Begin typing your search above and press return to search.

లాలూ కోటలను కూల్చేసిన వాజ్ పేయి పవర్ ఫుల్ డైలాగ్

బీహార్ లో ఆర్జేడీ వరసగా మరోసారి అందుకోకుండా చతికిలపడింది. అంతే కాదు ఈసారి మరింత తక్కువగా సీట్లు సాధించి దారుణమైన ఎన్నికల ఫలితాలను చూసింది.

By:  Satya P   |   15 Nov 2025 9:00 PM IST
లాలూ కోటలను కూల్చేసిన వాజ్ పేయి పవర్ ఫుల్ డైలాగ్
X

బీహార్ లో ఆర్జేడీ వరసగా మరోసారి అందుకోకుండా చతికిలపడింది. అంతే కాదు ఈసారి మరింత తక్కువగా సీట్లు సాధించి దారుణమైన ఎన్నికల ఫలితాలను చూసింది. అయితే బీహార్ అంటే లాలూ అన్నట్లుగా ఏకంగా పదిహేనేళ్ల పాటు అప్రతిహతంగా సాగిన లాలూ ప్రసాద్ యాదవ్ ప్రభంజనం ఎలా సైలెంట్ అయిపోయింది, కంచుకోటలతో శతౄ దుర్భేధ్యంగా ఉన్న ఆర్జేడీ సామ్రాజ్యం ఎలా కూలిపోయింది అన్నది ఆసక్తికరమైన చర్చ. నిజానికి 1990 మార్చిలో లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ సీఎం అయ్యారు. అది లగాయితూ 2005 దాకా ఆయన సగం ఆయన సతీమణి రబ్రీదేవి మరో సగం పాలించారు. లాలూ ఆర్జేడీతోనే బీహార్ రాజకీయం అంతా సాగిపోతున్న నేపధ్యంలో ఆనాడు బీజేపీలో ఉన్న అత్యంత వరిష్ట నేత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి లాలూ కోటల మీద పాశుపతాస్త్రమే ప్రయోగించారు.

ఒక్క డైలాగుతోనే :

వాజ్ పేయ్ అంటేనే దేశమంతా గర్వించి గౌరవించే ఉత్తమ నేత. ఆయన బీహార్ ఎన్నికల ప్రచారానికి 2005లో వచ్చారు. ఆనాడు ఆయన ఎన్నికల ప్రచార సభలో అన్న మాటలు పవర్ ఫుల్ డైలాగులుగా మారి లాలూ పార్టీ విషయంలో బీహారీల మనసు మొత్తం మార్చేసేలా చేశాయి. ఆ డైలాగులే ముజఫర్‌పూర్ సభలో నా కిస్లే ఎక్కడ ఎవరైనా నా కిస్లేను తీసుకురండి అంటూ భావోద్వేగానికి గురయ్యాడు. ఈ ఒక్క మాటకు బీహారీలు మొత్తం కదిలిపోయారు. అంతే ఆ ఎన్నికల్లో సీన్ మొత్తం మారిపోయింది. ఇంతకీ కిస్లే ఎవరు ఏమా కధ అంటే అది కూడా వెరీ ఇంట్రెస్టింగ్ గా చెప్పుకోవాలి.

బాలుడి కిడ్నాప్ :

ఇక బీహార్ లో ఆ సమయలో పెద్ద ఎత్తున లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంస్ జరుగుతూండేవి అన్నది ఉంది. ఇక వరసబెట్టి కిడ్నాపులు సైతం జరిగేవి అని చెబుతారు. అలా పసి బాలుర నుంచి వృద్ధుల వరకూ ఎంతో మంది కిడ్నాపులకు గురి అయినా వారి విషయంలో విచారణ లేదు, ఏమయ్యారు అన్నది అంతకంటే విచారించేది లేదు ఈ విధంగా చూస్తే గోలు అనే చిన్నారిని ముజఫర్‌‌పూర్‌లో కిడ్నాప్ చేశారు, ఇక పాట్నాలో శ్వేతా అనే అమ్మాయిని సైతం అపహరించారు. అదె విధంగా పాట్నాలోని గోలా రోడ్‌లో 14 ఏళ్ల కిస్లే అనే బాలుడు కిడ్నాప్‌ అవడంతో అది పెద్ద ఎత్తున సంచలనం అయింది. అది ఆనాటి మీడియాలో ప్రముఖంగా నిలిచింది. ఇక ఆ సమయంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అలా ఎన్నికల ప్రచారానికి వచ్చిన నాటి బీజేపీ నేత్మాజీ ప్రధాని వాజ్‌పాయ్ వచ్చారు. కిస్లే కిడ్నాప్ గురించి మీడియా ద్వరా తెలుసుకున్న వెంటనే పూర్తిగా దిగ్బ్రాంతికి గురి అయ్యారు. ఆసాంతం ఆయన కలత చెందారు.

