రైలు ప్రయాణికులకు శుభవార్త.. నోరూరిస్తున్న వందేభారత్ స్లీపర్ ఫుడ్ మెనూ..
మన రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. హైదరాబాదు బిర్యాని , పప్పు అన్నం , ఇడ్లీ, దోశ , పెరుగన్నం లాంటి ఫుడ్స్ అందుబాటులోకి తీసుకొచ్చారు.
By: Madhu Reddy | 20 Jan 2026 8:00 AM ISTరైలు ప్రయాణం అంటే ఇష్టపడని ప్రయాణికుడు ఉండడు. అయితే ఈ రైలు ప్రయాణంలో సుదూరాలకు ప్రయాణికులకు ఆహారం విషయంలో రైల్వే శాఖ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆహార సేవలు కూడా అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే రైళ్లలో లభించే ఆహారం ప్రాంతాన్ని బట్టి మారితే ఎంత బాగుంటుందో అని కోరుకునే వారి సంఖ్య. రైళ్లలో అందించే ఆహారం మరికొంతమందికి ఇబ్బందిగా మారుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రాంతాన్ని బట్టి ఆహార సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది రైల్వే శాఖ.
ముఖ్యంగా వందే భారత్ లో ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో ఆ రైలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తోంది అనే ప్రదేశాలను బట్టి ఆయా ప్రాంతాలకు చెందిన రుచికరమైన ఆహారాలను ఈ రైలులో ప్రయాణికులకు అందించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఇకపై వందే భారత్ లో ప్రయాణించే ప్రయాణికులకు రుచికరమైన భోజనాన్ని అందించడానికి సిద్ధం అయిపోయింది. ఇకపోతే ఏ ప్రాంతంలో ఎలాంటి భోజనాలను అందించబోతున్నారు అనే విషయం ఎప్పుడు చూద్దాం..
వందే భారత్ స్లీపర్ రైలులో ప్రయాణికుల కోసం బెంగాల్, అస్సాం ప్రాంతీయ వంటకాలతో ప్రత్యేక మెనూ సిద్ధం చేశారు. ఇందులో బెంగాలీ స్పెషల్ బాసంతి పులావ్, చోలార్ దాల్, ధోకర్ , మూంగ్ దాల్ వంటి సాంప్రదాయ వంటకాలను అందుబాటులోకి తీసుకొచ్చారు.
అలాగే అస్సామీ రుచుల కోసం సువాసనలు వెదజల్లే జోహా రైస్, మతి మోహార్, మసూర్ దాల్, సీజనల్ వెజిటబుల్ ప్రైస్ అందిస్తున్నారు.. అలాగే తీపి వంటకాలలో సందేశ్, నారీ కోల్ బర్ఫీ, రసగుల్లాలను మెనూలో చేర్చారు.
ఇక ఈ విషయం తెలిసి బెంగాల్, అస్సాం ప్రాంతాలలో ప్రయాణించే ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నోరూరించే వంటకాలతో రైలు ప్రయాణం మరింత అందంగా మారనుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ఒక ఈ రెండు ప్రాంతాలలోనే కాకుండా మరికొన్ని ప్రాంతాలలో కూడా ఆ ప్రాంతాలకు తగ్గట్టు లోకల్ వంటకాలను అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఇకపోతే కేరళ రూట్లలో ప్రయాణించే ఈ వందే భారత్ రైళ్లలో మలబార్ చికెన్ బిర్యాని, వరుత్తరచ చికెన్ కర్రీ , అలెప్పీ వెజ్ కర్రీ ఇలాంటి ఫుడ్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
మన రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. హైదరాబాదు బిర్యాని , పప్పు అన్నం , ఇడ్లీ, దోశ , పెరుగన్నం లాంటి ఫుడ్స్ అందుబాటులోకి తీసుకొచ్చారు.
కట్రా - శ్రీనగర్ ప్రాంతంలో ప్రయాణించే ఈ వందే భారత్ ట్రైన్ లో కాశ్మీరీ కహ్వా, రాజ్మా, కాశ్మీరీ పులావ్, అంబల్ కడ్డూ, బబ్రూ లాంటి స్థానిక వంటకాలు లభించనున్నాయి.
