Begin typing your search above and press return to search.

ఆ ప్రాంతంలో సూర్యుడికి వింటర్ హాలిడేస్... 65 రోజులు నో డ్యూటీ!

ఇక ఈ నగరంలో సుమారు 4,500 మంది నివాసితులు ఉండగా.. వీరిలో ఎక్కువ మంది ఇన్యూట్ కమ్యునిటీకి చెందినవారు.

By:  Raja Ch   |   24 Nov 2025 12:00 AM IST
ఆ ప్రాంతంలో సూర్యుడికి  వింటర్  హాలిడేస్... 65 రోజులు నో డ్యూటీ!
X

మీరు చదివింది నిజమే! సాధారణంగా... స్కూల్ కి వెళ్లే పిల్లలకు సమ్మర్ హాలిడేస్ నెలన్నర రోజుల వరకూ ఇస్తారు.. దాదాపు ఈ 45 రోజులూ వారికి పండుగే! ఈ మధ్య సమ్మర్ క్యాంపుల వల్ల ఆ పండుగ కాస్త తగ్గుముఖం పట్టినా.. హాలిడే హాలిడేనే అనుకునేవారూ ఉన్నారు! ఆ సంగతి అలా ఉంటే... సూర్యుడికి వింటర్ హాలిడేస్ సీజన్ ఓ ప్రాంతంలో వచ్చేసింది. ఇక 65 రోజులు అక్కడ సూర్యుడికి పని లేదు!

అవును... అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని ఉత్తరాన్న ఉన్న అలస్కాలోని ఉట్కియాగ్విక్ నగరంలో సూర్యుడు కనిపించడు! ఆ రోజు కనిపించకుండా పోయిన సూర్యుడు వారికి తిరిగి వచ్చే ఏడాది జనవరి 22నే మళ్లీ దర్శనమిస్తాడు. అప్పటి వరకూ ప్రతీ రోజూ రాత్రే! దీనిని పోలార్ నైట్ అంటారు. ఈ నగర ప్రజలు ఈ నెల 18నే ఈ ఏడాది చివరి పగటి వెలుతురును మధ్యాహ్నం 1:36 గంటలకు అనుభవించేశారు.

ఈ కాలంలో సూర్యుడు హోరిజోన్ క్రింద ఉంటారు.. భూమి వంపు కారణంగా సూర్యుడు చాలా వారాల పాటు అదృశ్యమవుతాడు. ఫలితంగా ఆర్కిటిక్ ప్రాంతాలు సూర్యరశ్మిని పొందవు. అయితే... వేసవిలో దీనికి విరుద్ధంగా జరుగుతుంది. అంటే... ధృవ పగటిపూట నిరంతరం సూర్యరశ్మి ఉంటుందన్నమాట. అంటే.. ఉట్కియాగ్విక్ లో మే నుంచి ఆగష్టు వరకూ సుమారు 80-85 రోజులు సూర్యుడు కనిపిస్తాడు.

ఇక ఈ నగరంలో సుమారు 4,500 మంది నివాసితులు ఉండగా.. వీరిలో ఎక్కువ మంది ఇన్యూట్ కమ్యునిటీకి చెందినవారు. అన్ని రోజుల పాటు సూర్యరశ్మి లేకుండా జీవించడంతో.. వీరి ఆరోగ్యంపై పెను ప్రభావం పడుతుంది. ఇందులో భాగంగా.. వారికి అలసట, విచారం, నిరాశ వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ పరిస్థితినే సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ అని అంటారు.

వాస్తవానికి ఈ చీకటి జీవితం వారికి ఒక సవాలే అయినప్పటికీ... వారి రోజువారీ జీవితం కొనసాగుతూనే ఉంటుంది. ఎవరి పనులు వారు చేసుకుంటారు.. ప్రజలు బయటకు వెళ్తారు.. స్కూల్స్ తెరుచుకుంటాయి. కాకపోతే 24 గంటలూ వీధి దీపాలు, ఇంటి లైంటింగ్ లోనే జరిగిపోతుంది. ఇక ఉష్ణోగ్రతల విషయానికొస్తే.. మైనస్ 20 నుంచి మైనస్ 30 డిగ్రీల సెల్సియస్ వరకూ ఉంటాయి.

ఇక కొద్దో గొప్పో సానుకూల అంశాలు అని భావిస్తే... ప్రజలు క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ సమయలో ఆ నగరం దాన్ని అందాన్ని అద్భుతంగా ప్రదర్శిస్తుంది. ఈ క్రమంలో.. ఉత్తర దీపాలు రంగురంగుల రిబ్బన్స్ వలే ఆకాశంలో ప్రకాశవంతంగా ప్రకాశిస్తాయి. పర్యాటకు పెద్ద ఎత్తున సందర్శిస్తుంటారు.