భావోద్వేగ ప్రసంగం :

వాజ్ పేయ్ అంటే సునిశిత విమర్శలు భావోద్వేగంతో కూడిన ప్రసంగాలకు పేరు. ఆయన కిస్లే కిడ్నాప్ తరువాత వేదనాభరితమైన వదనంతో సభకు వచ్చారు. ఆ సభలో ఆయన రాజకీయ అంశాల కంటే ఎక్కువగా కిస్లే కిడ్నాప్ విషయాన్నే ప్రస్తవించారు. అది మొత్తం బీహార్ ప్రజలకు కదిలించివేసింది. వాజ్ పేయ్ ప్రసంగంలో కిస్లే ఎక్కడ అన్న డైలాగే ఆనాటి పత్రికలలో పతాక శీర్షికలకు ఎక్కింది. అది జనం మెదళ్ళలో కొత్త ఆలోచనలు రేపింది. అంతే లాలూ కోటలు ఆ ఎన్నికల్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి.

జంగిల్ రాజ్ అంటే :

ఈ రోజున దేశంలో అన్ని రాష్ట్రాలలో రాజకీయ ప్రత్యర్ధుల పాలనను విమర్శించేటపుడు జంగిల్ రాజ్ అని అంటారు. కానీ ఇప్పటికి ఇరవై ఏళ్ళ క్రితం బీహార్ లో ఆ పేరు నాటి పాలకుల మీద వచ్చింది. ఏక బిగిన పదిహేనేళ్ళ పాటు సాగిన లాలూ ఆయన సతీమణి పాలనలో బీహార్ లో లా అండ్ ఆర్డర్ పూర్తిగా బ్రేక్ అయింది. ఎడతెరిపి లేకుండా కిడ్నాపులు, దందాగిరీలు, దౌర్జన్యాలు ఇలా అక్కడ ప్రజలకు ఏ మాత్రం సురక్షితం అన్నది లేకుండా పోయింది. బయటకు వెళ్ళిన వారు ఇంటికి సేఫ్ గా వస్తారో రారో అని కలవరపడిన రోజులు అవి. లాలూ జైలు నుండే పాలించారు అని పేరు, ఆయన సతీమణి రబ్రీదేవి పేరుకే సీఎం, దాంతో ఆర్జేడీకి తిరుగులేదని నేతలు అంతా రెచ్చిపోయారు. ఒకానొక దశలో బీహార్ లో పాలనను చూసిన పాట్నా హైకోర్టు అటవిక పాలన బీహార్ లో జరుగుతోంది అని వ్యాఖ్యానించింది. ఇక నాటి నుంచే జంగిల్ రాజ్ అని ప్రత్యర్ధులు విమర్శించడం అది లాలూ పాలనకు సాగనంపే ఆయుధంగా మారడం జరిగింది.

మళ్ళీ కోలుకోలేదు :

ఇదిలా ఉంటే ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్న సమయంలో వాజ్ పేయి బీహార్ ఎన్నికల ప్రచారంతో మొత్తం సీన్ మార్చేశారు మహోన్నతుడైన రాజకీయ నేత అయిన వాజ్ పేయి బీహార్ లో లా అండ్ ఆర్డర్ మీద ఒకే ఒక్క డైలాగ్ తో శరసంధానం చేశారు. ఆయన ఆయన చేసిన ప్రసంగం మొత్తం లాలూ సామ్రాజ్యాన్ని కుప్ప కూల్చేసింది అని అంటారు. ఇదిలా ఉంటే వాజ్ పేయి ప్రసంగం తరువాత కిస్లే కూడా కిడ్నాపర్ల చెర నుంచి బయటపడి ఇంటికి చేరారు. ఇక కిస్లే కుటుంబ సభ్యులతో వాజ్ పేయ్ మాట్లాడి వారికి భరోసా ఇచ్చిన సంగతులను కూడా నాడు ఆయనతో ఉన్న అధికారులు ఈ రోజుకీ తలచుకుంటారు. ఏది ఏమైనా జంగిల్ రాజ్ పాలన అంటే చాలు బీహారీలు రెండు దశాబ్దాలు అయినా భయపడుతున్నారు అంటే ఆ పదిహేనేళ్ళూ ఏ విధంగా సాగాయో ఆలోచించాల్సిందే అంటారు రాజకీయ విశ్లేషకులు