నో వెయిటింగ్ లిస్ట్.. నో ఆర్ఏసీ...టికెట్ కన్ఫర్మ్ !
కేంద్ర ప్రభుత్వం దేశంలో మధ్యతరగతి వర్గాల కోసం ప్రత్యేకంగా రంగంలోకి తెస్తున్న రైలు వందేభారత్ స్లీపర్.
By: Satya P | 12 Jan 2026 7:34 PM ISTకేంద్ర ప్రభుత్వం దేశంలో మధ్యతరగతి వర్గాల కోసం ప్రత్యేకంగా రంగంలోకి తెస్తున్న రైలు వందేభారత్ స్లీపర్. ఇది వేగంగా సురక్షితంగా సౌకర్యవంతంగా వేల కిలోమీటర్ల గమ్యానికి అనుకున్న సమయానికి చేర్చడం ఈ రైలు ముఖ్య ఉద్దేశ్యం. ఇదిలా ఉంటే వందే భారత్ స్లీపర్ లో ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఈ ట్రైన్ లో ట్రావెల్ చేసేవారికి నో వెయిటింగ్ లిస్ట్ అలాగే నో ఆర్ఏసీ అని చెబుతున్నారు. అంటే టికెట్ కన్ఫర్మ్ అవుతుంది అన్న మాట. ఈ సిస్టం కి పూర్తిగా ఫుల్ స్టాప్ పెడుతూ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్ని సీట్లు ఉన్నాయో అంతమందికీ టికెట్లు ఖరారు చేస్తారు. ఆ మీదట ఎవరికీ టికెట్ అయితే ఇవ్వారు. దాంతో నో వెయిటింగ్ లిస్ట్ అన్న మాట. ఇది కొత్త విధానంగా ముందుకు తెస్తున్నారు.
మోడీ చేతుల మీదుగా :
ఇక వందేభారత్ తొలి స్లీపర్ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ నెల 17న పట్టాలెక్కనుంది. ఆ మరుసటి రోజు అంటే ఈ నెల 18 నుంచి ఈ ట్రైన్ ప్రయాణీకులకు అందుబాటులోకి వస్తుందని రైల్వే వర్గాలు ప్రకటించాయి. ఈ ట్రైన్ ని హౌరా టూ గువహటి మధ్య నడుపుతునారు. ఇక ఒక వేయి 17 కిలోమీటర్ల దూరం ఈ రెండింటి మధ్య ఉంది. హౌరా నుంచి గుహవతిలోని కామాఖ్య దాకా వెళ్ళే ఈ ట్రైన్ సాధారణ ప్రయాణీకుల సేవల కోసం ఉద్దేశించబడింది. అలాగే పశ్చిమ బెంగాల్‌లోని హౌరా అస్సాంలోని గౌహతి మధ్య ఈ రైలు ప్రయాణం ఎంతో కీలకంగా మారుతుందని అంటున్నారు.
మేక్ ఇన్ ఇండియా నినాదం :
ఇదిలా ఉంటే వందే భారత్ స్లీపర్ రైలు మేక్ ఇన్ ఇండియా నినాదానికి అసలైన నిదర్శనం అని అంటున్నారు. ఈ రైలుకి సంబంధించిన కీలకమైన మూడు వ్యవస్థలు భారతీయ పరిజ్ఞానంతోనే రూపొందించారు. బోగీ, ప్రొపల్షన్ సిస్టమ్ వాహన నియంత్రణ వ్యవస్థ పూర్తిగా దేశంలోనే రూపొందించబడిందని అధికారులు చెబుతున్నారు. దాంతో వందేభారత్ స్లీపర్ రైలు పూర్తిగా స్వదేశీ రైలుగా మారిందని చెబుతున్నారు. ఇక వందే భారత్ స్లీపర్ రైలు హౌరా నుండి గౌహతి (కామాఖ్యా) వెళ్లే మార్గంలో బందేల్, కట్వా, న్యూ ఫరక్కా, మాల్డా టౌన్, న్యూ జల్పాయిగురి, న్యూ కూచ్‌బెహార్, న్యూ బొంగైగావ్ అజిమ్‌గంజ్‌లలో ఆగుతుంది.
