Begin typing your search above and press return to search.

వంశీకి అంత సీన్ ఉందా ?

ఆయన ఆస్తిపాస్తులు గురించి కూడా పూర్తిగా రివీల్ చేశారు. మరి కొడాలి నాని చెప్పిన దాని ప్రకారం చూస్తే వంశీ ఆస్తులు ఎంతో తెలుసా.. అందరూ నోళ్ళు వెళ్ళబెట్టంత అని అంటున్నారు.

By:  Satya P   |   12 Sept 2026 11:03 PM IST
వంశీకి అంత సీన్ ఉందా ?
X

వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సామాన్యుడు అనుకుంటున్నారా అంటూ ఆయన గురించి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ని బయటపెట్టారు ఆయనకు అత్యంత సన్నిహితుడైన నేత, వైసీపీకి చెందిన మాజీ మంత్రి కొడాలి నాని. వైసీపీ పార్టీ కార్యకర్తల సమావేశంలో కొడాలి నాని తాజాగా మాట్లాడుతూ వంశీ ఆషా మాషీ నేత కాదని తేల్చేశారు. ఆయన ఆస్తిపాస్తులు గురించి కూడా పూర్తిగా రివీల్ చేశారు. మరి కొడాలి నాని చెప్పిన దాని ప్రకారం చూస్తే వంశీ ఆస్తులు ఎంతో తెలుసా.. అందరూ నోళ్ళు వెళ్ళబెట్టంత అని అంటున్నారు. అయితే గన్నవరం ఎమ్మెల్యేగా రెండు సార్లు టీడీపీ నుంచి గెలిచి వైసీపీ నుంచి 2024 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన వంశీకి అంత పెద్ద ఎత్తున ఆస్తిపాస్తులు ఉన్నాయా అన్నదే ఇపుడు చర్చగా ఉంది.

పది వేల కోట్లు :

వంశీకి ఎంత ఆస్తి ఉందో కొడాలి నాని లెక్కలతో సహా చెప్పారు. హైదరాబాద్ లో వంశీకి 200 ఎకరాల భూమి ఉందని ఆయన తెలిపారు ఇపుడు ఆ భూమి విలువ ఎకరం యాభై కోట్లుగా తీసుకుంటే మొత్తం 10 వేల కోట్లుగా ఉందని అన్నారు. వంశీ అంతటి కోటీశ్వరుడు అయి ఉండి పేదలకు ఇచ్చే ఇళ్ళ పట్టాలు తీసుకుని అమ్ముకుంటారా అని నాని ప్రశ్నించారు . అంతే కాదు ఒక లారీ లోడ్ గ్రావెల్ వల్ల 1200 రూపాయలు మాత్రమే వస్తుందని ఇది కూడా వంశీ అమ్ముకున్నారు అని కేసులు పెట్టడమేంటని కూటమి ప్రభుత్వం మీద నిప్పులు చెరిగారు. ఇవన్నీ హాస్యాస్పదమైన ఆరోపణలు అని కొడాలి నాని కొట్టి పారేశారు. ఇలాంటి కేసులకు వంశీ భయపడతారా అని ప్రశ్నించారు, ఈ జైళ్ళు, గుళ్ళు బళ్ళు అన్నీ వంశీ ఎపుడో చూసేశారు అని సెటైర్లు పేల్చారు.

కొడాలి చెప్పిందేంటి :

వంశీ తరగని ఆస్తిపరుడు కాబట్టి ఆయన మీద పెట్టిన కేసులు అన్నీ తప్పుల తడకలు అని అంటున్నారు. అయితే కోట్లాది రూపాయలు ఆస్తులు ఉన్న వారు ఎవరూ ఆర్ధికంగా కేసులలో ఇరుక్కుంటే ఇదే రకమైన థియరీ పనిచేస్తుందా అన్నది ఒక లాజిక్ తో కూడిన ప్రశ్నగా ముందుకు వస్తుంది. ఆ లెక్కన వేల కోట్లు ఆస్తులు ఉంటే అవినీతి ఎవరూ చేయనట్లుగానే చూడాలా అని కూడా ప్రశ్నలు వస్తున్నాయి. ఆస్తులకు కేసులకు సంబంధం ఉంటుందా అని కూడా అడుగుతున్న వారు ఉన్నారు. వంశీ తప్పు చేయలేదు అని చెప్పవచ్చు కానీ వేల కోట్లు ఆస్తులు ఉన్న వారు ఏ రకంగానూ తప్పులు చేయరని అన్నట్లుగా కొత్త థియరీని కొడాలి వినిపించారు అని అంటున్నారు.

స్నేహితుల త్రయం:

ఇక ఉమ్మడి క్రిష్ణ జిల్లాలో వల్లభనేని వంశీ, కొడాలి నాని, పేర్ని నాని అనే ముగ్గురు స్నేహితుల మధ్య బంధం చాలా గొప్పది. ఈ ముగ్గురూ దశాబ్దాలుగా కలసి కట్టుగా ఉంటున్నారు. ఇక టీడీపీ నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించిన వారు కొడాలి నాని, వల్లభనేని వంశీ అయితే కాంగ్రెస్ నుంచి రాజకీయాలు మొదలెట్టిన వారు పేర్ని నాని. అయితే ఈ ముగ్గురినీ కలిపింది వైసీపీ అనే చెప్పాలి. వైసీపీలో ముగ్గురూ పని చేస్తూ వచ్చారు. ముగ్గురూ 2019 లో గెలిస్తే 2024లో పేర్ని నాని పోటీ చేయలేదు, ఆయన కుమారుడు తొలిసారి పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు, ఇక వంశీ నాని ఇద్దరూ ఓటమిని చూశారు. ఇందులో కొడాలి నాని మొదటి సారి ఓటమి ఏంటో చూశారు. ఆ మధ్య కాలం అంతా కొడాలి నాని పెద్దగా బయటకు రాలేదు, ఆయన ఆరోగ్య కారణాల రిత్యా దూరంగా ఉన్నరు. ఇక వంశీ అయితే కూటమి ప్రభుత్వం వరసగా పెట్టిన కేసుల వల్ల జైలు పాలు అయి సుదీర్ఘ కాలం ఉన్నారు. ఆ తరువాత బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇపుడిపుడే ఆయన యాక్టివ్ అవుతున్నారు. మొత్తానికి ఈ కేసులు కాదు కానీ వంశీ ఆస్తుల గురించి కొడాలి నాని హైలెట్ చేయడంతో వంశీకి బ్యాక్ గ్రౌండ్ గురించి అంతా ఆసక్తికరంగా చర్చించుకోవడం జరుగుతోంది.