదీ నదాలు, లేళ్ళ గుంపులా పరుగులు తీసే సెలయేళ్ళు కనువిందు చేసే సాగర తీరాలు ఇలా ఏమి లేదు అన్నట్లుగా వెనిజులా ఉంది. అంతేనా ఆ దేశంలో సంపద కూడా ఎంతో ఉంది. ఇప్పటికి 56 ఏళ్ళ క్రితం అంటే 1970 దశకంలో ప్రపంచంలోనే నాటికి ఉన్న టాప్ ట్వంటీ ధనిక దేశాలలో వెనిజులా ఒకటి అంటే ఆశర్యం వేస్తుంది కదూ.

ఇదీ చరిత్ర :

ప్రస్తుతం వెనిజులా అని పిలువబడే ఈ ప్రాంతం 1522లో స్పెయిన్ కాలనీ రాజ్యంగా ఉండేది. 1811లో ఇది మొదటి ఫ్రెంచి అమెరికన్ కాలనీ రాజ్యం నుండి ఫస్ట్ రిపబ్లిక్ ఆఫ్ వెనిజులాగా ప్రకటించబడింది. అయినప్పటికీ 1821 వరకు సురక్షిత రాజ్యంగా లేదు. అన్నది చరిత్ర. అలాగే 1830లో వెనిజులా ప్రత్యేకమైన పూర్తి స్వతంత్ర దేశంగా అవతరించింది. 19వ శతాబ్దం నుండి 20వ శతాబ్దం సగం వరకూ అంటే 1958 వరకు వెనిజులాలో రాజకీయ అల్లర్లు నియంతృత్వ ధోరిణి మొదలైన సమస్యలను తీవ్రంగా ఎదుర్కొంది. అలా 1958 నుండి దేశంలో డెమోక్రటిక్ ప్రభుత్వాల పాలన కొనసాగింది. ఒక విధంగా ఆ సమయంలో వెనిజులాకు మంచి జరిగింది అని చెప్పాలి. 1980 , 1990 లలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం పలు రాజకీయ సంక్షోభాలకు దారితీసాయి.1989, 1992 లో రెండు మార్లు తిరుగుబాటు ప్రయత్నాలు జరిగాయి. 1993లో ప్రభుత్వనిధులను అపహరించాడని అధ్యక్షుడు " కార్లోస్ అండ్రెస్ పెరెజ్ కు వ్యతిరేకంగా చేసిన అభిశంసన తీర్మానంతో ఆవ్ ప్రభుత్వం పతనం అయింది. ఆ తరువాత 1998లో ఎన్నికలు నిర్వహించారు.

ఉచితాలతో తాయిలాలు :

ఇక ఎన్నికల పర్వంలో చూస్తే వెనిజులాలో ఉచితాలు ప్రముఖ పాత్ర పోషించాయి. అలా అధికారం కోసం రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ఉచిత పధకాలు ప్రకటించడంలో ప్రజలు సోమరి పోతులుగా మారారు. ఆర్ధికంగా సంపద అయితే సృష్టి జరగలేదు, శ్రమ విలువ తెలియలేదు, అదే సమయంలో ఉచిత పధకాలు అందుకోవడం తమ హక్కు అని జనాలు భావించారు. అది చివరికి ఆర్థిక సంక్షోభానికి దారి తీసింది. ఈ పరిణామాలతో వెనిజులా తీవ్రంగా పతనం చెందింది.