గంటకు 180 కిలోమీటర్లు :
ఇక ఈ రైలుని గరిష్టంగా గంటకు 180 కిలోమీటర్లు వేగంతో డిజైన్ చేశారు. కానీ భద్రతా కారణాల దృష్ట్యా 130 కిలో మీటర్ల వేగంతో మాత్రమే నడుస్తుంది. 823 బెర్త్‌లలో 611 బెర్త్‌లు ధర్ట్ ఏసీ కోసం, 188 బెర్తులు సెకండ్ ఏసీ కోసం మరియు 24 ఫస్ట్ ఏసీ కోసం కేటాయించబడ్డాయి. ఈ రైలులో వెస్టిబ్యూల్స్‌తో కూడిన ఆటోమేటెడ్ డోర్లు, ఎర్గోనామిక్ స్లీపర్‌లు మరింత సౌకర్యవంతమైన ప్రయాణాల కోసం మెరుగైన సస్పెన్షన్ వంటి నూతన ఆవిష్కరణలు ఉన్నాయి.
ఆధునిక హంగులతో :
ఇదిలా ఉంటే ఈ రైలులో ప్రయాణికుల భద్రతకు హామీ ఇవ్వడానికి కవాచ్ ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ అత్యవసర టాక్-బ్యాక్ వ్యవస్థ కూడా ఉన్నాయి. వందే భారత్ స్లీపర్ రైలు పారిశుద్ధ్య ప్రమాణాలకు అధిక ప్రాధాన్యతనిచ్చింది. ఈ రైలులో క్రిమిసంహారక సాంకేతికత 99.9 శాతం క్రిములను చంపుతుంది. అదే సాంకేతికతను వందే భారత్ చైర్-కార్ వెర్షన్‌లో ఉపయోగిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. ఈ రైలులో విమానాలలో ఉన్నటువంటి మాడ్యులర్ బయో వాక్యూమ్ టాయిలెట్‌లతో పాటు మెరుగైన కుషన్లు అలాగే ప్రయాణీకుల కోసం షవర్ క్యూబికల్ ప్రాంతం కూడా ఉన్నాయి. ఇక గౌహతి నుండి వచ్చే రైళ్లలో అస్సామీ భోజనం అందించబడుతున్నట్లుగా కోల్‌కతాలో వారి ప్రయాణాలను ప్రారంభించే రైళ్లలో బెంగాలీ ఆహారం అందించబడుతుందని చెబుతున్నారు.
టికెట్లు ఇలా :
ఇక వందే భారత్ స్లీపర్ రైలు టిక్కెట్ల ధర రాజధాని ఎక్స్‌ప్రెస్ వంటి ప్రస్తుత లగ్జరీ రైళ్ల కంటే కొంచెం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఈ రైలులో ప్రయాణికులు 400 కిలోమీటర్ల ప్రయాణానికి సమానమైన కనీస రేటును చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఈ వందే భారత్ స్లీపర్ రైలులో 50 కిలోమీటర్లు ప్రయాణించినా లేదా 100 కిలోమీటర్లు ప్రయాణించినా 400 కిలోమీటర్ల దూరానికి సమానమైన టికెట్ ఛార్జీని చెల్లించాల్సి ఉంటుంది. అదే విధంగా ఈ రైలులో థర్డ్ ఏసీ టికెట్ ధర రూ.960 గా నిర్ణయించారు. అదే సెకండ్ ఏసీ అయితే రూ.1,240 వస్ట్ ఏసీ ధర అయితే రూ.1,520 గా వసూలు చేయనున్నారు. ఇక ఈ టికెట్ల ధరకు అదనంగా జీఎస్టీ కూడా వేయనున్నారు. మొత్తానికి ఈ రైలు అయితే మధ్యతరగతి వర్గాలకు ఎంతో ఊరటను ఇచ్చేదిగా ఉంటుంది, తక్కువ సమయంలో ఎక్కువ దూరం వేగంగా వెళ్లే చాన్స్ అయితే ఉంటుంది.
