Begin typing your search above and press return to search.

వల్లభనేని వంశీ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా ?

రెండు దశాబ్దాల సుదీర్ఘమైన రాజకీయ జీవితం వల్లభనేని వంశీది. ఆయన 2004లో విజయవాడ పార్లమెంట్ టికెట్ ఆశించారు.

By:  Satya P   |   19 Sept 2025 9:51 AM IST
వల్లభనేని వంశీ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా ?
X

రెండు దశాబ్దాల సుదీర్ఘమైన రాజకీయ జీవితం వల్లభనేని వంశీది. ఆయన 2004లో విజయవాడ పార్లమెంట్ టికెట్ ఆశించారు. కానీ టీడీపీ నుంచి అశ్వినీదత్ దక్కించుకున్నారు. వంశీ ఆ ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారం చేసి పెట్టారు. ఆయనలోని డైనమిక్ నేచర్ ని గమనించిన టీడీపీ పెద్దలు 2009లో అదే విజయవాడ ఎంపీ టికెట్ ఇచ్చారు. కానీ ఓటమి పాలు అయ్యారు. ఈ రెండు సార్లు కాంగ్రెస్ తరఫున లగడపాటి రాజగోపాల్ ఎంపీగా గెలిచారు. ఇక 2014లో ఆయనకు గన్నవరం అసెంబ్లీ టికెట్ ఇస్తే మంచి మెజారిటీతో గెలిచారు. 2019లో వైసీపీ ఊపులో సైతం ఆయన తన సీటుని నిలబెట్టుకుని శభాష్ అనిపించుకున్నారు. ఇన్ని చేసిన ఆయన 2019 తరువాత వైసీపీలోకి చేరడమే రాజకీయంగా తీసుకున్న రాంగ్ డెసిషన్ అని ఆయన గురించి తెలిసిన వారు అంటారు. అయితే అప్పటికి అది కరెక్ట్ డెసిషన్ అనేవారూ లేకపోలేదు. మొత్తానికి వైసీపీలో చేరి వంశీ బావుకున్నది ఏమిటి అంటే జైలు జీవితం అని బాధపడేవారూ ఉన్నారు.

ఊసు ఎక్కడా లేదే :

జైలు నుంచి కొద్ది నెలల క్రితం బయటకు వచ్చిన వంశీ ఊసు మాత్రం ఎక్కడా లేకుండా పోయింది. ఆయన ఏమి చేస్తున్నారు అన్నది కూడా తెలియడం లేదు అయితే వంశీ ఆరోగ్యం బాగులేదని ఆయన కొన్నాళ్ళ పాటు రెస్ట్ తీసుకుంటారని అప్పట్లో చెప్పుకున్నారు. ఇవన్నీ పక్కన పెడితే వంశీ రాజకీయంగా ఏమి చేస్తారు అన్నది కూడా ఇంకో వైపు చర్చగా ఉంది. గన్నవరం నుంచి మూడు సార్లు పోటీ చేసి రెండు సార్లు గెలిచిన వంశీకి అక్కడ మంచి పలుకుబడి ఉంది. ఆయన అనుచరులు అభిమానులు ఎక్కువ మంది ఉన్నారు. వైసీపీ కూడా గన్నవరం ఇంచార్జి విషయంలో వంశీనే అనుకుంటూ ముందుకు సాగుతోంది.

జగన్ తో ఒకేసారి :

ఇక చూస్తే కనుక వంశీ ఏకంగా మూడున్నర నెలల పాటు జైలు జీవితం అనుభవించారు ఈ సమయంలో ఆయన అనారోగ్యం పాలు పడ్డారు. జైలు నుంచి వచ్చిన వెంటనే జగన్ ని కలిసి ధన్యవాదాలు చెప్పారు. జైలులో ఉన్నపుడు తనను పరామర్శించినందుకు అలా మర్యాదపూర్వకమైన భేటీనే అయ్యారు తప్ప రాజకీయంగా కాదని అప్పట్లో చెప్పుకున్నారు. మరో వైపు చూస్తే వంశీ రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నారు అన్న ప్రచారం అయితే సోషల్ మీడియాలో సాగుతోంది. ఆయన ఇక మీదట పాలిటిక్స్ కి దూరంగా ఉంటారు అని అంటున్నారు.

ఒత్తిడి తెస్తున్నారా :

కుటుంబ సభ్యులు అయితే రాజకీయాల జోలికి పోవద్దని ఒత్తిడి తెస్తున్నారు అని అంటున్నారు. అంతే కాదు శ్రేయోభిలాషులు కానీ ఆయన హితాన్ని కోరే వారు కానీ ఇదే మాట చెబుతున్నారుట. వ్యాపారాలు చేసుకోమని సూచిస్తూనే ఇక రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టేయడం బెటర్ అని అంటున్నారుట. దీంతో వంశీ కూడా కొత్త ఆలోచనలు చేస్తున్నారు అని ప్రచారం అయితే సాగుతోంది.

అభిమానుల ఆశలు :

అయితే వంశీ ఆరోగ్యం కుదుట పడిన తర్వాత తప్పకుండా గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గానికి వస్తారు అని అభిమానులు అంటున్నారు. ఆయనకు కండిషన్లతో కూడిన బెయిల్ రావడం వల్లనే రాజకీయాల గురించి మాట్లాడటం లేదు తప్ప ఆయన గుడ్ బై కొట్టరని ఫైటర్ గానే ఉంటారని అంటున్నారు. అయితే వంశీ గన్నవరం వైపే చూడడం లేదని మరో వైపు చర్చ సాగుతోంది. వైసీపీ మాత్రం ఎవరినీ ఇంచార్జిగా పెట్టలేదు అంటే వంశీ మీద నమ్మకంతోనే అని అంటున్నారు. మరి వంశీ రాజకీయాలకు దూరంగా ఉంటారా లేక కొన్నాళ్ళు ఆగి సంచలనం రేపుతారా అన్నది చూడాలి ఏది ఏమైనా వంశీ నిర్ణయం మాత్రం సంచలనంగానే ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి ఆ నిర్ణయం ఏమిటో.