తరలిపోయిన కంపెనీలు :

ప్రభుత్వ ఆలోచనలు నిర్ణయాలు అన్నీ అనాలోచితంగా ఉండడంతో పారిశ్రామికవేత్తలు దేశం విడిచి పోయారు. అలా సుమారు ముప్పయి లక్షల మంది దాకా ఉంటారని ఒక అంచనా. ఇక ఎంతో ప్రతిభ కలిగిన మేధావులు నిపుణత కలిగిన వర్కర్లు అంతా కూడా దేశంలో ఉపాధి అవకాశాలు లేక వెళ్ళిపోయారు. అయితే చమురు తో వచ్చే ధనం ఉందని పాలకులు విర్ర వీగారు. అందువల్ల పనేమీ చేయనక్కరలేదు సంపద పెంచాల్సిన పని కూడా లేదని తలపోశారు. ఈ నేపధ్యంలో జనాలు కూడా అలాగే భావించారు. అంతే ఒక్కసారిగా ఆర్థిక సునామీ వచ్చిపడింది. వెనిజులా అద్భుత స్వర్గం కాస్తా నరకప్రాయం అయిపోయింది.

పదేళ్ళుగా కష్టాలు :

వెనిజులాలో చూస్తే 2015 లో ఒక్కసారిగా చమురు ధరలు పడిపోయాయని చెబుతారు. అయితే దీనికి పరిష్కారం అన్నట్లుగా పేపర్ కరెన్సీని పెంచడం పాలకులు చేసిన తప్పు. దాంతో కరెన్సీ అయితే ముద్రించారు కానీ డబ్బులు విలువ లేదు, ద్రవ్యోల్బనం అధికమైంది. ఇక 2020 ప్రాంతాలలో చూస్తే పూర్తిగా ఆర్థిక సంక్షోభం పీక్స్ కి చేరింది. దాంతో ఉచితాలు ఆగిపోయాయి. జనాలు బతుకు తెరువు వెతుక్కుంటూ వెళ్ళిన వారు వెళ్లగా మిగిలిన వారు మాత్రం నేర ప్రవృత్తికి అలవాటు పడ్డారు. అలా ఆటవిక రాజ్యంగా మారిపోయింది.

పర్యాటకులు రాని దుస్థితి :

వెనిజులా అందాలను చూసేందుకు ఒకనాడు విరగబడి వచ్చే పర్యాటకులు తరువాత కాలంలో రావడం మానుకున్నారు అక్కడికి వెళ్తే భద్రత ఉండదని ఆయా దేశాలు హెచ్చరించడంతో టూరిజం ఆదాయం ఆగింది. ఇక ఏదైనా దేశం దిగుమతి చేసుకుందామనుకున్నా డబ్బులు లేవు, విద్యుత్ నీళ్ళు వంటి ప్రాధమిక అవసరాలకే వెనిజులాలో ఇబ్బందులు ఎదురైన నేపథ్యం ఉంది.

వలసలు అన్ని చోట్లా :

ఇక వెనిజులాలో నుంచి పెద్ద ఎత్తున జనాలు ఇతర ప్రాంతాలలో వలసలకు పోయారు. కొలంబియాలో ఎక్కువ శాతం వెనిజులా వాసులే కనిపిస్తారు, అలాగే అర్జెంటీనా, బ్రెజిల్ లో వారే ఉంటారు. వెనిజులా దేశ జనాభా మూడున్నర కోట్ల దాకా ఉంది అని ఒక అంచనా అందులో ఎనభై శాతం పైగా వలసలు పట్టారు. ఈ నేపథ్యంలో 2013లో అధికారంలోకి వచ్చిన నికోలస్ మదురో గత పన్నెండేళ్ళుగా నియంత పోకడలు సాగిస్తున్నారు అన్న విమర్శలు ఉన్నాయి. ఆయన పాలన మీద జనాలకు విశ్వాసం లేదు, ఈ క్రమంలో ఆయనను అమెరికా పట్టుకుని పోతే దేశంలో అయితే అనుకూల స్పందన అయితే పెద్దగా లేదంటే ఆశ్చర్యంగానే ఉంది అంటారు. థాంక్స్ ట్రంప్ అని అక్కడి ప్రజలు అంటున్నారు అంటే వారు మంచి భవిష్యత్తును కోరుకుంటున్నారు. మరి ఆ విధంగా జరుగుతుందా లేక వెనిజులా బతుకు చీకటిలోనే కొనసాగుతుందా అన్నది చూడాల్సి ఉంది.