Begin typing your search above and press return to search.

టార్గెట్ వందే భారత్... చెత్త స్లీపర్ సెల్స్ మారలేదు..!

ఎందుకో భారతదేశంలో ప్రజలు విమానాల్లోనూ, మెట్రోల్లోనూ హుందాగా ప్రవర్తిస్తారు కానీ.. స్లీపర్ ట్రైన్స్ లో మాత్రం పౌర జ్ఞానాన్ని మొత్తం పక్కనపెట్టేస్తారని అంటారు.

By:  Raja Ch   |   20 Jan 2026 10:34 AM IST
టార్గెట్ వందే భారత్... చెత్త స్లీపర్ సెల్స్ మారలేదు..!
X

ఎందుకో భారతదేశంలో ప్రజలు విమానాల్లోనూ, మెట్రోల్లోనూ హుందాగా ప్రవర్తిస్తారు కానీ.. స్లీపర్ ట్రైన్స్ లో మాత్రం పౌర జ్ఞానాన్ని మొత్తం పక్కనపెట్టేస్తారని అంటారు. ఈ విషయంలో రెగ్యులర్ గా తిరిగే ట్రైన్స్ తో పాటు తాజాగా వందే భారత్ స్లీపర్ కోచ్ లకు తప్పలేదు. దీనికి సంబంధించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో.. భారతదేశంలోని చెత్త స్లీపర్ సెల్స్ ఇప్పుడు వందే భారత్ ను సైతం లక్ష్యంగా చేసుకున్నట్లున్నాయనే చర్చ మొదలైంది.

అవును... కోల్‌ కతాలోని హౌరా నుండి ప్రధాని మోడీ వందే భారత్‌ ను జెండా ఊపి ప్రారంభించిన సంగతి తెలిసిందే. అలా ప్రారంభించిన కొన్ని గంటల తర్వాత.. ‘ఎక్స్’ హ్యాండిల్‌ లో ఓ ప్రయాణికుడు షేర్ చేసిన వీడియోలో.. ఒక కోచ్‌ పై ప్లాస్టిక్ ప్యాకెట్లు, చెంచాలు చెల్లాచెదురుగా పడి ఉన్నట్లు చూపించారు. ఈ సందర్భంగా... వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభమైన కొన్ని గంటల్లోనే ప్రజలు దానిపై చెత్త వేస్తున్నారు.. పౌర జ్ఞానాన్ని చూడండి అని యూజర్ రాశారు.

పౌర జ్ఞానం లేకుండా.. వందే భారత్, విలాసవంతమైన విమానాశ్రయాలు లేదా విశాలమైన రోడ్లు వంటి ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను కూడా నిర్వహించడం కష్టమవుతుందని నెటిజన్లు స్పందిస్తున్నారు. భారతదేశపు మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ ప్రపంచ స్థాయిగా కనిపిస్తుంది.. అయితే దీన్ని ప్రారంభించిన కొన్ని గంటల్లోనే ప్రయాణీకులు రోడ్డు పక్కన చెత్తబుట్టలాగా దీన్ని తయారు చేయడం ఏమాత్రం సమర్థనీయం కాదు అని అంటున్నారు.

ఇది ముందే ఊహించారో ఏమో కానీ... వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ ప్రెస్ ప్రారంభానికి కొన్ని రోజుల ముందు ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీస్ ఆఫీసర్, చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ అనంత్ రూపనగుడి స్పందిస్తూ.. మీరు మీ టాయిలెట్ మర్యాదలు నేర్చుకున్నట్లయితేనే.. వాష్‌ రూమ్‌ లలో ఇచ్చిన సూచనలను పాటించేపలమైతేనే.. ప్రజా ఆస్తిపై గౌరవం కలిగి ఉంటేనే రైలులో ప్రయాణించాలని ప్రజలకు సలహా ఇచ్చారు.

ఈ సందర్భంగా... భారతీయులు విమానాలలో ఇలా ప్రవర్తించరని, రైళ్లలో మాత్రమే ప్రవర్తిస్తారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. వందే భారత్ కూడా విమానాల స్థాయిలోనే ప్రీమియం ప్రయాణమే! ఇక్కడ సమస్య ప్రీమియం ప్రయాణం కాదు.. రైళ్లపై భారతదేశంలోని ప్రయాణికులకు ఉన్న చిన్న చూపు, నిర్లక్ష్యం.. తప్పులపై కఠినమైన జరిమానాలు, శిక్షలు లేకపోవడమే అని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు.

ఈ నేపథంలోనే... హౌరా - గౌహతి మధ్య సరైఘాట్ ఎక్స్‌ ప్రెస్‌ లో 3ఏసీ టికెట్ ధర దాదాపు రూ.1,500 ఉండగా.. వందే భారత్‌ లో అదే తరగతి రూ.2,300 కు చేరుకుంటుందని గుర్తు చేస్తున్నారు. ఇది చౌక ప్రయాణం చెడు ప్రవర్తనను పెంపొందించడం గురించి కాదని చెబుతున్నారు. మరోవైపు విమానాలు, మెట్రోలలో ప్రయాణ వ్యవధి తక్కువగా ఉండగా.. రైలు ప్రయాణాలు తరచుగా ఎక్కువ కాలం ఉంటాయని.. సామాజిక పరిస్థితులు కూడా భిన్నంగా ఉంటాయని.. ఇది ఒక కారణమని అంటున్నారు. ఏది ఏమైనా మారాల్సిన సమయం ఆసన్నమైందని చెబుతున్నారు.