ఏపీలో ఆ పొలిటికల్ దంపతులే ' మళ్లీ.. మళ్లీ ' .. !
గడిచిన 17 మాసాల్లో భార్యాభర్తలు ఇద్దరూ రాజకీయంగా కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా.. నిలదొక్కుకు న్నారు. అంతేకాదు.. ఇటు నియోజకవర్గాల్లోనూ.. అటు ప్రజల్లోనూ కూడా గుడ్ విల్ సాధించారు.
By: Garuda Media | 9 Dec 2025 3:00 AM ISTరాజకీయాల్లో ఎవరు ఎప్పుడు ఎలా పుంజుకుంటారో చెప్పలేం. అలానే.. రాజకీయాల్లోకి వచ్చిన దంపతులు కూడా పుంజుకుంటున్నారు. గత ఎన్నికల సమయంలో పట్టుబట్టి.. రాజకీయాల్లోకి వచ్చిన భార్యా భర్తలు.. ఇద్దరు ఉన్నారు. వారి గ్రాఫ్ ప్రస్తుతం... ఝమ్ ఝమ్ అంటూ పుంజుకుంటోందని అంటున్నారు పరిశీల కులు. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన సతీమణి, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గ్రాఫ్‌లు తిరుగులేని విధంగా కొనసాగుతున్నాయి.
వాస్తవానికి గత ఎన్నికల సమయంలో వీరిద్దరూ వైసీపీలోనే ఉన్నారు. అయితే.. రెండు టికెట్లు ఇచ్చేది లేదని చెప్పడంతో ఇద్దరూ టీడీపీచెంతకు చేరిపోయారు. కోవూరు, నెల్లూరు ఎంపీ స్థానాలను దక్కించు కున్నారు. విజయం కూడా దక్కించుకున్నారు. అయితే.. రాజకీయంగా వారు కొత్తే అయినా.. ప్రజలతో ఉన్న సన్నిహిత సంబంధాలు.. స్థానికంగా ఉన్న పరిచయాలు, ప్రజలతో మమేకమైన తీరు.. వంటివి వారికి మంచి మార్కులు వేసేలా చేశాయి.
గడిచిన 17 మాసాల్లో భార్యాభర్తలు ఇద్దరూ రాజకీయంగా కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా.. నిలదొక్కుకు న్నారు. అంతేకాదు.. ఇటు నియోజకవర్గాల్లోనూ.. అటు ప్రజల్లోనూ కూడా గుడ్ విల్ సాధించారు. దీంతో వీరికి తిరుగులేదన్న సంకేతాలు వస్తున్నాయి. రోజు రోజుకు వారి గ్రాఫ్ పెరుగుతోందే తప్ప.. ఎక్కడా మైనస్ కాకపోవడం గమనార్హం. అంతేకాదు.. ప్రతి ఒక్కరికీ మరింత చేరువ అవుతున్నారు. స్వయం గా చేస్తున్న సాయాలు కొన్నయితే.. రాజకీయంగా చేస్తున్న పనులు కూడా వారి గ్రాఫ్‌ను మరింత పెంచాయి.
దీంతో ప్రత్యర్థులు కూడా వారి ముందు నిలవలేకపోతున్నారు. అంతేకాదు.. ప్రత్యర్థులు చేస్తున్న రాజకీయాలు.. వికటించి.. అవి వారికే ఎదురు తిరుగుతున్నాయి. కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి.. ప్రశాంతి రెడ్డి పై చేసిన వ్యాఖ్యలు.. ఇప్పటికీ ఇక్కడి వారు మరిచిపోలేక పోతున్నారు. దీంతో ఒకప్పుడు ప్రసన్నకుమార్‌కు ఉన్న పాజిటివ్ ఓటు బ్యాంకు దాదాపు దూరమైంది. ఇక, నెల్లూరు పరిధిలో జరుగుతున్న అభివృద్ధి ఎంపీ వేమిరెడ్డికి కలిసి వస్తోంది. ఫలితంగా వచ్చే ఎన్నికల్లోనూ ఈ దంపతులకు తిరుగులేదన్న టాక్ వినిపిస్తుడడం గమనార్హం.
